S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/11/2018 - 21:10

ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్ మొదటి సీజన్ ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. షో కొత్తగా అనిపించడంతో బుల్లితెర ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఇక మొదటి సీజన్ 10 వారాల వరకు సక్సెస్‌గా కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే సెకెండ్ సీజన్ అంతకంటే ఎక్కువ రోజులు కంటి న్యూ చేయాలనీ నిర్వాహకులు ఆలోచిస్తున్నారట. మొత్తంగా 14 వారాల వరకు బిగ్‌బాస్ 2 కొనసాగనుందని టాక్.

02/11/2018 - 21:09

అర్జున్‌రెడ్డి.. టాలీవుడ్‌లో సంచలనం రేపిన సినిమా. ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన షాలినీ పాండేకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ అయితే దక్కింది కానీ.. అవకాశాలు పెద్దగా రాలేదు. అయతే కోలీవులో 100 పర్సెంట్ రీమేక్ సినిమాలో నటిస్తోంది ఈ భామ. దాంతో పాటు మరో రెండు సినిమాలకు ఓకె చెప్పింది. తాజాగా మళ్లీ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నటిస్తుందట.

02/11/2018 - 21:07

నితిన్, మేఘా ఆకాష్ జంటగా శ్రేష్ట్ మూవీస్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘చల్ మోహన్‌రంగ’ మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందిస్తుండగా, శ్రీమతి నిఖితారెడ్డి సమర్పణలో ప్రముఖ నిర్మాత ఎన్.సుధాకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇది నితిన్‌కు 25వ చిత్రం కావడం విశేషం.

02/11/2018 - 21:05

మొత్తానికి తమిళ హీరో విశాల్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు? ఇన్నాళ్లు పెళ్లి విషయాన్ని దాటవేస్తూ వస్తున్న విశాల్.. ఫైనల్‌గా పెళ్లికి సిద్ధం అయినట్టు ఓ మీడియా సమావేశంలో చెప్పేశాడు. దాంతో విశాల్ పెళ్లిచేసుకునేది ఎవరిని అని గుసగుసలు ఎక్కువయ్యాయ. దానికి కారణం.. విశాల్ గత కొంతకాలంగా శరత్‌కుమార్ అమ్మాయి వరలక్ష్మితో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే.

02/11/2018 - 21:04

అఖిల్ సరసన హలో చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణి మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కూతురైన కళ్యాణి హీరోయిన్‌గా కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది. తాజాగా మరో క్రేజీ అవకాశాన్ని పట్టేసింది. స్వామి రారా డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది.

02/11/2018 - 21:02

పవన్‌కళ్యాణ్ పులి సినిమాతో పరిచయమైన బ్యూటీ నికిషాపటేల్. అలరించే అందం.. ఆకట్టుకునే అభినయం నికిషా సొంతం. అయితే ఈ బ్యూటీ కెరీర్ అనుకున్నంత వేగంగా సాగలేదు. మధ్యలో కొన్ని సినిమాల్లో అలరించిన ఈ అమ్మడు ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతోంది. ఈ సినిమాలో నికిషా పోలీసు ఆఫీసర్‌గా పవర్‌ఫుల్ పాత్రలో కన్పిస్తుంది. అందుకు తగ్గట్టుగానే సినిమా టైటిల్‌ను కూడా ‘రౌడీ పోలీస్’ అని పెట్టారు.

02/09/2018 - 20:53

ప్రస్తుతం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. మిలటరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రచయిత వక్కంతం వంశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ ఇంపాక్ట్ ఒక్క రోజులో కోటి వ్యూస్ దాటి సంచలనం రేపింది. తాజాగా మలయాళంలో కూడా విడుదలైన ఈ టీజర్‌కు అదే స్థాయిలో రెస్పాన్స్ దక్కడం విశేషం. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నారు.

02/09/2018 - 20:52

మహానటుడు నందమూరి తారకరామారావు జీవిత కథతో తెరకెక్కనున్న ఎన్‌టిఆర్ చిత్రం కోసం సన్నాహాలు జోరందుకున్నాయి. ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌లో నటిస్తుండగా తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బాలకృష్ణ 103వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను రంగంలోకి దింపుతున్నారు.

02/09/2018 - 20:50

సందీప్‌కిషన్, అమైదా దస్తూర్, త్రిధా చౌదరి హీరో హీరోయిన్లుగా మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్లపై పి.కిరణ్, సంజయ్ స్వరూప్ నిర్మించిన ‘మనసుకు నచ్చింది’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ చిత్రంలోని పాటలను జర్నలిస్టులు విడుదల చేశారు. అనంతరం దర్శకురాలు మంజుల మాట్లాడుతూ- నేను ఇండస్ట్రీలోనే పుట్టాను. ఇండస్ట్రీ మనిషిని.

02/09/2018 - 20:48

మెగా వారసత్వంగా తెలుగు తెరకు పరిచయమైనప్పటికీ మొదటినుంచీ తనదైన ముద్రను చాటుకుంటూ భిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు వరుణ్ తేజ్. మెగాస్టార్ ప్రభావం లేకుండా కమర్షియల్ హీరోయిజానికి దూరంగా కథలకే ప్రాముఖ్యత ఇస్తూ దూసుకుపోతున్నాడు. ఆయన తాజాగా తొలిప్రేమతో ముందుకు వస్తున్నాడు.

Pages