విశాఖపట్నం

రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నిలువునా ముంచేసారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 5: ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలువునా ముంచేసారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. జగదాంబ జంక్షన్ సమీపానున్న పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఢిల్లీయాత్రలో ప్రత్యేక హోదా అడగలేదని విమర్శించారు. ఏపీని ముంచుతూ వారిని కూడా ముంచే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
ఇంతకు ముందు 22సార్లు ఢిల్లీ వెళ్ళానన్న చంద్రబాబు ఇపుడు 23వ సారిగా వెళ్ళడం జరిగిందన్నారు. ప్రత్యేక హోదా తీసుకురావడానికి కాదని, అరుణ జైట్లీ మీద ఆగ్రహం లేదని, కేంద్రానికి అల్టిమేటం ఇవ్వడానికి కాదని ఎద్దేవా చేశారు. పుష్కరాలకు పిలవడానికి అని చెబుతుండటం దురదృష్టకరమన్నారు. పుష్కరాలకు పిలిచే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన సిఎంను ప్రశ్నించారు. 12 ఏళ్ళకు ఓసారి నదుల్లో పుష్కరుడు ప్రవేశించినపుడు ఆ నది మరింత పుణ్యతీర్ధ గా మారుతున్నందున ముక్కోటి దేవతలు స్నానాలు ఆచరిస్తారనేది హిందువుల విశ్వాసమని, అలాంటి పుష్కరాలకు ఎవరికివారు తరలివస్తారన్నారు. వారిని ఆహ్వానించడం ఏమిటంటూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. గత గోదావరి పుష్కరాల్లో ప్రజలకు కేటాయించిన ఘాట్ వద్ద స్నానాలు చేయడంతో తొక్కిసలాట జరిగి ఏకంగా 29 మంది మృత్యువాత పడ్డారన్నారు. ఈ పాపం చంద్రబాబుదేనన్నారు. అలాగే అంతా మరిచిన తరువాతనే కమిటీని వేశారని, దానికి మూడు మాసాలు గడువు పెట్టి దీనిని పొడిగించారని, నివేదిక ఇవ్వకుండానే కృష్ణా పుష్కరాలు వచ్చేసాయన్నారు. ఈ కమిటీ చంద్రబాబును విచారించేలేదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క విజయవాడలోనే 40 దేవాలయాలను కూల్చడం, పుష్కరాలను ప్రారంభించడం అంతా అయోమయాన్ని తలపిస్తుందన్నారు. ప్రచార ఆర్భాటమే తప్ప ఒక్క పథకాన్ని అమలు చేయలేని చంద్రబాబు గత తొమ్మిదేళ్ళు, ఇపుడు రెండు ఏళ్ళ పైబడి చేసిందేమిటని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం కాకుండా కేసుల మాఫీ కోసం, అవినీతి మీద విచారణ జరగకుండా అందరి కాళ్ళు పట్టుకుని శాలువాలు కప్పటం కోసం తన సొంత పీఆర్ కోసం ఢిల్లీ వెళ్ళారని ఆయన ఆరోపించారు.