S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/05/2020 - 22:33

రాహుల్, తిష్నా ముఖర్జీ జోడీగా శ్రీవిద్య దర్శకత్వంలో ఇందిరా బసవ నిర్మిస్తోన్న చిత్రం -మద. మార్చి 13న విడుదలవుతోన్న సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో దర్శకుడు హరీశ్ శంకర్, నటుడు నవదీప్ విడుదల చేశారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరు, చిత్రయూనిట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

03/05/2020 - 22:32

ప్రపంచాన్ని భయపెడుతున్న వైరస్ కరోనా -జేమ్స్‌బాండ్‌నీ భయపెట్టింది. ప్రమాదాలకు ఎదురెళ్లే సాహసి సైతం -కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. విషయమేంటంటే -ప్రపంచ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న బాండ్ సినిమా కరోనా దెబ్బతో ఏప్రిల్‌లో విడుదల కావడం లేదు. జేమ్స్‌బాండ్ సిరీస్‌లో రావాల్సిన తాజా చిత్రం -నో టైం టు డై.

03/05/2020 - 22:30

ప్రస్తుత పరిస్థితుల్లో మన విద్యా విధానం ఎలా వుంది? చదువుకు తగినట్లు ఉద్యోగాలు దొరుకుతున్నాయా? అన్న కోణంలో ఈ చిత్రం సాగుతుంది. కన్నడంలో సూపర్‌హిట్ అయిన ‘కాలేజీ కుమార’ చిత్రాన్ని తెలుగులో అదే దర్శకుడు సంతు డైరెక్ట్ చేశారు. అయితే మన తెలుగు నేటివిటికీ తగిన విధంగా మార్పులు జరిగాయి అని తెలిపారు కధానాయకుడు రాహుల్ విజయ్.

03/05/2020 - 22:28

ఐపీఎస్ అవతారమెత్తిన పాయల్ రాజ్‌పుత్ సినిమా టైటిల్ -5 డబ్ల్యూస్ (ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు). ‘సాధారణ ప్రశ్నలు, అసాధారణ సమాధానాలు’ అనేది ఉపశీర్షిక. ప్రణదీప్ ఠాకోర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ కైవల్య క్రియేషన్స్‌పై యశోద ఠాకోర్ నిర్మిస్తోన్న చిత్రమిది. తాజాగా హైదరాబాద్‌లో ఫస్ట్‌లుక్, టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ -నా కెరీర్‌కు ఈ సినిమా ఓ కొత్త టర్న్.

03/05/2020 - 22:25

అందంకన్నా అభినయమే మిన్న -అన్న చిత్రోక్తిని ఒకింత ఆలస్యంగా అర్థం చేసుకున్నట్టుంది రకుల్‌ప్రీత్. అందంకంటే అభినయానికి ప్రాధాన్యమంటూ -ముందుతరం హీరోయిన్లు ఎందుకు చెప్పేవారో ఇప్పుడు అర్థమైనట్టుంది ఈ పంజాబీ బ్యూటీకి. స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు చేసినా -ఒకేతరహా గ్లామర్ రోల్స్ ఏకబిగిన చేయడం వల్లే కెరీర్ కొంపమునిగిందన్న గ్రహింపుకొచ్చిందట ఈ జిమ్ ఫ్రీక్ బ్యూటీ.

03/05/2020 - 22:22

ధనుష్‌బాబు, సింధూర, కావ్యకీర్తి హీరో హీరోయిన్లుగా శ్రీవల్లిక ఫిలింస్ బ్యానర్‌పై దర్శకుడు ముస్కు రాంరెడ్డి తెరకెక్కిస్తోన్న చిత్రం -నాకిదే ఫస్ట్‌టైం. నిర్మాత కురుపా విజయ్‌కుమార్ ముదిరాజ్ నిర్మిస్తోన్న చిత్రం ఆడియో, ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఫస్ట్‌లుక్ లాంచ్ చేసిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ -ఫస్ట్‌లుక్ ఆకట్టుకునేలా ఉంది.

03/04/2020 - 22:29

రక్షిత్, నక్షత్ర జోడీగా దర్శకుడు కరుణకుమార్ తెరకెక్కించిన చిత్రం -పలాస 1978. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా శుక్రవారం విడుదలవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా సంగీత దర్శకుడు రఘు కుంచె మీడియాతో మాట్లాడాడు.

03/04/2020 - 22:27

సహజంగా -హీరోలతో ఎంటర్‌టైన్‌మెంట్ కథల్ని తెరకెక్కిస్తుంటారు. అలాంటి సినిమాల్ని ఆడియన్స్ చూసేశారు. అందుకే హీరోయిన్లనే హీరో పాత్రలుగా మలచి ఎంటర్‌టైన్‌మెంటే సినిమా చేశా. అదే అనుకున్నదొకటి.. అయ్యిందొకటి అంటున్నాడు -దర్శకుడు బాలు అడుసుమిల్లి. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ పతాకంపై ధన్య బాలకృష్ణ, సిద్దీ ఇద్నాని, త్రిధాచౌదరి, కోమలి లీడ్‌రోల్స్‌లో హేమ వెలగపూడి రూపొందించారు.

03/04/2020 - 22:24

విశ్వంత్ దుద్దంపూడి, సంజయ్‌రావు, నిత్యశెట్టి, బ్రహ్మాజీ ప్రధాన తారాగణంగా భవ్య క్రియేషన్స్‌పై వి ఆనంద్‌ప్రసాద్ నిర్మించిన చిత్రం -ఓ పిట్ట కథ. కొత్త దర్శకుడు చెందు ముద్దు తెరకెక్కించిన చిత్రం 6న థియేటర్లకు వస్తోంది. కథలో కీలకమైన ఇనె్వస్టిగేషన్ ఆఫీసర్ పాత్ర పోషించిన బ్రహ్మాజీ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

03/04/2020 - 22:21

కనులు కనులను దోచాయంటే ఓటిటి, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో చూసే సినిమా కాదు. థియేటర్స్‌లో చూస్తున్నపుడు కలిగే థ్రిల్లే వేరు. నేను కూడా సినిమాను థియేటర్‌లోనే సింగిల్‌గా చూశా. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ వేరు, ఓటిటిలో వస్తుందని వెయిట్ చేయకండి అని కథానాయకుడు దుల్కర్ సల్మాన్ తెలిపారు.

Pages