విశాఖపట్నం

విశాఖలో జూలై 2న బే మారథాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 10: విశాఖ ఆర్‌కె బీచ్ వేదికగా జూలై 2న బే మారథాన్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. తొలి సారిగా రాత్రి సమయంలో మారథాన్ నిర్వహించాలని నిర్ణయించారు. అందుకు విశాఖ అనుకూలంగా ఉంటుందని భావించి బే మారథాన్ నిర్వహణకు సంబంధించి మెడల్స్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ఆవిష్కరించారు. తొలి సారిగా రాత్రి వేళలో జరుగుతున్న బే మారథాన్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వంటి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలకు వేదికగా నిలిచిన విశాఖ నగరంలో బే మారథాన్ నిర్వహించాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న విశాఖ ఆర్‌కె బీచ్‌లో నిర్వహించే కార్యక్రమంలో సిఎం చంద్రబాబు పాల్గొంటారన్నారు. క్రీడలకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత నిస్తోందని ఈ సందర్భంగా మంత్రి గంటా వెల్లడించారు. 2019లో జరిగే జాతీయ క్రీలను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విశాఖ కేంద్రంగా స్పోర్ట్స్‌సిటీ ఏర్పాటు, రూ.350 కోట్లతో క్రీడా సముదాయం నిర్మిస్తున్నట్టు మంత్రి చెప్పారు.