S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్ర

07/16/2017 - 21:45

నాగార్జున హీరోగా నటిస్తున్న ‘రాజుగారి గది-2’ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత నాగార్జున కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారు. హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా మంచి అభిరుచి గల చిత్రాన్ని అందిస్తున్న నాగార్జున ప్రస్తుతం అఖిల్, విక్రమ్ కుమార్‌ల కాంబినేషన్‌లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

07/16/2017 - 21:44

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ నటించే తదుపరి చిత్రానికి సంబంధించిన సన్నాహాలు జోరందుకున్నాయి. తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న బాలయ్య 102వ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయి. రాయలసీమ రాజకీయ, ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని సి.కల్యాణ్ నిర్మిస్తున్నారు.

07/16/2017 - 21:42

ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా సుకుమార్ క్రియేటివ్ రైటింగ్స్ పతాకంపై అశోక్, ఈశ జంటగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దర్శకుడు’. విజయకుమార్, థామస్‌రెడ్డి ఆదూరి రవిచంద్ర, సత్తిలు నిర్మాతలు. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. హీరో రామ్ చరణ్ సీడీలను ఆవిష్కరించారు.

07/16/2017 - 21:41

జ్యో స్టార్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై కబాలి సెల్వ దర్శకత్వంలో కబాలి సెల్వ, తంబిరామయ్య, షఫీ ముఖ్య పాత్రల్లో ఎం.కోటేశ్వరరాజు నిర్మిస్తున్న చిత్రం ‘12-12-1950’ సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు డేట్‌ను సినిమా టైటిల్‌గా పెట్టి తెరకెక్కిస్తున్న చిత్రమిది.

07/16/2017 - 21:39

నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్‌బాబు, ఆది హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బానర్‌పై తెరకెక్కిన ‘శమంతకమణి’ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య చెప్పిన విశేషాలు.
అద్భుతమైన స్పందన

07/16/2017 - 21:38

హరీష్, అవంతిక జంటగా లేడీ డైరక్టర్ జయ.బి దర్శకత్వంలో ఆర్‌జె సినిమాస్ పతాకంపై బి.ఎ.రాజు నిర్మించిన చిత్రం ‘వైశాఖం’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 21న విడదలవుతున్న సందర్భంగా హీరోయిన్ అవంతికతో ఇంటర్వ్యూ.
* మీ గురించి?
- మాది ఢిల్లీ. నాన్న ఎయిర్‌ఫోర్స్ అధికారి. ఉద్యోగరీత్యా చాలా ప్రదేశాలు తిరిగాను. అమ్మ గృహిణి.
* సినీ రంగ ప్రవేశం?

07/16/2017 - 21:36

‘బాహుబలి’ విజయంతో అనుష్క క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దేవసేనగా ఆమె రెండు షేడ్స్‌లో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా ఉన్న అనుష్క ప్రస్తుతం ‘్భగమతి’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావచ్చింది. తాజాగా ప్రభాస్ ‘సాహో’లో నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈమె ఐటమ్ సాంగ్‌లో నటించేందుకు రంగం సిద్ధమైంది.

07/16/2017 - 21:35

‘దువ్వాడ జగన్నాథం’ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్నఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మలయాళ భామ అను ఇమాన్యుయెల్ నటిస్తోందట. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు పరిశీలించినప్పటికీ ఫైనల్‌గా ఆమెను ఎంపిక చేసారు.

07/15/2017 - 22:54

ఒక్కసారి ఓ జంట ప్రేక్షకులకు నచ్చేసి ఆ సినిమా హిట్ అయిందంటే చాలు, ఆ జంటతోనే మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలని ప్రేక్షకులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లేనని అర్థం. అందుకే దర్శక నిర్మాతలు కూడా అదే కాంబినేషన్‌లో రూపొందించే ప్రయత్నం చేస్తారు. తాజాగా నాని, నివేదా థామస్ జంటకు ప్రేక్షకులనుండి మంచి ఆదరణ లభిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో జంటిల్‌మేన్, నిన్నుకోరి చిత్రాలు విడుదలయ్యాయి.

07/15/2017 - 22:52

‘రిషి, గిరి సహదేవా కథానాయకులుగా నటించిన డా.చక్రవర్తి విడుదలై అన్ని కేంద్రాల్లో అద్భుతమైన ఆదరణ పొందుతోంది. 2015లో ముంబయిలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా చేసుకొని ఎంటర్‌టైన్‌మెంట్ బేస్‌తో ఈ సినిమా రూపొందించాం. నా గత చిత్రాలకన్నా వైవిధ్యంగా రూపొందిన ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడికీ నచ్చుతుంది. ఇప్పటివరకూ చూసినవాళ్ళెవరూ నెగెటివ్ టాక్ చేయకపోవడం విశేషం’ అని దర్శకుడు శేఖర్ సూరి తెలిపారు.

Pages