విశాఖపట్నం

వనరక్షణే జనరక్షణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 29: వనరక్షణే జనరక్షణ, 2029 నాటికి ఆంధ్ర రాష్ట్రం గ్రీన్ జోన్‌గా నిలవాలని రాష్ట్ర బిసి సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 67వ వనమహోత్సవంలో భాగంగా శుక్రవారం రాష్టవ్య్రాప్తంగా చేపట్టిన వనం-మనం కార్యక్రమంలో నగరంలోని కంబాలకొండ ఎకో పార్కులో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతితో మానవ జీవితం ముడిపడి ఉందని, ప్రకృతిని పరిరక్షిస్తేనే మానవ మనుగడ సాధ్యపడుతుందన్నారు. దీనికోసం అంతా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని బాధ్యతగా చేపట్టాలన్నారు. రాష్టవ్య్రాప్తంగా కోటి మొక్కలు పెంచే కార్కమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారన్నారు. దీనిలోభాగంగా విశాఖలో కార్యక్రమం ప్రారంభించామన్నారు. జిల్లావ్యాప్తంగా ఈ రోజు 20 లక్షల మొక్కలు నాటుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 26 శాతం ఉన్న పచ్చదనం 50 శాతానికి పెంచేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. మొక్కలు నాటడమే కకుండా భూగర్భజలాలు తగ్గిపోతున్నాయన్నారు. హుదూద్ సమయంలో విశాఖను చూస్తే చాలా బాధ కలిగిందని, అయితే సిఎం తీసుకున్న చర్యలతో త్వరగా కోలుకోవడమే కాకుండా మళ్ళీ గ్రీన్‌విశాఖగా మారిందన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అని కొనియాడారు. ప్రతిఒక్కరూ పచ్చదనం పెంపొందించడంలో భాగంగా వనం-మనం కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి పరిరక్షణపై శ్రద్ధ చూపాలన్నారు. కలక్టెర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో పచ్చదనం పెంచేందుకు అధికారులు, అనధికారులు, ప్రజలు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 20 లక్షల మొక్కలు నాటందుకు శ్రీకారం చుట్టామన్నారు. 2029కి రాష్ట్రాన్ని గ్రీన్‌జోన్‌గా మార్చే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఆశయాన్ని అంతా నెరవేర్చేందుకు మన వంతు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో మొక్కలు పెంచినట్టుగా భావించి ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలన్నారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జాయింట్ కలెక్టర్ జె.నివాస్, జీవిఎంసి కమిషనర్ హరినారాయణ, వుడా వీసీ డాక్టర్ టి.బాబూరావునాయుడు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్, విద్యార్ధులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.