విశాఖపట్నం

బెల్ట్ తీస్తున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 28: విశాఖ నగరంలో విచ్చలవిడిగా సాగుతున్న మద్యం వ్యాపార అక్రమాలపై పోలీసు శాఖ దృష్టి సారించింది. నగరంలో ఏదోమూల చోటుచేసుకుంటున్న ఘర్షణలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు మద్యం కీలకమని భావించిన పోలీసులు దాన్ని నియంత్రించే దిశగా చర్యలు మొదలు పెట్టారు. నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన యోగానంద్ మద్యం అక్రమాలపై నిఘా పెట్టారు. మద్యం దుకాణాలు మూసిన తరువాత కూడా బెల్ట్ షాపుల్లో నిరంతరం విక్రయాలు సాగుతున్న వైనాన్ని గుర్తించారు. మద్యం దుకాణాల వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేక పోయినా, అనధికారికంగా నిర్వహిస్తున్న దుకాణాలపై ఎందుకు దృష్టి సారించకూడదని భావించారు. తక్షణమే పోలీస్ బాస్ తన సిబ్బందికి ఖచ్చితమైనఆదేశాలు జారీ చేశారు. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో ఎక్కడా మద్యం బెల్ట్ దుకాణాలు లేకుండా చేయాలని ఆదేశించారు. అప్పటి వరకూ అటు మద్యం వ్యాపారులతోను, బెల్ట్ దుకాణాలతోను సత్సంబంధాలు నెరపిన పోలీసు శాఖ కమిషనర్ ఆదేశాలతో ఖంగుతింది. క్షేత్ర స్థాయిలో బెల్ట్ దుకాణాల వివరాలు తెలిసి కూడా చూసీచూడనట్టు వదిలేసిన సిబ్బంది ఇప్పుడు మింగలేని పరిస్థితి ఎదురైంది. దీంతో సమయ పాలన, మద్యం బెల్ట్ షాపులపై పోలీసు దాడులు పెరిగాయి. బెల్ట్ దుకాణాలపై దాడులు చేసి మరీ అరెస్టులు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, మద్యం వ్యాపారులపై పోలీసు శాఖ చూపుతున్న ప్రతాపంపై ఎక్సైజ్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ శాఖ వ్యవహారాల్లో పోలీసుల జోక్యంపై మండిపడుతున్నారు. మద్యం వ్యాపారులు, బెల్ట్ దుకాణాల అక్రమాల విషయంలో తమ పరిధి మేరకు చర్యలు తీసుకుంటామని, మధ్యలో వీరి జోక్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇదే సందర్భంలో మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులపై జరుగుతున్న పోలీసు దాడులపై అటు వ్యాపారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల వారీ టార్గెట్లు దాటాలంటే ఇలాంటి ఆంక్షలు పెడితే కుదరదని వ్యాపారులు ఎక్సైజ్ అధికారులకు తెగేసి చెపుతున్నారు. దీంతో ఎక్సైజ్ ఉన్నతాధికారులు సంకటస్థితిలో పడుతున్నారు. ఇదే సందర్భంలో మద్యం దుకాణాల సమయ పాలన, బెల్ట్ షాపుల విషయంలో పోలీసు ఉన్నతాధికారి తీసుకున్న నిర్ణయం పట్ల మాత్రం సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ పరిస్థితి నిరంతరం కొనసాగితే కొన్ని అనర్ధాలకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నారు.