S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/06/2018 - 21:07

విభిన్నమైన కథ, కథనాలతో చిత్రాలు రూపొందించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. ఐతే, సాహసం, మనసంతా వంటి చిత్రాలను రూపొందించిన ఆయన తాజాగా మెగా హీరోతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఇంటిలిజెంట్ చిత్రంతో నటిస్తున్న సాయిధరమ్‌తేజ్, ఆ తరువాత కరుణాకరన్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన చంద్రశేఖర్ యేలేటితో సినిమా చేస్తాడట.

02/06/2018 - 21:06

దక్షిణాదిలో దశాబ్దకాలంపాటు గ్లామర్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రీయ త్వరలో పెళ్లికి సిద్ధమవుతోంది. కొంత గ్యాప్ తరువాత సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈమె, సరికొత్త పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం గాయత్రి చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న శ్రీయ పెళ్లికి సిద్ధమైందని బి టౌన్‌లో వార్తలు వస్తున్నాయి.

02/06/2018 - 21:03

నిరూప్, అవంతిక జంటగా ఆర్య ముఖ్యపాత్రలో అనూ ప్ భండారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజరథం’. ఈ చిత్రానికి సంబంధించిన ఇటీవలే విడుదలైన రెండు పాటలకు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా దర్శకుడు వివరాలు తెలియజేస్తూ- ‘నీలిమేఘమా..’ పాట చిత్రీకరణ చాలా చలిలో జరిగింది. హీరో హీరోయిన్లు ఆ చలికి తట్టుకోలేకపోయారు. అయినా కూడా పాట బాగా రావడానికి ఎంతో కష్టపడ్డారు.

02/05/2018 - 20:37

రివ్యూ

* హౌరా బ్రిడ్జ్
తారాగణం:
రాహుల్ రవీంద్రన్,
చాందిని చౌదరి,
రావు రమేష్, అజయ్ తదితరులు.
సంగీతం: శేఖర్ చంద్ర
కెమెరామెన్: విజయ్ మిశ్రా
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరావు
నిర్మాతలు: మహదేవ వ నాగేశ్వరరావ్, వడ్డేపల్లి శ్రీనివాస్‌రావు
దర్శకత్వం: రేవన్ యాదు

02/05/2018 - 20:34

విక్టరీ వెంకటేష్, సంచలన దర్శకుడు తేజ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల మూడోవారం నుండి ప్రారంభం కానుంది. నారా రోహిత్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు. అనుప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మంచి కథ కథనాలతో ఈ సినిమా తెరకెక్కబోతోంది. చాలా గ్యాప్ తరువాత వెంకటేష్ ఓకే చేసిన సబ్జెక్టు ఇదే కావడం విశేషం.

02/05/2018 - 20:31

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘్భరత్ అనే నేను’ చిత్రం ఫిలింసిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈనెల 10 వరకు అక్కడే షూటింగ్ జరిపి ఆ తరువాత ఈనెల చివరిలో పూనెలో ఓ పాటను హైదరాబాద్‌లో రెండు పాటలను చిత్రీకరిస్తారట. ఆ తరువాత విదేశాలలో జరిగే షెడ్యూల్‌తో సినిమా పూర్తికానుంది.

02/05/2018 - 20:29

సాయిధరమ్‌తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మించిన ‘ఇంటిలిజెంట్’ చిత్రానికి సంబంధించిన ప్రిరిలీజ్ వేడు క రాజమండ్రిలో మెగా అభిమానుల సమక్షంలో జరిగింది. ఈ చిత్రం ఈనెల 9న విడుదలవుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్లమెంటు సభ్యుడు, నటుడు మురళీమోహన్ పాల్గొన్నారు.

02/05/2018 - 20:27

మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే సమంతకు సంబంధించిన సన్నివేశాలు పూర్తిచేశారు. మరో నాలుగు రోజుల్లో షూటింగ్ పూర్తికానుంది. ఈ నేపథ్యంలో తాజాగా అందాల భామ పూజా హెగ్డేపై స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు.

02/05/2018 - 20:22

సాత్విక ఈశ్వర్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్‌వన్‌గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్త మహేష్‌ఖన్నా నిర్మిస్తున్న చిత్రం ‘సత్య గ్యాంగ్’. పుష్కలమైన వినోదానికి కాస్తంత సందేశాన్ని జోడించి నిర్మిస్తున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోంది.

02/05/2018 - 20:20

నిత్యం ఎన్నో రాగాలు, మరెన్నో పాటలు మనం వింటూనే ఉంటాం. చాలా పాటలు చెవులకు మాత్రమే సోకితే... మంచి పాటలు నేరుగా హృదయాన్ని తాకుతాయి. ‘దళపతి’ అనే కొత్త చిత్రంలో అలాంటి పాటే ప్రస్తుతం శ్రోతలను ఆకట్టుకుంటోంది. ‘నీకు నాకు మధ్య ఏదో ఉంది’ అని సాగే ఈ పాటకు రాంబాబు ఘోసల సాహిత్యాన్ని అందించగా, యాజమాన్య స్వరాలు కూర్చారు.

Pages