విశాఖపట్నం

రాష్ట్భ్రావృద్ధికి చంద్రబాబు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరాపల్లి, జూన్ 6: ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని బిసి సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్ధానిక ద్రోణంరాజు ఆడిటోరియంలో సోమవారం నవ నిర్మాణ దీక్షలో ఆయన మాట్లాడుతూ స్వార్ధ రాజకీయాలకోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభాసుపాలు చేసిందన్నారు. సమన్యాయం చేయవల్సిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ఆస్తులిచ్చి ఆంధ్రప్రదేశ్‌ను అప్పులు పాలుచేసిందని, క్లిష్ట పరిస్ధితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ది పధంలో నడిపించడానికి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. పోలవరం నీటి ద్వారా భవిష్యత్‌లో వ్యవసాయ రంగం అభివృద్ధి జరుగుతుందని, విశాఖ తాగు, సాగునీటికి ఎటువంటి ఢోకా ఉండదన్నారు. 10.99 శాతం వృద్ధిరేటు సాధించామన్నారు. 11.7 శాతం పరిశ్రమల ద్వారా రూ.లక్షా 7వేలు తలసరి ఆదాయం పెరిగిందన్నారు. బిసి కార్పొరేషన్ ద్వారా రూ.620 కోట్లు రుణాలు ఇచ్చామని మంత్రి రవీంద్ర అన్నారు.
అనకాపల్లి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజధాని నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని, రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. సమన్వయంతో పనిచేసి రాష్ట్భ్రావృద్ధిలో కీలకపాత్ర పోషించాలని కోరారు. అభివృద్ధిని అడ్డుకోకుండా ప్రజాప్రతినిధులు ఐక్యతతో పనిచేస్తే రాష్ట్రం మరింత ముందుకు వెళుతుందన్నారు. అనంతరం తహశీల్ధార్ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మంత్రి కొల్లు రవీంద్రతోపాటు ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అంతకుముందు వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెసి నివాస్, ప్రత్యేక అధికారి గోవిందరావు, ఎంపిపిలు కిలపర్తి భాస్కరరావు, జెడ్పీటిసిలు గాలి వరలక్ష్మి, పి.సత్యవతి, శంకర్రావు, టిడిపి నాయకులు గండి ముసలినాయుడు, గాలి రవికుమార్, మహేశ్వరినాయుడు, చల్లా నానాజీ, బండారు రామారావు, ఎంపిడిఓలు సిహెచ్ సుబ్బలక్ష్మి, ఆర్.పూర్ణిమాదేవి, తహశీల్ధార్‌లు వైఎస్.నాగరాజు, వై.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
రూ. 5 కోట్లతో జిల్లాకో
బిసి భవనం నిర్మాణం
* బిసి సంక్షేమ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర
దేవరాపల్లి, జూన్ 6: జిల్లాకో బిసి భవనం ని ర్మి ంచడానికి రూ.5 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశామని బిసి సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం దేవరాపల్లిలో మ ంత్రి విలేఖరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చం ద్రబాబు రాష్ట్రాని అభివృద్ధి చేస్తుండడం చూడలేక తట్టుకోలేక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలను తప్పుతోవ పట్టించడానికి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆంధ్రరాష్ట్రం అభివృద్ధిలో ముందడుగు వేస్తుండడం చూడలేక ప్రతిపక్షం భయాందోళనలు చెందుతున్నాయన్నారు. చంద్రబాబుపై బురదచల్లడం ఎంతవరకు సమంజసమన్నారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు మాని అభివృద్దికి సహకరించాలని హితవు పలికారు. బిసి హాస్టల్స్‌ని దశలవారీగా రెసిడెన్సియల్ హాస్టల్‌గా త్వరలో మార్చుతామన్నారు. నియోజకవర్గానికి రూ.10 లక్షలతో కమ్యూనిటీ భవనం నిర్మాణం చేపడతామన్నారు. అంతకు ముందు పర్యావరణ పరిరక్షణ కోసం కార్యాలయం ఆవరణలో మొక్కలను మంత్రి రవీంద్ర నాటారు. ఈయన వెంట ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపిపి కిలపర్తి భాస్కరరావు ఉన్నారు.