S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్ర

03/16/2017 - 20:56

బాహుబలి -2 ట్రైలర్ సామాజిక మాధ్యమంలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది. ముఖ్యంగా యూట్యూబ్‌లో దీనిని జనం విరగబడి చూస్తున్నారు. ఇప్పటివరకు భారత్‌లో సినిమా ట్రైలర్ల పేర ఉన్న రికార్డులను బాహుబలి తుడిచిపెట్టింది. గురువారం ఉదయం విడుదలైన ఈ ట్రైలర్‌ను రెండుగంటల్లో 20 లక్షలమంది చూశారు. మరో మూడు గంటలు గడిచేసరికి చూసినవారి సంఖ్య 52 లక్షలకు చేరింది.

03/16/2017 - 20:54

‘బాహుబలి-ద కంక్లూజన్’ చిత్రం ట్రైలర్ దృశ్యకావ్యంగా సాగిపోయింది. 2 నిమిషాల 20 సెకండ్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో జలధారలు, ప్రకృతి సోయగాలు, అనుష్క అందచందాలు, కోటలు, యుద్ధసన్నివేశాలు, అమరేంద్ర బాహుబలిగా ప్రభాస్ చెప్పిన డైలాగులు అదరగొట్టాయి. అతిస్పష్టంగా కనిపించే సన్నివేశాలు, అద్భుతమైన గ్రాఫిక్స్, నయనానందకరంగా ఉన్న దృశ్యాలు కళ్లు తిప్పుకోనివ్వలేదు.

03/16/2017 - 20:53

హీరో బాలకృష్ణ, పూరి జగన్నాథ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో సినిమాకు అంతా సిద్ధమైంది. తొలి షెడ్యూల్ కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. హైదరాబాద్‌లో షెడ్యూల్ శుక్రవారం ప్రారంభం కానుంది. ఈనెల 22 వరకు షెడ్యూల్‌లో కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారు. బాలకృష్ణ ఆరంభంలోనే ఫైట్ సన్నివేశాల్లో పాల్గొననున్నారు.

03/16/2017 - 20:51

ఆది పినిశెట్టి, నిక్కిగల్రాణి జంటగా రిషి మీడియా, శ్రీచక్ర ఇన్నోవేషన్స్ పతాకాలపై తెలుగు, తమిళ భాషల్లో ఎ.ఆర్.కె.శరవణన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘మరకతమణి’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు.

03/16/2017 - 20:50

సంజీవ్, చేతనా ఉత్తేజ్, నందు, కారుణ్య ప్రధాన తారాగణంగా శ్రీవత్సా క్రియేషన్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘పిచ్చిగా నచ్చావ్’. వి.శశిభూషణ్ దర్శకత్వంలో కమల్‌కుమార్ పెండెం రూపొందించిన ఈ సినిమా ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత కమల్‌కుమార్ మాట్లాడారు.

03/16/2017 - 20:48

నందు, తేజస్వి ప్రకాష్ జంటగా బిక్స్ దర్శకత్వంలో ఎ.ఎస్.ఆర్.పి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ బాసాని రూపొందించిన చిత్రం ‘కన్నుల్లో నీ రూపమే’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో సింధూరపువ్వు కృష్ణారెడ్డి, ఆర్.పి.పట్నాయక్ సంయుక్తంగా బుధవారం విడుదల చేశారు.

03/16/2017 - 20:46

‘సరైనోడు’ సక్సెస్‌తో జోష్‌మీదున్న బోయపాటి శ్రీను, తన తరువాతి చిత్రాన్ని అదే జోరుతో పూర్తి చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా దాదాపు పూర్తికావచ్చింది. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఎమ్మెల్యేగా క్రేజ్ తెచ్చుకున్న కేథరిన్ ఈ చిత్రంలో ఐటెం సాంగ్‌లో నర్తించనుంది. ఇప్పటికే పాటకు సంబంధించిన సెట్ కూడా సిద్ధమైంది.

03/15/2017 - 21:46

పదమూడో శతాబ్దానికి చెందిన రాణి పద్మావతి చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న ‘పద్మావతి’ చిత్రం వివాదాల చిచ్చులో చిక్కుకుంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో షూటింగ్ నిర్వహిస్తుండగా దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీపై దాడి జరిగిన సంఘటన ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న సమయంలో మరోసారి ఆ చిత్రబృందంపై దాడి జరిగింది.

03/15/2017 - 21:40

పద్మావతి చిత్రంలో నటించే జూనియర్, సీనియర్ నటులకోసం నెలల తరబడి కష్టపడి రూపొందించిన దుస్తులన్నీ దగ్ధమై బూడిదగా మిగిలిపోయాయని డిజైనర్లు రింపిల్, హర్‌ప్రీత్ నరులా ఆవేదన వ్యక్తం చేశారు. అల్లరిమూకలు వచ్చి సెట్‌కు నిప్పుపెట్టాయని, దాదాపు జూనియర్ నటులకు సంబంధించిన కాస్ట్యూమ్స్ ఒక్కటీ మిగలలేదని, సీనియర్ల దుస్తుల సంగతి చూడాలని వారన్నారు.

03/15/2017 - 21:38

భిన్నమైన పాత్రల్లో మెప్పించగల నటుడిగా, నెగెటివ్ పాత్రల్లో తనదైన సత్తా చాటి హీరోలకు ధీటుగా గుర్తింపు తెచ్చుకున్నవాడిగా పేరు పొందారు శరత్‌కుమార్. ఆయన చేసిన పాత్రలు తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుంటాయి. ముఖ్యంగా ‘కాంచన’ సినిమాలో హిజ్రా పాత్రలో నటించి మెప్పించిన శరత్‌కుమార్ చాలా గ్యాప్ తరువాత తెలుగులో ‘నేనోరకం’ సినిమాలో నటిస్తున్నాడు.

Pages