విశాఖపట్నం

ఉత్తమ పంచాయతీయలకు ప్రోత్సాహకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 2: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అధికంగా పనులు చేపట్టే గ్రామ పంచాయితీలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ఒక జీవోను జారీ చేసిందని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ గత నెల 31న జీవోను విడుదల చేసిందన్నారు. జిల్లాలోని గ్రామీణ పంచాయతీలన్నీ ఈ ప్రోత్సాహలకు పోటీ పడేలా అన్ని మండలాల అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ జీవో ప్రకారం ఉపాధి హామీలో ప్రతిభ కనబరిచే, లక్ష్యాలను అధిగమించే తొలి 50 పంచాయతీలకు ప్రోత్సాహకాలు లభిస్తాయన్నారు. దీని ప్రకారం బహిరంగ మలవిసర్జన లేని గ్రామంగా ప్రకటించిన పంచాయతీలకు, నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించిన పంచాయతీలకు అయిదు లక్షలు పారితోషికంగా చెల్లిస్తారన్నారు. గ్రామంలోని అన్ని గృహాల వద్ద ఇంకుడు గుంతలు తవ్విన పంచాయతీలకు రెండు లక్షలు చెల్లిస్తారన్నారు. ఎన్‌ఎడిఇపి కార్యక్రమంలో 50 వర్మీకంపోస్టు గుంతలు తవ్విన రెండు లక్షల చెల్లిస్తారన్నారు. మూడు కిలోమీటర్ల ఎవన్యూ ప్లాంటేషన్ చేసి నూరుతం మొక్కలు సంరక్షించిన పంచాయతీలకు రెండు లక్షల వరకు ఇస్తారన్నారు. గ్రామంలోని ప్రభుత్వ సంస్థల్లో ప్లాంటేషన్ పూర్తిచేసిన గ్రామాలకు రెండు లక్షలు చెల్లిస్తారన్నారు. పైన పేర్కొన్న ఆరు అంశాల్లో ఏ నాలుగింటిలోనైనా లక్ష్యాలను సాధించిన పంచాయతీలకు అదనపు ప్రోత్సాహకంగా రెండు లక్ష్యాలను సాధించిన పంచాయతీలకు అదనపు ప్రోత్సాహకంగా ఐదు లక్షలు చెల్లిస్తారన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2016-17)లో పై లక్ష్యాలను ముందుగా సాధించిన జిల్లాలోని 50 పంచాయతీలకు ఈ ప్రోత్సాహకులు లభిస్తాయన్నారు. ప్రోత్సహకంగా లభించిన నిధులను కూడా ఉపాధి హామీ కింద ఆయా గ్రామాల్లో చేపట్టే పనులకే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ఉపాధి హామీ నిబంధనల కింద చేపట్టే పనులకే ఈ ప్రోత్సాహాకులు లభిస్తాయన్నారు.