విశాఖపట్నం

విశాఖలోమోహన్‌బాబు సినీ వసంతాల వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ, ఆగస్టు 23: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ గల నటుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్‌బాబు 40 సినీ వసంతాల వేడుక సెప్టెంబర్ 17వ తేదీన విశాఖలో నిర్వహించనున్నారు. రాజ్యసభ సభ్యులు, కళాబంధు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి తన జన్మదినోత్సవం సందర్భంగా ఈ వేడుకను నిర్వహించనున్నారు. టిఎస్సార్ తన జన్మదినం సందర్భంగా ప్రతి ఏటా ఓ ప్రఖ్యాత కళాకారుని ఘనంగా సత్కరించడం ఆనవాయితీ. ఈ ఏడాది పెద్దఎత్తున నిర్వహిస్తున్న డాక్టర్ మోహన్‌బాబు 40 సినీ వసంతాల వేడుకకు మొత్తం సినీ పరిశ్రమ విశాఖకు తరలిరానుంది. నాటి, నేటి తారాగణమంతా ఈ వేడుకకు హాజరుకానున్నారు. వేడుకను ఘనంగా నిర్వహించనున్న నేపధ్యంలో ఏర్పాట్లను సమీక్షించడానికి మోహన్‌బాబు కుమారుడు మంచు విష్ణు మంగళవారం విశాఖపట్నం విచ్చేశారు. నగరంలోని ఇందిరాప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో కార్యక్రమాన్ని నిర్వహించడానికి దాదాపుగా వేదికను ఖరారు చేశారు. ఉత్తరాది, దక్షిణాదికి చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానుండటంతో వారికి బస ఏర్పాట్లను మంచు విష్ణు సమీక్షించారు. అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహించడానికి వీలుగా నిర్వాహాకులు సన్నాహాలు చేస్తున్నారు.