విశాఖపట్నం

పనే ముఖ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 25: ప్రజెంటేషన్ కాదు పని ముఖ్యమని, పని బాగుండాలని, విశాఖ స్మార్ట్‌సిటీ దేశానికే తలమానికం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా రు. స్మార్ట్‌సిటీ మిషన్‌పై ప్రధాని మోదీతో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన జిల్లా అధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం తొలి విడతగా ఎంపిక చేసిన స్మార్ట్‌సిటీల్లో చోటు దక్కించుకున్న విశాఖ నగరం అదే స్ఫూర్తితో ఆకర్షణీయ నగరంగా ఎదగాలని అభిలషించారు. ఇప్పటికే నగరానికి కొత్త అందాలు తీసుకురావడంలో అధికారులు సఫలీకృతమైనప్పటికీ కొన్ని లోపాలు, సాధించిన అభివృద్ధిని మరుగున పడేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. నగర సుందరీకరణలో భాగంగా చేపట్టిన పనులు కొన్ని అద్భుతంగా ఉండగా, మరికొన్ని చెత్తగా ఉన్నాయని, వీటిని సరి చేసుకుని ముందుకు సాగాలన్నారు. సుందరీకణకు సంబంధించి ప్రైవేటు ఏజెన్సీలకు అవకాశం ఇస్తే వారి ఆలోచనలు కూడా పంచుకునే అవకాశం ఉంటుందన్నారు.ఇక నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ప్రధానంగా బహిరంగ మల విసర్జన పూర్తిగా నియంత్రించాలన్నారు. ఆగస్టు 15 నాటికి ఈ అంశంపై పూర్తి విజయం సాధించాలన్నారు. అలాగే స్మార్ట్‌సిటీ ప్రణాళికలో భాగంగా చేపడుతున్న పలు అంశాలు అటు ప్రభుత్వ పరంగా జరుగుతున్న కార్యక్రమాలతో అనుసంధానం కావాల్సి ఉందన్నారు. మంచినీటి సరఫరా, విద్యుత్ విభాగాల్లో స్మార్ట్ మీటర్లను అనుసంధానం చేసే క్రమంలో ప్రభుత్వ సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానించుకోవాలని సూచించారు. దీనిపై అన్ని విభాగాల అధికారులు కలిసి చర్చించుకుంటే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా అందరికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్న నేపథ్యంలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను రాష్ట్ర సర్వర్‌కు అనుసంధానం చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని, అందుకు రాష్ట్ర ఐటి సలహాదారు సూచనలు తీసుకోవాలని సూచించారు. నగరంలో భత్రదకు సంబంధించి వీడియో కెమేరాలను అమర్చి వాటిని సిసిసికి అనుసంధాన పరచాలలన్నారు. జివిఎంసి ఆస్తులు, ఇతర అంశాలను జియో ట్యాగింగ్ చేయడం, తద్వారా వాటిని సిసిసిలో పొందుపరచడం ద్వారా పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయన్నారు. నగర సమగ్రాభివృద్ధికి సంబందించి ఇప్పటికే విశాఖను అమెరికా సాంకేతిక సహకారంతో స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దే ప్రాజెక్టుకు ప్రణాళికలు తయారవుతున్న తరుణంలో ఇప్పటి నుంచి ఆయా కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. దీనిపై జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ వివరణనిస్తూ స్మార్ట్‌సిటీకి సంబంధించి స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పివి) ఏర్పాటు కావాల్సి ఉందని, దీని రూపకల్పన జరిగిన తర్వాత అన్ని శాఖల సమన్వయంతో పూర్తి స్థాయి ప్రణాళికను రూపొందించుకుంటామన్నారు. దీనిపై వచ్చే వారంలో కన్సల్టెంట్ నియామకం జరగనుందన్నారు. అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే స్మార్ట్‌సిటీ రూపకల్పన అసాధ్యమేమీ కాదన్నారు. సమావేశంలో మంత్రులు సిహెచ్ అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎంపిలు కె హరిబాబు, ఎం శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు ఎంవివిఎస్ మూర్తి, శాసనసభ్యులు, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కరికాల వలవన్, కలెక్టల్ ఎన్ యువరాజ్, పోర్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు, ఇపిడిసిఎల్ సిఎండి ఆర్ ముత్యాలరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. చేయడం, తద్వారా వాటిని సిసిసిలో పొందుపరచడం ద్వారా పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయన్నారు. నగర సమగ్రాభివృద్ధికి సంబందించి ఇప్పటికే విశాఖను అమెరికా సాంకేతిక సహకారంతో స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దే ప్రాజెక్టుకు ప్రణాళికలు తయారవుతున్న తరుణంలో ఇప్పటి నుంచి ఆయా కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. దీనిపై జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్ వివరణనిస్తూ స్మార్ట్‌సిటీకి సంబంధించి స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పివి) ఏర్పాటు కావాల్సి ఉందని, దీని రూపకల్పన జరిగిన తర్వాత అన్ని శాఖల సమన్వయంతో పూర్తి స్థాయి ప్రణాళికను రూపొందించుకుంటామన్నారు. దీనిపై వచ్చే వారంలో కన్సల్టెంట్ నియామకం జరగనుందన్నారు. అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే స్మార్ట్‌సిటీ రూపకల్పన అసాధ్యమేమీ కాదన్నారు. సమావేశంలో మంత్రులు సిహెచ్ అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎంపిలు కె హరిబాబు, ఎం శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు ఎంవివిఎస్ మూర్తి, శాసనసభ్యులు, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కరికాల వలవన్, కలెక్టల్ ఎన్ యువరాజ్, పోర్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు, ఇపిడిసిఎల్ సిఎండి ఆర్ ముత్యాలరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కొత్తకోట పిహెచ్‌సిలో సౌకర్యాలు లేవి!
* డిఎంహెచ్‌ఒపై ఎమ్మెల్యేలు, సభ్యుల ఆగ్రహం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 25: రావికమతం మండలం కొత్తకోటలో పిహెచ్‌సి ఏర్పా టు చేసి ఆరు నెలలు కావస్తున్నా, వౌలిక సదుపాయాలు కల్పించకపోవడంపై డిఎంహెచ్‌ఒ డాక్టర్ సరోజినిపై ఎమ్మెల్యేలు కెఎస్‌ఎన్ రాజు, బండారు సత్యనారాయణ మూర్తి, కొంతమంది జడ్పీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం ఇక్కడ శనివారం జరిగింది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖపై జరిగిన చర్చలో ఆ పిహెచ్‌సిలో వైద్య పరికరాలు, తదితర సౌకర్యాలు లేకపోవడంపై డిఎంహెచ్‌ఒ డాక్టర్ సరోజినిని ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు ప్రశ్నించారు. పిహెచ్‌సికి అవసరమైన వివిధ పరికరాలు కొనుగోలు చేసేందుకు జిల్లా కలెక్టర్ అనుమతించగా, అవసమైన నిధులు కేటాయించినప్పటికీ ఈ దిశగా చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరునెలలుగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, తాను పలుసార్లు అడిగినా ఫలితం లేదని ఆరోపించారు. ఇందుకు డిఎంహెచ్‌ఒ బదులిస్తూ జిల్లాలో అన్ని పిహెచ్‌సిలకు కలిపి నివేదిక తయారు చేసే ప్రయత్నం వల్ల ఆలస్యమవుతోందని తెలిపారు. డిఎంహెచ్‌ఒ సమాధానంపై అగ్రహించిన కొంతమంది జడ్పీటీసీ సభ్యులు కూడా వేదిక ముందుకు వచ్చి విమర్శలు చేశారు. ఆంబులెన్సుకు సైరన్ కోసం కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ఈ దశలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి జోక్యం చేసుకుని కలెక్టర్ లేఖలో అన్ని పిహెచ్‌సిలకు కలిపి నివేదిక తయారు చేయమన్నారా? లేక ఆ పిహెచ్‌సి గురించి రాశారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఇచ్చిన లేఖపై చర్యలు తీసుకోకుండా, ఇతర పిహెచ్‌సిలను కలపడాన్ని తప్పుపట్టారు. ఎప్పటిలోగా ఈ పిహెచ్‌సి సమస్యపై చర్యలు తీసుకుంటారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అమె సోమవారం నాటికి చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. చీడికాడ, మునగపాక జడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ సిరింజ్‌లు లేవని, సిబ్బంది కొరత వేధిస్తున్నదని ఆరోపించారు.

మొక్కుబడిగా...
జెడ్పీ సర్వసభ్య సమావేశం
తూతూమంత్రంగా అజెండా అంశాలపై చర్చ
ఆలస్యంగా వచ్చిన అధికారులు
విశాఖపట్నం, జూన్ 25: ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం మొక్కబడిగా సాగింది. జిల్లా మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు హాజరు కాకపోవడంతో ఎజెండాలోని అంశాలపై ఎక్కువగా చర్చించకుండా ముగించారు. దాదాపు మూడు నెలల తరువాత జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశాన్ని జడ్పీ చైర్‌పర్సన్ లాలం భవానీ అధ్యక్షతన జరిగింది. జిల్లా మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, కొంతమంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్, జాయింట్ కలెక్టర్ తదితర అధికారులు కూడా చాలా సేపటి వరకూ రాలేదు. కోరం చాలనందున ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. సిఎం పర్యటన ఉండటంతో వివిధ అంశాలపై పెద్దగా చర్చించకుండానే సమావేశాన్ని ముగించారు. సమావేశానికి హాజరైన ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, కెఎస్‌ఎన్ రాజు, కిడారి సర్వేశ్వరరావు, వంగలపూడి అనిత, బూడి ముత్యానాయుడు, ఎమ్మెల్సీలు ఎంవివిఎస్ మూర్తి, శ్రీనివాసులు నాయుడు ఎక్కువ సేపు మాట్లాడారు. వైస్ చైర్మన్ కె.అప్పారావు సహా కొంతమంది జడ్పీటీసీ సభ్యులు మాట్లాడేందుకు అవకాశం లభించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభానికి ముందు చైర్‌పర్సన్ లాలం భవానీ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం కావడంతో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అన్ని రకాల విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. వాతావరణంలో మార్పుల కారణంగా అంటు వ్యాధుల ప్రబలే అవకాశం ఉందని, దీనిపై అధికార యంత్రాంగం దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ముందుగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన వివరాలను వ్యవసాయ శాఖ జెడి సత్యనారాయణ వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకూ సరైన వర్షాలు పడలేదని, అందువల్ల పంట బీమా గడువును ఆగస్టు 31 వరకూ పొడిగించాలని కోరారు. ఒక్కో పంటకు ఒక్కో గడువును విధించడం వల్ల రైతులకు అర్ధం కాదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అన్ని పంటలకూ ఒకే తేదీని అమలు చేయాలని సూచించారు. దీనిపై జిల్లా కలెక్టర్ డాక్టర్ యువరాజ్ స్పందిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ రంగానికి 60 శాతం, వ్యవసాయేతర రంగానికి 40 శాతం నిధులను మెటీరియల్ కాంపొనెంట్‌గా ఖర్చు చేస్తామన్నారు. చెట్టు పథకం కింద జిల్లాలో కోటి మొక్కలను నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించామన్నారు. జిల్లాలో దాదాపు 250 గ్రామాల్లో బోర్లు లేవని, బోర్లు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో బోర్లు వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

జివిఎంసి సేవలతో సిసిసి ప్రారంభం
* అందుబాటులోకి 10 సేవలు
* భవిష్యత్‌లో మరింత విస్తృతం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 25: స్మార్ట్‌సిటీ రూపకల్పనలో తొలి అడుగు పడింది. ప్రభుత్వ పరంగా అందే సేవలను ఒకే ఛత్రం కిందకు తెచ్చే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సిసిసి)ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ప్రారంభించారు. జివిఎంసి కార్యాలయంలో ప్రాథమికంగా ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను ప్రారంభించగా, జివిఎంసికి సంబంధించి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారంతో పాటు కొన్ని ప్రధాన సేవ లు అందుబాటులోకి రానున్నాయి. రెవెన్యూకి సంబంధించి కొన్ని సేవలతో పాటు సిటిజన్ చార్టర్, పర్యావరణంలో కాలు ష్య స్థాయి, ఉష్ణోగ్రతలు, వాతావరణం, వాహనాల పర్యవేక్షణ, ఘన వ్యర్థాల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, తదితర అంశాలను ప్రస్తుతానికి ఈ సెంటర్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. తాత్కాలికంగా సిసిసి కేంద్రాన్ని జివిఎంసి ప్రధాన భవనంలో ఏర్పాటు చేసినప్పటికీ, భవిష్యత్‌లో రూ.144 కోట్ల వ్యయంతో స్మార్ట్‌సిటీ ప్రాంతం ఆర్‌కె బీచ్ వద్ద ఏర్పాటు చేయనున్నారు. వచ్చే రెండేళ్లలో ఈ సెంటర్‌ను పూర్తి స్థాయిలో ఆధునీకరించి, సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భవిష్యత్‌లో ప్రభుత్వ పరంగా అందే అన్ని సేవలతో పాటు సమాచారం, ఇతర అంశాలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారానే జరగనున్నాయి.జివిఎంసితో పాటు రెవెన్యూ, పోలీసు, కాలుష్య నియంత్రణ మండలి, విపత్తుల యాజమాన్య వ్యవస్థ సహా పలు శాఖలను ఈ సెంటర్ పరిధిలోకి తీసుకురానున్నారు.

సుజల స్రవంతిపై తీర్మానానికి కపట రాజకీయం
పాడేరు, జూన్ 25: ఉత్తరాంధ్ర సుజ ల స్రవంతి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని కోరుతూ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీర్మానించేందుకు జెడ్పీ చైర్‌పర్సన్ కపట రాజకీయాన్ని ప్రదర్శించారని చీడికాడ జెడ్పీటీసీ సభ్యురాలు పి. సత్యవతి విమర్శించారు. శనివారం సాయంత్రం ఆమె స్థానిక విలేఖరలతో మాట్లాడుతూ ఈ నెల 25న జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో సుజల స్రవంతిపై తీర్మానించాలని తాను డిమాండ్ చేయగా, సమావేశంలో ఏజెండా అంశాలపై చర్చించిన తరువాత తీర్మానించేందుకు చైర్‌పర్సన్ లాలం భవాని అంగీకరించారని చెప్పా రు. అయితే అజెండా అంశాలు చర్చించిన తరువాత చైర్‌పర్సన్ సుజల స్రవంతిపై తీర్మానానికి అంగీకరించకుండా కప్పదాటు వైఖరిని ప్రదర్శించారని ఆమె అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో లక్షలాది ఎకరాల పంట భూములకు సేద్యపు నీటిని అందించే సుజల స్రవంతిపై చైర్‌పర్సన్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ఆమె చెప్పారు. ఈ ప్రాజెక్టును నిర్మిస్తే దాదాపు ఎనిమిది లక్షల ఎకరాల సేద్యపు భూమికి సాగునీరు అందుతుందని, విశాఖ జిల్లాలోనే మూడు లక్షల ఎకరాల పంట భూమికి లబ్ధి చేకూరుతుందని ఆమె పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అధిక శాతం మంది వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకుని జీవిస్తుండగా ఎంతో ముఖ్యమైన సుజల స్రవంతి ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని ఆమె విమర్శించారు. ఉత్తరాంధ్ర జిల్లా ల్లో 23.24 లక్షల ఎకరాల సాగుభూమి ఉండగా ఇందులో కేవలం ఎనిమిది లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుందని, విశాఖ జిల్లాలో 6.31 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం లేదని సాక్షాత్తు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిన అంశాన్ని ఈ సందర్భం గా ఆమె ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన తరువాత దీనిని పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సం క్షేమం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సుజల స్రవంతి ప్రాజెక్టును తక్షణమే చేపట్టాలని,జిల్లా పరిషత్ సమావేశంలో ఈ విషయమై తీర్మానించాలని ఆమె డిమాండ్ చేశారు. వ్యవసాయం రంగం లో ఎంతో వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలను సస్యశామలం చేయాలంటే సుజల స్రవంతి ప్రాజెక్టును తక్షణమే నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉం దని సత్యవతి చెప్పారు. ఈ కార్యక్రమం లో సుజల స్రవంతి సాధన సమితి నాయకులు పి.వి.జి.కుమార్, అడపా నరసింహమూర్తి, జి.సత్యనారాయణరాజు, గొల్లవెల్లి శ్రీరామమూర్తి, ఎం. అప్పలనాయుడు పాల్గొన్నారు.

అధికారులు లేకుండా సమావేశమా?
* జడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధుల ఆగ్రహం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూన్ 25: జిల్లా ఉన్నతాధికారులు సమావేశానికి హాజరుకానప్పుడు సమావేశాలు ఎందుకంటూ పలువులు ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు హాజరు కావడం కుదరనప్పుడు జడ్పీ సమావేశాన్ని వాయిదా వేయాలన్నారు. జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం శనివారం ఇక్కడ జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్, జాయిం ట్ కలెక్టర్ హాజరు కాకపోవడంపై ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి, కొంతమంది జడ్పీటీసీ సభ్యలు అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ జెడి సత్యనారాయణ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన గురించి వివరిస్తున్న సమయంలో వివిధ పంటలకు వేర్వేరు గడువును విధించడంపై ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి మాట్లాడు తూ ఆగస్టు 31 గడువుగా ఉంటే బాగుండని తెలిపారు. ఈ విషయమై సరైన సమాధానం జెడి చెప్పకపోవడంతో ఈ సమావేశానికి హాజ రు కావడానికి కలెక్టర్‌కు తీరికలేనట్లుందని వ్యాఖ్యానించారు. సిఎం రాక, చీఫ్ సెక్రటరీ వీడియో కాన్ఫరెన్సు కారణంగా కలెక్టర్ రాలేకపోయారని సిఇఒ జయప్రకాష్ నారాయణ వివరణ ఇచ్చారు.అన్ని పంటలకూ ఒకే రోజును గడువుగా నిర్ణయించమని కలెక్టర్‌కు చెప్పమని సిఇఒకు తెలిపారు. ఎంపి శ్రీనివాసరావు జోక్యం చేసుకుని పార్లమెంట్ సభ్యులకు పార్లమెంట్, ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఉంటుందని, కానీ జడ్పీటీసీలకు కేవలంజిల్లా పరిషత్ సమావేశమై ప్రశ్నించేందుకు, తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు వేదిక అని గుర్తు చేశారు. కలెక్టర్, జెసి సమావేశానికి హాజ రు కానప్పుడు వాయిదావేయాలన్నారు. 15 రోజుల ముందుగానే తేదీ నిర్ణయించామని, సిఎస్ వీడియో కాన్ఫరెన్సు కారణంగా ఆలస్యంగా వస్తామని కలెక్టర్ చెప్పినట్లు సిఇఒ వివరించారు. ఎమ్మెల్యే బండారు జోక్యం చేసుకుని పది నిమిషాలైనా వచ్చి వెళ్లాలి కదా? అని ప్రశ్నించారు.మరికొంత మంది సభ్యులు కూడా 3 నెలలకు ఒకసారి జరిగే సమావేశానికి అధికారులు హాజరుకాకపోతే తమ సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు. మండల పరిషత్ సమావేశాలకు హాజరు కాని అధికారులపై చర్యలు లేకపోవడంతో ఆ సమావేశాలకు వారు హాజరు కావడం లేదని సభ్యులు ఆరోపించారు.ఇందుకు సిఇఒ బదులిస్తూ అచ్యుతాపురం మండల సమావేశానికి హాజరుకాని వారి కి ఒక రోజు వేతనంలో కోతవిధించామన్నారు.

రూ. 73 కోట్లతో
మున్సిపాలిటీకి తాగునీటి ప్రాజెక్ట్
* మున్సిపల్ శాఖ
సంచాలకులు కన్నబాబు
యలమంచిలి, జూన్ 25: పూర్తి స్థాయిలో యలమంచిలి మున్సిపాలిటీకి తాగునీరు సరఫరా చేయడానికి రూ.73కోట్లతో నిర్మించనున్నట్టు మున్సిపల్ శాఖ సంచాలకులు కె.కన్నబాబు తెలిపారు. ఆయన శనివారం యలమంచిలి మున్సిపాలిటీని సందర్శించారు. యలమంచిలిని ఆదర్శి మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. స్వచ్ఛంధ్ర ప్రదేశ్‌లో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో పరిశుభ్రత, పచ్చదనంకు ప్రాధాన్యత ఇచ్చి మొక్కలు నాటించడం, ఐఎస్‌ఎల్, డ్రైన్లు నిర్మించడంలో లక్ష్యాలను సాధించాలని ఇక్కడ అధికారులను ఆదేశించారు. ఆదాయ వనరులు పెంచుకోవడానికి వాణిజ్య సముదాయాలను వినియోగంలోకి తీసుకురావడం వంటి చర్యలు తీసుకుంటామన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులు 2.30కోట్ల మున్సిపాలిటీకి 2016-17 సంవత్సరానికి మంజురయ్యాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్తార్ శ్రీనివాసరావు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రకృతి కాటు!
* పిడుగుపాటుకి 26 మేకలు మృతి
* ఒకరికి తీవ్రగాయాలు
* రూ.2 లక్షల 10వేల ఆస్తినష్టం
దేవరాపల్లి, జూన్ 25: పిడుగుపాటుకి 26 మేకలు మృతి చెందడంతో పాటు ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. సుమారు రూ.2 లక్షల 10వేలు ఆస్తినష్టం ఉంటుందని అంచనా. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. దేవరాపల్లి మండలం వెంకట్రాజపురం గ్రామ సమీపంలో ఎండిగల పడుగు వద్ద శనివారం 10 మందితో కూడిన మేక కాపలాదారులు సుమారు 130 మేకలను కాపలాకాస్తున్నారు. మధ్యాహ్నం సమయంతో కావడంతో అందరూ భోజనానికి అక్కడకు సమీపంలో ఉన్న వెంకట్రాజపురం గ్రామంలోకి వెళ్లారు. ఇంతలో మెరుపులు, ఉరుములుతో కూడిన వర్షం రావడంతో అక్కడే కాపలా ఉన్న ఒకే ఒక్కడు సబ్బి దేముళ్లు (35) అక్కడే ఉన్న చింతచెట్టు తొర్రలో గొడుగు పట్టుకుని నిలుచున్నాడు. వెనువెంటనే హఠాత్తుగా చెట్టు తొర్రలో పిడుగుపడడంతో ఒకేసారి 26 మేకలు మృతి చెందడంతో సబ్బి దేముళ్లుకు వెనుకు భాగం కాలిపోయింది. వెంటనే అక్కడే ఉన్న కొంత మంది ఆటోలో చోడవరం సబ్బి దేముళ్లుని తీసుకువెళ్లారు. మృతి చెందిన మేకల్లో గోకాడ గురువులు మేకలు 10, సబ్బి దేముళ్లు మేకలు 11, దాలిబోయిన గంగునాయుడుకు చెందిన మేకలు 5 మృతి చెందాయి. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా ప్రదేశానికి వచ్చికి మృతి చెందిన మేకలను చూసి లబోదిబోమని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ లెక్కల దాలిబాబు, సిపిఎం మండల కార్యదర్శి సిహెచ్ రాజు, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు డి.వెంకన్న సంఘటనా ప్రదేశానికి వెళ్లి మృతి మేకలను చూసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం అందేటట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని సర్పంచ్ లెక్కల దాలిబాబు అన్నారు. అనంతరం గ్రామ కార్యదర్శి రాము సంఘటనా ప్రదేశానికి వెళ్లి మృతి చెందిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో 1,611 మంది క్షయ రోగులు
* జిల్లా క్షయ నివారణాధికారి వసుంధర
మాకవరపాలెం, జూన్ 25: జిల్లాలో ఈ ఏడాది 1,611 క్షయ వ్యాధి కేసులు నమోదయ్యాయని జిల్లా క్షయ నివారణాధికారి ఎన్. వసుంధర అన్నారు. స్థానిక పి.హెచ్.సి.ని శనివారం ఆమె సందర్శించి రికార్డులు పరిశీలించారు. అనంతరం కొత్తగా నియమితులైన వైద్యాధికారికి సీజనల్ వ్యాధుల పరిస్థితిపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడుతూ జిల్లాలో నమోదైన కేసుల్లో ప్రస్తుతం 93 శాతం ఈ వ్యాధిని నిర్మూలన చేసినట్లు తెలిపారు. క్షయ వ్యాధి ఉన్న రోగుల ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ముందు జాగ్రత్తగా క్షయ వ్యాధికి సంబంధించి మందులను వేస్తున్నామన్నారు. ఈ వ్యాధి నిర్మూలనకు జీన్స్ ఎక్స్‌ఫర్డ్ అనే యంత్రం వచ్చిందని, దాని ద్వారా రెండు గంటల్లో ఒక వ్యక్తికి క్షయ వ్యాధి నిర్ధారణ చేయవచ్చన్నారు. మండలంలో జి.కోడూరు గ్రామంలో పిల్లలకు టీకాలు ఏవిధంగా వేస్తున్నారనే దానిపై ఆమె పరిశీలించారు. ఈమె వెంట ఎం.పి.హెచ్. ఇ.ఓ. సి.హెచ్.రామచంద్ర పాల్గొన్నారు.