విశాఖపట్నం

చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నక్కపల్లి, జూన్ 6: ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యమవుతుందని బిసి సంక్షేమం, ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఇక్కడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఐదురోజులుగా జరుగుతున్న నవజీవన దీక్షాకి సోమవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ చంద్రబాబుసంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషిచేస్తున్నారని, రాష్ట్రంలో 1.92లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. రైతులకు 50వేల కోట్ల రూపాయల మేర రుణమాఫీ జరుగుతుందన్నారు. బిసిలకు సబ్‌ప్లాన్ కమిటీ ఏర్పాటుచేసి ఆయా కులాల అభివృద్ధికి 832కోట్ల రూపాయల కేటాయింపు చంద్రబాబువల్లే సాధ్యమైందన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్‌మోహనరెడ్డి ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టంగా ఆయన అభివర్ణించారు. రాష్ట్భ్రావృద్ధికి జగన్ పూర్తిగా అడ్డుపడుతున్నారని రవీంద్ర దుయ్యబట్టారు. జగన్ నిరంకుశ వైఖరివలనే ఆ పార్టీ నుండి ఎమ్మెల్యేలు టిడిపిలోకి వలసలు వస్తున్నారన్నారు. ఇప్పటికైనా జగన్ తన ప్రవర్తన మార్చుకోకపోతే ప్రజలు క్షమించరని హెచ్చరించారు. చంద్రబాబుపై జగన్ అనుచిత వ్యాఖ్యలను మంత్రి రవీంద్ర తీవ్రంగా ఖండించారు. మంత్రి రవీంద్ర పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సమావేశంలో ఎంపీ అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రానికి 24గంటలు విద్యుత్ సరఫరా చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపిపి ఎం. లావణ్య, వినోద్‌రాజు, మండల పార్టీ అధ్యక్షుడు కె.వెంకటేష్, లోవకాశీనాయుడు, జెడ్పీటిసిలు కొప్పిశెట్టి కొండబాబు, రాగిన వెంకటరమణ, ప్రత్యేకాధికారి నర్సింహారావు, తహశీల్దార్, ఎంపీడివో జగన్‌మోహన రావు, ఇవోఆర్‌డి కుమార్, మండల సూపరింటెండెంట్ కృష్ణ పాల్గొన్నారు.