విశాఖపట్నం

పోర్ట్ పూల్ కార్మికుల తరపున ఎమ్మెల్యే ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 5: విశాఖ పోర్టులో పూల్ కార్మికులుగా పనిచేస్తున్న 400 మంది కార్మికులను అర్ధాంతరం విధుల నుంచి తొలగించడంపై దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోర్టు ప్రవేశం ద్వారం వద్ద ఎమ్మెల్యే వాసుపల్లి మోకాళ్లపై నిలుచుని నిరసన తెలిపారు. ఎమ్మెల్యేకు మద్దతుగా పెద్ద సంఖ్యలో పోర్టు పూల్ కార్మికులు చేరుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. మోకాలిపై నడుస్తూ ఎమ్మెల్యే వాసుపల్లి నిరసన తెలిపే ప్రయత్నం చేయగా కార్మికులు సైతం ముందుకు వచ్చారు. వాసుపల్లి నిరసనకు మద్దతుగా కార్మికులు పోర్టు చైర్మన్‌కు వ్యతిరేంగా నినాదాలు చేశారు. ఒకానొక దశలో కార్మికులు ఆందోళనలో ఉద్రిక్తతకు తెరతీశారు. ఆందోళన చేస్తుంగా ఇద్దరు కార్మికులు సమీపంలోని టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించారు. మరో కార్మికుడు వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. మోకాలిపై నడవడంతో ఎమ్మెల్యే కొంతమేర నీరసించడంతో కార్మికులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోర్టు పరిపాలనా భవనంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. అనంతరం పోర్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు ఎమ్మెల్యేతో చర్చించేందుకు సిద్ధపడ్డారు. పాతికేళ్లుగా పోర్టులో పనిచేసుకుంటూ జీవిస్తున్న 400 మందిని ఒక్కసారిగా తొలగిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోర్టు పూల్‌లో కోట్లాది రూపాయల నిధులున్నాయని, కార్మికుల సంక్షేమానికి వెచ్చించాలని డిమాండ్ చేశారు. దీనిపై చైర్మన్ కృష్ణబాబు స్పందిస్తూ కార్మికులకు న్యాయం చేస్తామని ప్రకటించారు.