విశాఖపట్నం

విశాఖ ఖ్యాతి మరింత పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 10: విశాఖ ఖ్యాతి మరింత ప్రజ్వరిల్లేలా కార్యకపాలు చేపట్టనున్నట్టు మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖలో జూలై 2న నిర్వహించే బే మారథాన్ మెడల్స్‌ను శుక్రవారం ఆవిష్కరించిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి వేడుకలకు వేదిగా నిలుస్తున్న విశాఖలో భవిష్యత్‌లో మరిన్ని కార్యకలాపాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీచ్‌రోడ్డులో యోగా ప్రదర్శన నిర్వహిస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. వేలాది మంది ఉద్యోగులు, స్థానికులతో యోగా దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే జూలై 2న బే మారథాన్ నిర్వహణకు కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం క్రీడలు, యోగా, వ్యాయామం తదితర అంశాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దీనిలో భాగంగానే విద్యార్థులకు ఉత్తీర్ణత సర్ట్ఫికెట్లతో పాటు క్రీడలు, యోగా, సాంకేతిక కార్యక్రమాలకు సంబంధించి సర్ట్ఫికెట్లను ఇవ్వనున్నట్టు తెలిపారు. పాఠశాలల్లో ఫిజికల్ లిటరసీని ప్రోత్సహించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 650 మంది వ్యాయామ శిక్షకులుకు ఫిజికల్ లిటరసీలో శిక్షణనిచ్చామన్నారు.ప్రతి పాఠశాలలో ఫిజికల్ లిటరసీని తప్పని చేస్తున్నట్టు తెలిపారు.