S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్ర

03/19/2017 - 01:38

ప్రభాస్ కథానాయకుడిగా ఎస్. ఎస్. రాజవౌళి రూపొందిస్తున్న చిత్రం ‘బాహుబలి-ద కంక్లూజన్’ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిని యూట్యూ బ్, సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నవారి సంఖ్య రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు భారత చరిత్రలో అతి తక్కువ సమయంలో ఎక్కువమంది చూసిన ట్రైలర్‌గా ఇది రికార్డు నమోదు చేసింది. బాహుబలి ది బిగినింగ్ చిత్రానికన్నా, బాహుబలి ది కంక్లూజన్‌కు అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది.

03/19/2017 - 01:33

రామ్ కథానాయకుడిగా కృష్ణచైతన్య సమర్పణలో పి.ఆర్. సినిమా పతాకంపై కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రంలో కథానాయికలుగా అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాశ్ నటిస్తున్నారు. ఇటీవల ‘నేను శేలజ’ వీరిద్దరి కాంబినేషన్‌లో ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందుతోంది.

03/19/2017 - 01:13

సువర్ణ క్రియేషన్స్ పతకంపై పి.డి. రాజు, అభినయ, భానుచందర్, సాయికిరణ్ ముఖ్యపాత్రల్లో జె.జాన్‌బాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తొలికిరణం’. ఆర్.పి.పట్నాయక్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానున్న సందర్భంగా చిత్ర దర్శకుడు జాన్‌బాబు చిత్ర విశేషాలు తెలియజేశారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

03/19/2017 - 01:08

జై, అంజలి, జనని అయ్యర్ హీరో హీరోయిన్లుగా తెలుగు, తమిళంలో రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ ‘బెలూన్’. ‘జర్నీ’ తర్వాత జై, అంజలి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. హీరోలు కార్తీ, జయం రవి, విజయ్ ఆంటోని, విష్ణు విశాల్, సూర్య చేతుల మీదుగా విడుదలై ఐదు డిఫరెంట్ లుక్స్‌తోపాటు ప్రీ రిలీజ్ లుక్ సినిమా ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచాయి.

03/19/2017 - 01:06

తమిళ దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌కి విడాకులిచ్చిన అమలాపాల్ సినిమాలపై దృష్టి పెట్టింది. వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతోంది అమల. తాజాగా తనకి కెరీర్ ఆరంభమే పెద్దపెద్ద అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేసిన తెలుగు సినీ పరిశ్రమ వైపు మళ్లీ రావాలని ప్లాన్స్ వేస్తోంది. ఇక్కడికి వస్తూనే స్టార్ హీరోల సరసన నటించాలని ప్రయత్నిస్తోంది.

03/19/2017 - 00:35

సునీల్ కథానాయకుడిగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో రూపొందించిన ‘ఉంగరాల రాంబాబు’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వేసవి కానుకగా విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతోంది.

03/19/2017 - 00:33

నయనతార ప్రధాన పాత్రలో తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న మహిళా ప్రధాన చిత్రం డోర. ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి దాస్ దర్శకుడు. సుర ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో నిర్మిస్తున్నారు. వివేక్, మెర్విన్ సంగీతాన్నందించిన ఈ చిత్ర గీతాలు ఇటీవల విడుదలయ్యాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం మార్చి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

03/19/2017 - 00:30

నవదీప్, కావ్యాశెట్టి జంటగా లెజెండ్ పిక్చర్స్ పతాకంపై ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో రమేష్‌బాబు కొప్పుల రూపొందిస్తున్న సస్పెన్స్ యాక్షన్ ద్రిల్లర్ చిత్రం ‘నటుడు’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

03/19/2017 - 00:29

వరుస విజయాలతో దూసుకుపోతున్న నానికి మరో మంచి ఆఫర్ దక్కింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే విక్రమ్ దర్శకుడిగా కాదండోయ్, కేవలం నాని సినిమాకి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించబోతున్నాడు. అయితే ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోయేది మాత్రం శ్రీనివాస్ అవసరాల అని ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది.

03/17/2017 - 21:06

బాలీవుడ్-2 ట్రైలర్ బ్రహ్మాండంగా ఉందంటూ నిన్న ట్వీట్లతో మోతెక్కించిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఆ సినిమాలో కథానాయకుడు ప్రభాస్‌పై శుక్రవారం పొగడ్తలు కురిపించారు. పనిలోపనిగా టాలీవుడ్‌లో ప్రముఖ హీరోలకు పరోక్షంగా చురకలు అంటించాడు.

Pages