విశాఖపట్నం

మునిసిపాలిటీలను తీర్చిదిద్దండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 28: జిల్లా అభివృద్ధికి సంబంధించి కేటాయించిన పనులన్నింటిని త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల అభివృద్ధి పనులకు సంబంధించి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ నాటికి అన్ని మునిసిపాలిటీలను బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలన్నారు. ఎక్కడ మురుగు నిలబడకుండా సెప్టిక్ క్లీనర్ల ద్వారా శుభ్రం చేయించాలన్నారు. డంపింగ్ యార్డులకు సంబంధించి సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంటు సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. మునిసిపాలిటీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఇతర పనులను పూర్తిచేయాలన్నారు. వీధిలైట్లను సెప్టెంబర్ నాటికి ఎల్‌ఇడిలను పెట్టాలన్నారు. అన్ని వార్డులకు తాగునీటి సరఫరాను అందజేయాలన్నారు. కమ్యూనిటీ హాల్స్, శ్మశానాలు, రోడ్లు సంబంధిత వాటి పనులను పూర్తిచేయాలన్నారు. బిల్లులకు సంబంధించి అంతా ఆన్‌లైన్‌లో చేయాలన్నారు. నగర సుందరీకరణ నిమిత్తం పుట్‌పాత్‌లు, డివైడర్లు సక్రమంగా ఉండాలని జంక్షన్లను వెడల్పు చేయాలన్నారు. జిల్లాల్లో ఉన్న అన్ని చెరువుల వద్ద ప్రజలను ఆకట్టుకునే విధంగా సుందరీకరణ పనులను చేయాలన్నారు. నగరవనంలో భాగంగా టూరిజం ద్వారా పార్కులన్నింటిని అందంగా తీర్చిదిద్దాలన్నారు. కంబాలకొండలో టూరిజం అభివృద్ధి చేయాలని టూరిస్టులను ఆకట్టుకునే విధంగా ట్రెక్కింగ్ ఏర్పాటు చేయడం, వినోద కార్యక్రమాలను చేపట్టాలన్నారు. పట్టణాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. పిపిపి పద్ధతిలో గృహానిర్మాణ పనులను చేపట్టాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారీట కాపు వర్గాలకు చెందిన వారిని ఆర్ధికంగా బలోపేతం చేయడానికి కావాల్సిన పథకాలను పూర్తి చేయాలన్నారు. కలెక్టర్, జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, శాసనసభ్యులు నగరంలో జరుగుతున్న పనులను ఎప్పటకపుడు పర్యవేక్షించాలన్నారు. కుక్కలు, కోతులు, పందుల సంబంధించిన సమస్యలపై అటవీశాఖ అధికారులకు ఆదేశించనున్నామన్నారు. అన్ని రైతుబజార్లను అభివృద్ధి చేస్తామన్నారు. 11 మునిసిపాలిటీల్లో ఎన్‌టిఆర్ కాంటీన్లను త్వరలో మొదలుపెట్టనున్నామన్నారు. అన్ని శాఖల అదికారులు అభివృద్ధి పనులపై ఎప్పటికపుడు సమీక్ష సమావేశాలను పెట్టుకుని చర్చించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి యనమల రామకృష్ణుడు, ఎక్సైజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవింద సత్యనారాయణ, వాసుపల్లి గణేష్‌కుమార్, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జివిఎంసి కమిషనర్ హరినారాయణన్, జెసి-2 డివి రెడ్డి, ట్రైనీ కలెక్టర్ సాయికాంత్ వర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.