విశాఖపట్నం

సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 6: విద్యుత్ వినియోగదారులకు విశిష్ట సేవలందించే క్రమంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ సిఎండి’, స్పందన కార్యక్రమాలకు విశేష ఆదరణ లభిస్తోంది. ఎటువంటి జాప్యం లేకుండా సత్వర పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నందునే ఫలితాలొస్తున్నాయని సంస్థ భావిస్తోంది. ఇందులోభాగంగా సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు జరిగిన డయల్ యువర్ సిఎండిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన అనేకమంది వినియోగదారులు తమ సమస్యలను నేరుగా సంస్థ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ రేవు ముత్యాలరాజుకు విన్నవించుకున్నారు. ప్రధానంగా బిల్లుల్లో లోపాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇంటిపై ఉన్న విద్యుత్ తీగల మార్పు, తరచూ సరఫరాలో అంతరాయాలు వంటి వాటి గురించి సిఎండికి ఫిర్యాదులందాయి. అలాగే దీని తరువాత మధ్యాహ్నం రెండు గంటల వరకు గురుద్వార జంక్షన్ సమీపానున్న కార్పోరేట్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఐదు జిల్లాలకు చెందిన వినియోగదారులు పాల్గొని పలు సమస్యలపై వినతులు సమర్పించారు. ఈ విధంగా దాదాపు 35 వినతులుఅ దాయి. వీటన్నింటిని పరిశీలించి ప్రాధాన్యతా క్రమంలో సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని సిఎండి ముత్యాలరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు బొడ్డు శేషుకుమార్, టివియస్ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.రమేష్‌ప్రసాద్, చీఫ్ జనరల్ మేనేజర్లు పివివి సత్యనారాయం, కెయస్‌యన్ మూర్తి, ఓ.సింహాద్రి, జి.శ్రీనివాసరెడ్డి, పి.నాగేశ్వరరావు, ఏవి సూర్యనారాయణరావు, వి.విజయలలిత, తదితరులు పాల్గొన్నారు.
పడిగాపులు

విశాఖపట్నం, జూన్ 6: వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఎంసెట్ కౌనె్సలింగ్ సోమవారం ప్రారంభమైంది. సర్వర్ మొరాయించడంతో అభ్యర్థులు, తల్లితండ్రులు నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో పడిగాపులు పడ్డారు. ఉదయం 10 గంటలకు కౌనె్సలింగ్ ప్రారంభిస్తామని అధికారులు చెప్పడంతో ఉదయం 9 గంటల నుంచే అక్కడ సందడి ప్రారంభమైంది. అయితే సాంకేతిక కారణాలతో సర్వర్ పని చేయడం లేదని అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం 12 గంటలకు పని చేస్తుందని తొలుత ప్రకటించారు. తరువాత దానిని మధ్యాహ్నం ఒంటి గంటకు మార్చారు. ఒక వైపు వర్షం జల్లులు కురుస్తున్నా, అక్కడే ఉండిపోయారు. మధ్యాహ్నం మూడు గంటలకు కూడా ప్రారంభం కాకపోవడంతో తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు ఆరు గంటల పాటు వేచి ఉన్నా కౌనె్సలింగ్ ప్రారంభం కాకపోవడంతో అసహానికి గురైయ్యారు. పరిస్థితిని గమనించిన అధికారులు ఉన్నతాధికారులను సంప్రదించడంతో మాన్యువల్‌గా ధ్రువపత్రాలను పరిశీలించేందుకు అనుమతించారు. దీంతో తల్లితండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. విశాఖలో తొలిరోజు 415 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నర్సీపట్నంలో 20 మంది హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు కౌనె్సలింగ్ ప్రారంభించేందుకు కెమికల్ టెక్నాలజీ క్యాంపస్‌కు వచ్చారు. కానీ సాంకేతిక సమస్య కారణంగా కౌనె్సలింగ్ ప్రారంభించలేమని చెప్పడంతో అక్కడ చేసిన ఏర్పాట్లుపై ఆరా తీశారు. రోజుకు 900 మంది అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు మంత్రికి సెంటర్ ఇన్‌చార్జి శివప్రసాద్ తెలిపారు. మధ్యాహ్నం వరకూ ప్రారంభించే అవకాశం లేదని తెలియడంతో మంత్రి మీడియాతో, అభ్యర్థులతో మాట్లాడారు. కౌనె్సలింగ్‌కు వచ్చిన దిలీప్, లాస్యప్రియలను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్ట్ఫికెట్ల పరిశీలన జూన్ 15 వరకూ ఉంటుందని తెలిపారు. గత ఏడాది కంటే ఆరు రోజుల ముందుగా కౌనె్సలింగ్ ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. గత సంవత్సరం కౌనె్సలింగ్ తేదీల నిర్ణయం తీసుకున్న చర్యల కారణంగా రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా చేయగలిగామని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది వీలైనంత ముందుగానే కౌనె్సలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. జూన్ 9 నుంచి 20 వరకూ వెబ్ ఆప్షన్లను నింపేందుకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. 22న సీట్ల కేటాయింపులు ఉంటాయని, 27న తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. 325 ప్రైవేట్, 16 వర్సిటీ కళాశాలల్లో సీట్ల కేటాయింపు చేస్తారని తెలిపారు. మంగళవారం నుంచి ఎయులోని ఆన్‌లైన్ సెంటర్‌ల్లో కూడా కౌనె్సలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
తిరోగమనంలో డిగ్రీ ప్రమాణాలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 6: రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కళాశాలల్లో విద్యాప్రమాణాలు తిరోగమనంలో ఉన్నాయి. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన గ్రేడింగ్‌లతో వెలుగుచూసింది. రాష్ట్రంలోని 1209 డిగ్రీ కళాశాలల్లో కేవలం 63 కళాశాలలే ఎ-గ్రేడ్‌ను సాధించడం కళాశాలల పనితీరును చెప్పకనే చెబుతోంది. పలు అంశాలను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం ఈ గ్రేడ్‌లను ప్రకటించింది. ఇంజనీరింగ్ కోర్సులు, కళాశాలలపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించడం కూడా ఈ పరిస్థితికి కారణంగా చెప్పవచ్చు. రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల పనితీరును నాక్ అక్రెడిటేషన్, నాణ్యతా ప్రమాణాలు, సృజనాత్మకత, నైపుణ్యాభివృద్ధి, వౌలిక వసతులు, సామర్థ్యం పెంపు, ప్లేస్‌మెంట్స్, ప్రవేశాల సంఖ్య తదితర అంశాల ఆధారంగా గ్రేడ్‌లను ప్రభుత్వం ప్రకటించింది. కేవలం 63 కళాశాలలే ఎ-గ్రేడ్ సాధించడం గమనార్హం. 2000 సంవత్సరం నుంచి ప్రభుత్వం ఇంజనీరింగ్, మేనేజ్‌మేంట్, మెడిసిన్ తదితర కోర్సులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం తెలిసిందే. దీంతో సంప్రదాయ డిగ్రీ కోర్సులకు ఆదరణ తగ్గింది. ప్రవేశాలు కూడా గణనీయంగా పడిపోయాయి. దీంతో ఈ కళాశాలల నిర్వహణపై ఆయా వర్సిటీలు కూడా పెద్దగా దృష్టి సారించడం తగ్గించాయి. బిఎ, బికాం, బిఎస్సీ వంటి కోర్సుల్లో చేరేవారి సంఖ్య తగ్గింది. డిగ్రీ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం దృష్టి సారించి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. 100 పాయింట్లకు సంబంధించి 40-70 పాయింట్లతో 324 కళాశాలలు బి గ్రేడ్‌ను సాధించాయి. 414 కళాశాలలు సి గ్రేడ్ సాధించాయి. ఈ గ్రేడ్‌లతో చాలా కళాశాలల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు. 114 కళాశాలలే నాక్ అక్రెడిటేషన్‌కు వెళ్లడం విశేషం. ఇప్పటికే నాక్ అక్రెడిటేషన్ పొందిన కళాశాలల్లో కొన్నింటికి మరోసారి గుర్తింపు లభించలేనట్టు తెలిసింది. దీనికి తోడు ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరిన విద్యార్థులకు ఫీజు రిఎంబర్స్‌మెంట్ ఉండటంతో ఎక్కువ మంది ఆ కోర్సులవైపు మొగ్గుచూపడం కూడా డిగ్రీ కళాశాలలపై ప్రభావం చూపింది. ఇంజనీరింగ్ కళాశాలల్లో నుంచి బయటకు వస్తున్న విద్యార్థుల్లో చాలా మందికి పారిశ్రామిక వర్గాలు ఆశించిన స్థాయిలో ప్రమాణాలు ఉండకపోవడంతో ప్రభుత్వం సంప్రదాయ డిగ్రీ కోర్సులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా జవహర్ నాలెడ్జి సెంటర్ల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్‌ల ఏర్పాటు వంటి చర్యలు తీసుకుంటున్నది.
సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 6: విద్యుత్ వినియోగదారులకు విశిష్ట సేవలందించే క్రమంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ సిఎండి’, స్పందన కార్యక్రమాలకు విశేష ఆదరణ లభిస్తోంది. ఎటువంటి జాప్యం లేకుండా సత్వర పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నందునే ఫలితాలొస్తున్నాయని సంస్థ భావిస్తోంది. ఇందులోభాగంగా సోమవారం ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు జరిగిన డయల్ యువర్ సిఎండిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన అనేకమంది వినియోగదారులు తమ సమస్యలను నేరుగా సంస్థ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ రేవు ముత్యాలరాజుకు విన్నవించుకున్నారు. ప్రధానంగా బిల్లుల్లో లోపాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇంటిపై ఉన్న విద్యుత్ తీగల మార్పు, తరచూ సరఫరాలో అంతరాయాలు వంటి వాటి గురించి సిఎండికి ఫిర్యాదులందాయి. అలాగే దీని తరువాత మధ్యాహ్నం రెండు గంటల వరకు గురుద్వార జంక్షన్ సమీపానున్న కార్పోరేట్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఐదు జిల్లాలకు చెందిన వినియోగదారులు పాల్గొని పలు సమస్యలపై వినతులు సమర్పించారు. ఈ విధంగా దాదాపు 35 వినతులుఅ దాయి. వీటన్నింటిని పరిశీలించి ప్రాధాన్యతా క్రమంలో సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని సిఎండి ముత్యాలరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు బొడ్డు శేషుకుమార్, టివియస్ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.రమేష్‌ప్రసాద్, చీఫ్ జనరల్ మేనేజర్లు పివివి సత్యనారాయం, కెయస్‌యన్ మూర్తి, ఓ.సింహాద్రి, జి.శ్రీనివాసరెడ్డి, పి.నాగేశ్వరరావు, ఏవి సూర్యనారాయణరావు, వి.విజయలలిత, తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటా చెత్త సేకరణ చేపట్టాలి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 6: ఇంటింటా చెత్త సేకరణ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ఆదేశించారు. క్షేత్ర పర్యనటలో భాగంగా సోమవారం ఆయన పెదవాల్తేరు, చినవాల్తేరు నేతాజీవీధి, ఎయు రోడ్, తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఇంటింటా చెత్త సేకరణ విషయంలో సిబ్బంది ఎక్కడా రాజీపడకూడదన్నారు. అలాగే డంపర్ బిన్లను ఎప్పటికప్పుడు తరలించాలని, పాయింట్ల వద్ద చెత్త పేరుకుపోకుండా చూడాలన్నారు. నేతాజీవీధి గెడ్డలో పూడికతీత పనులను ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్య పనులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. 17,18 వార్డుల్లో పర్యటించిన ఆయన పలువురు స్థానికులను స్వయంగా కలుసుకుని వారి సమస్యలు విన్నారు. ఈప్రాంతంలో అవసరమైన చోట మొక్కలు నాటాలని హార్టీకల్చర్ అధికారిని ఆదేశించారు. పర్యటనలో ఆయన వెంట జోనల్ కమిషనర్ నల్లనయ్య, ఇఇ వెంకటి తదితరులు ఉన్నారు.
కమిషనర్‌కు సీనియర్
సిటిజన్ల అభినందన
విశాఖ నగరం సుందరీకరణలో శక్తివంచన లేకుండా శ్రమిస్తున్న జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌కు సీనియర్ సిటిజన్ల నుంచి అభినందనలు లభించాయి. ముఖ్యంగా ఇటీవల నిర్విహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ సందర్భంగా కలెక్టర్ యువరాజ్, జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్, పోలీసు కమిషనర్ అమిత్‌గార్గ్‌లు సమన్వయంతో పనిచేసి, విజయవంతం చేశారని కొనియాడారు. నగరం సుందరీకరణ విషయంలో కమిషనర్ తీసుకుంటున్న నిర్ణయాలను సీనియర్ సిటిజన్లు స్వాగతించారు. కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌ను ఆర్‌కె బీచ్‌లో కలుసుకున్న సీనియర్ సిటిజన్లు మీ పనితీరుకు తాము పూర్తి మద్దతు పలుకుతున్నట్టు వెల్లడించారు.
గుజరాత్‌ను రక్షించేందుకు ఉత్తరాంధ్ర బలి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 6: గుజరాత్‌ని రక్షించేందుకుగాను ఉత్తరాంధ్రను బలి చేయడం ఎంత వరకు సమంజసమని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ నర్సింగరావు ప్రశ్నించారు. జగదాంబ జంక్షన్ సమీపానున్న యల్లమ్మతోట పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుజరాత్‌లో నిర్మించాల్సిన అణు విద్యుత్ కేంద్రాన్ని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడకు తరలించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. అణు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నందుననే గుజరాత్‌ని రక్షించి, ఆంధ్రప్రదేశ్‌ని శిక్షించాలని కేంద్రం భావిస్తున్నట్టు ఉందన్నారు. భూ సేకరణలోను, పారిశ్రామిక సదుపాయాలు కల్పించడంలోను దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న గుజరాత్ నుంచి ప్లాంట్‌ని తరలించడం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. భారతదేశంలో ఎక్కడా అణు విద్యుత్ కేంద్రాలు పెట్టొద్దని డిమాండ్ చేశారు. కొవ్వాడలో ప్లాంట్ ఏర్పాటుకుగాను అనుమతులు కోసం ఇప్పటి వరకు కనీసం దరఖాస్తు చేయలేదన్నారు. ప్రపంచంలో ఎక్కడా పరీక్షించని అణు రియాక్టర్లను కొవ్వాడలో పెట్టడానికి నిర్ణయించడం దుర్మార్గమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. యురేనియం అధికంగా లభించే ఆస్ట్రేలియాలో ఒక్క అణువిద్యుత్ కేంద్రం కూడా లేదని గుర్తుచేవఆఱఉ. జపాన్‌లో పాత అణువిద్యుత్ కేంద్రాలను మూసివేశారన్నారు. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగ్తి 170 కిలోమీటర్ల వరకు ప్రభావం ఉంటుందన్నారు. ప్రభుత్వం శాస్తవ్రేత్తల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకుండా భూసేకరణ కోంస సన్నాహాలు చేయడం అన్యాయమన్నారు. సీపీఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తామని ప్రకటించారు.
రాహుల్ గాంధీ
త్వరలో మన్యంలో పర్యటన
పాడేరు, జూన్ 6: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ నెలాఖరులో విశాఖ మన్యంలో పర్యటించనున్నట్టు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తుడుము అశోక్ తెలిపారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మన్యంలో బాక్సైట్ ప్రబావిత ప్రాంతమైన చింతపల్లిలో ఆయన పర్యటన ఖరారైందని చెప్పారు. ఈ నెలాఖరులో రాహుల్ ఏజెన్సీలో పర్యటించి బాక్సైట్‌పై పరిశీలన చేయడమే కాకుండా గిరిజనులతో చర్చించనున్నట్టు పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ ఏజెన్సీ పర్యటనను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని ఆయన కోరారు.