విశాఖపట్నం

గత పాలకుల వల్లే పరిశ్రమలు రాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కశింకోట, జూన్ 6: గత పాలకుల చలవ వల్లే నియోజకవర్గానికి పరిశ్రమలు రాకుండా పోయాయని ఎమ్మెల్యే పీలాగోవి ంద స్పష్టం చేశారు. సో మవారం స్థానిక ఆర్‌ఇసిఎస్ కార్యాలయం ప్రాంగణంలో నవనిర్మాణదీక్షలో ఎమ్మెల్యే ప్రసంగించారు. నియోజకవర్గంలోని సంపతిపురం, వల్లూరు, కోడూరు గ్రామ రెవెన్యూ పరిధిలో కంపెనీలు వస్తున్నాయన్నారు. స్థానికులకు ఉపాధి దొరుకుతుందన్నారు. కుటుంబ ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని, విద్యకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని, తల్లిదండ్రులు వారి పిల్లలను బాగా చదివించాలన్నారు. స్థానిక శారదనదిపై సుమారు రెండుకోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేశామన్నారు. నియోజకవర్గంలోని 108 చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టి పనులు చేస్తున్నామన్నారు. సుమారు 8.50కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. మామిడివాకగెడ్డ, రంగుబోలుగెడ్డల్లో పూడికతీత పనులు చేపడుతున్నామని, దీంతో వరదలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నామన్నారు. నరసాపురం ఆనకట్ట పనులు కూడా పూర్తి కావస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటిసి మలసాల ధనమ్మ, ఎంపిపి పెంటకోట సుబ్బలక్ష్మీ, ఆర్డీవో పద్మావతి, ప్రత్యేకాధికారి డాక్టర్ సిరి, అనకాపల్లి జెడ్పీటిసి పల్లెల గంగాభవానీ, విశాఖ డెయిరీ డైరక్టర్ మలసాల రమణారావు, అనకాపల్లిపట్టణ టిడిపి అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, నియోజకవర్గ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మళ్ల సురేంద్ర, డిసిసిబి డైరక్టర్ శిదిరెడ్డి శ్రీనివాసరావు, టిడిపి నాయకులు వేగి గోపికృష్ణ, వేగి వెంకట్రావు పాల్గొన్నారు.