విశాఖపట్నం

ఎఓబిలో పోలీసులు గాలింపు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, జూన్ 6: ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. సరిహద్దు ప్రాంతమంతా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని అనువణువునా గాలిస్తున్నారు. ఇటీవల మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలి అగ్రనేతలను కోల్పోయిన విషయం తెలిసిందే. మరికొంతమంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. దీంతో పోలీసులు మావోయిస్టుల దళాలను పూర్తిగా నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమయ్యారు. మావోలు స్వచ్ఛందంగా లొంగిపోతే వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయమని ప్రకటనలు చేస్తున్నారు. మావోయిస్టు ఇన్‌ఫార్మర్ వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు చర్యలు చేపడుతున్నారు. ఎఓబిలో విస్తృతంగా కూంబింగ్ చేపడుతూ మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.