విశాఖపట్నం

గంజాయి అక్రమ రవాణాపై నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం,జూన్ 6: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుండి తరలిస్తున్న గంజాయి రవాణాపై గట్టి నిఘా ఏర్పాటుచేశామని నర్సీపట్నం ఎఎస్పీ ఐశ్వర్యరస్తోగి తెలిపారు. గంజాయి రవాణా నిరోధానికి ఇప్పటికే ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. సోమవారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో గంజాయి రవాణా, రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారన్నారు. ఈమేరకు డివిజన్‌లోని పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్సైలను అప్రమత్తం చేశామన్నారు. కొంతకాలంగా గంజాయి వ్యాపారం సాగిస్తున్న స్మగ్లర్ల జాబితాలను సిద్ధం చేస్తున్నామన్నారు. గంజాయి వ్యాపారులపై మారక ద్రవ్యాల నిరోధక చట్టంకింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రెండు నెలల కాలంలో డివిజన్‌లో 3,630 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 40 మందిని అరెస్ట్ చేశామన్నారు. మరికొంత మంది పరారీలో ఉన్నారని, వారిని కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు. గంజాయి రవాణాలో ఇటీవల విద్యార్థులు పట్టుబడడం బాధాకరమన్నారు. ఒకసారి కేసు నమోదైతే వారి ఉజ్వల భవిష్యత్ నాశనం అవుతుందన్నారు. గంజాయి స్మగ్లర్ల ఉచ్చులో పడి కేసుల్లో చిక్కుకోవద్దని హితవుపలికారు. డివిజన్‌లో రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు నిబంధనలను కఠినతరం చేస్తున్నామన్నారు. ప్రమాదాల నివారణ కోసం తీసుకుంటున్న చర్యలు ఇప్పటికే మంచి ఫలితాలనిచ్చాయన్నారు. ట్రాఫిక్ నిబంధనల అతిక్రమించిన వాహనదారులపై 10వేల వరకు కేసులు నమోదు చేశామని తెలిపారు. ప్రాణ రక్షణ కోసం ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్‌ను ధరించాలన్నారు. మద్యం బెల్ట్ షాపుల నిర్వాహకులపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. చట్ట విరుద్దంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు దఫాలు కేసులు నమోదైతే రౌడీ షీటర్‌గా నమోదు చేస్తామని ఎఎస్పీ రస్తోగి స్పష్టం చేశారు.