విశాఖపట్నం

అల్పాదాయవర్గాలకూ సొంతిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 30: మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం కీలక పథకం అమలు చేయనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ టక్కర్ తెలిపారు. కలెక్టరేట్‌లో అధికారులు, బిల్డర్లు, ఐటి కంపెనీల ప్రతినిధులతో మంగళవారం ఆయన చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మధ్యతరగతి కోసం ప్రభుత్వం కొత్తగా సరసమైన గృహనిర్మాణ పాలసీకి రూపకల్పన చేస్తోందన్నారు. రెండు రోజుల్లో కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించే ఈ పథకం అమలుకు సూచనలివ్వాల్సిందిగా ప్రతినిధులను ఆయన కోరారు. మూడు తరగతులుగా ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో నిర్మించే ఈ గృహాల కోసం ఇప్పటికే పలువురు బిల్డర్లు పోటీపడుతున్నారని తెలిపారు. విశాఖ జిల్లాకు సంబంధించి ఆనందపురం మండలం వేములవలసలో 100 ఎకరాలు, పాలవలసలో 83 ఎకరాలు, మునగపాక మండలం పంచదార్ల, అచ్యుతాపురం గ్రామాల్లో 90 ఎకరాలు, అచ్యుతాపురం మండలం రాజుకోడూరు, వెల్చేరు కృష్ణపాలెం గ్రామాల్లో 70 ఎకరాలు, అచ్యుతాపురం గ్రామంలో 150 ఎకరాలను ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ ప్రాంతాల్లో మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల కోసం ఇళ్లను నిర్మించాలన్న ప్రతిపాదనను సిఎస్ క్రెడాయ్ ప్రతినిధులకు వివరించారు. అనంతరం ఆయన ఐటి రంగ ప్రతినిధులతో చర్చించారు. దీనిపై ఐటి కంపెనీల ప్రతినిధులు తమ సమస్యలను సిఎస్ ముందుంచారు. ఐటి కంపెనీలకు సంబంధించి రూ.2 కోట్ల ప్రోత్సాహకాలను గత రెండేళ్లుగా చెల్లించట్లేదని సిఎస్ దృష్టికి తీసుకువెళ్లారు. సిరిపురం జంక్షన్‌లో వుడా,ఎస్‌టిపిఐ సంయుక్తంగా నిర్వహించ తలపెట్టిన ఐటి టవర్ నిర్మాణంలో నెలకొన్న సమస్యను సత్వరమే పరిష్కరించి ప్రభుత్వం లేదా సిపిడబ్ల్యుడి ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. సీతమ్మధార ఐటి భవన సముదాయంలో ఖాళీగా ఉన్న 90 శాతం స్థలాన్ని ఐటి కంపెనీలకు కేటాయించాలని పేర్కొన్నారు. స్టార్టప్ విలేజ్‌పై వస్తున్న ఆరోపణలను అధిగమించి ఔత్సాహిక యువతకు అవసరమైన వసతులు కల్పించాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న స్థలాను వెంటనే డీ నోటిఫై చేసే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఐటి సెజ్‌కు సమీపంలో ఎల్ అండ్ టి సంస్థ 10వేల గృహాలను నిర్మించే ప్రతిపాదనను ఆమోదించి 18 మాసాల్లో ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలన్నారు. విజయవాడ, విశాఖల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లను నిర్మించే ఆలోచన ఉన్నట్టు తెలిపారు. పర్యాటక ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షిస్తూ ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో పర్యాటక శాఖ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ శ్రీరాములు నాయుడు, వుడా అదనపు వైస్ చైర్మన్ రమేష్, ఎస్‌టిపిఐ డైరెక్టర్ దూబే, ఐటి కంపెనీల తరపున రవి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.