విశాఖపట్నం

‘రూఫ్‌టాప్’ను విస్తృత పరచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 22: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూఫ్‌టాప్ సోలార్ నెట్ మీటరింగ్ వ్యవస్థను విస్తృతపర్చాలని సంస్థ చైర్మన్‌అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌ఎంఎం నాయక్ సూచన మేరకు ఈపీడీసిఎల్ అధికారులు సోమవారం సమావేశమయ్యారు. సిఎండి ఆదేశాలపై చీఫ్ జనరల్ మేనేజర్ (కమర్షియల్) కెఎస్‌ఎన్ మూర్తి సంస్థ పరిధిలోని సోలార్ ఛానల్ ఫార్టనర్స్, నెడ్‌క్యాప్ అధికారులు, ఈపీడీసిఎల్ అధికారులతో సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. రూఫ్ టాప్ సోలార్ నెట్ మీటరింగ్ ఏర్పాటులో వస్తున్న ఇబ్బందులను సమావేశంలో పాల్గొన్న సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్) బొడ్డు శేషుకుమార్ దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా నెట్‌మీటరింగ్ బిల్లింగ్ చేయడంలో వస్తున్న సమస్యలను, మీటర్ల కొరతను, సబ్సిడీని పొందడంలో ఎదురవుతున్న సమస్యలను సోలార్ ఛానల్ పార్ట్‌నర్స్ లేవనెత్తారు. ఆపరేషన్స్ డైరెక్టర్ శేషుకుమార్ మాట్లాడుతూ మీటర్ల కొరతను ఈ నెలాఖరికి అధిగమిస్తామని హామీనిచ్చారు. నెట్‌మీటరింగ్ బిల్లింగ్‌లో వస్తున్న సమస్యలను త్వరలోనే సరిచేస్తామని సిజిఎం (ఎక్స్‌పెండిచర్) జి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. 2015-17 సంవత్సరంలో రూఫ్‌టాప్ సోలార్ సబ్సిడీకి దరఖాస్తు చేసుకున్న 37 మంది దరఖాస్తుదారులకుగాను 31 మందికి మంజూరు చేశామని నెడ్‌క్యాప్ జిల్లా మేనేజర్ పివి రామరాజు తెలిపారు. ఈ సమావేశంలో బిజెపి రూఫ్‌టాప్ సోలార్ ప్రమోషన్ కమిటీ కన్వీనర్ సురేష్ సోమయాజలు, ఈపీడీసిఎల్ జనరల్ మేనేజర్ (కమర్షియల్) జి.శరత్‌కుమార్, ఏడిఇ ఎస్.నాగేశ్వరరావు, నెడ్‌క్యాప్ విజయనగరం జిల్లా మేనేజర్ రాజు, సోలార్ ఛానల్ పార్ట్‌నర్స్ తదితరులు పాల్గొన్నారు.

గంజాయి రవాణాపై నిఘా
మాకవరపాలెం, ఆగస్టు 22: గంజా యి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా రూరల్ ఎస్పీ రాహూల్‌దేవ్ శర్మ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆయన సోమవారం సాయంత్రం ఆయన సందర్శించారు. స్టేషన్‌లో వివిధ కేసులకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. మండలంలోని శాంతిభద్రతల పరిస్థితి ఎలా వుందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ ఏజెన్సీలో ఇటీవ లి కాలంలో జి.మాడుగులలో 890 కిలో లు, చింతపల్లిలో 660కిలోలు గంజాయిని పట్టుకుని స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. జిల్లాలోని దేవరాపల్లి మండలం లో అనుమతులు లేకుండా నిర్వహిస్తు న్న బాణసంచా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి 24మందిని అరెస్టు చేశామన్నారు. వచ్చే దీపావళికి ముందస్తుగా లైసెన్స్ షాపులను తనిఖీ చేసి వ్యాపారాలకుఅనుమతులిస్తామన్నారు. ఇంజనీరింగ్, జూనియర్ కళాశాలల విద్యార్థులకు ర్యాగింగ్‌పై త్వరలో అవగాహన సదస్సులు ఏర్పా టు చేస్తామన్నారు. కృష్ణా పుష్కరాలకు సిబ్బంది విధులకు వెళ్లడంతో జిల్లాలో అక్కడక్కడ నేరాలు జరుగుతున్నాయని, ఈనెల 26 నుండి వారందరూ స్టేషన్‌లో విధుల్లో చేరతారని, చోరీలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. దొంగతనాలకు సంబంధించి జ్యూయలరీ షాపుల యజమానులు బ్యాంక్ ఏటిఎంల వద్ద సిసి కెమెరాల ఏర్పాటుపై వారితో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. జిల్లాలో త్వరలో 4560 కానిస్టేబుల్ పోస్టులు భర్తీచేస్తామని తెలిపారు. మరో 600 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఏజెన్సీలో మావోయిస్టుల కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సిబ్బందితో కూంబింగ్ చేయిస్తున్నామని తెలిపారు. జిల్లాలో క్రైమ్ రేటు సాదారణంగానే ఉందని, పట్టణ ప్రాంతాల్లో రాత్రివేళల్లో పెట్రోలింగ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఎఎస్పి ఐశ్వర్య రస్తోగి, కొత్తకోట సిఐ మల్లేశ్వరరావు, స్థానిక ఎస్‌ఐ పి.రమేష్, ట్రైనీ ఎస్‌ఐ వెంకటేష్‌బాబు పాల్గొన్నారు.