S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్ర

01/20/2016 - 04:24

సువర్ణా క్రియేషన్స్ పతాకంపై కె.జాన్‌బాబు దర్శకత్వంలో టి.సుధాకర్ నిర్మించిన చిత్రం ‘తొలి కిరణం’. ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ హైదరాబాద్ సారథి స్టూడియోస్‌లో జరుపుతున్నారు.

01/19/2016 - 23:45

ఎనిమిది సంవత్సరాలుగా చిరంజీవి సినిమాలకు దూరంగా ఉన్నారు. రీఎంట్రీ ఇస్తూ రూపొందించే 150వ సినిమా కోసం కొన్ని రోజులుగా కసరత్తు జరుగుతూనే వున్నాయి. ఇప్పటికే పలు కథలు విన్న చిరంజీవి, మొత్తానికి తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘కత్తి’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తాడన్న విషయం తెలిసిందే.

01/19/2016 - 23:43

బాలీవుడ్ నటి ఆసిన్, మైక్రోమాక్స్ సహవ్యవస్థాపకుడు రాహుల్‌శర్మల వివాహం అత్యంతవైభవంగా జరిగింది. దిల్లీకి సమీపంలోని దుసిట్ దేవరాణ హోటల్‌లో మంగళవారం ఉదయం వారిద్దరూ ఓ ఇంటివారయ్యారు. ఉదయం క్రైస్తవ సంప్రదాయంలో వివాహం చేసుకున్న ఈ దంపతులు సాయంత్రం హిందూ సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. ప్రఖ్యాత డిజైనర్ సవ్యసాచి ముఖర్జి రూపొందించిన దుస్తులతో వధూవరులు అందరినీ ఆకట్టుకున్నారు.

01/19/2016 - 23:39

నిషాంత్ దర్శకత్వంలో అందరూ నూతన నటీనటులతో పుధారి అరుణ రూపొందించిన చిత్రం ‘బొమ్మల రామారం’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీని గాయని సుశీల విడుదల చేశారు. ఈ సందర్భంగా సినిమాలో పాటలన్నీ బాగా వున్నాయని, ఈ ప్రయత్నం విజయవంతం కావాలని ఆమె కోరుకున్నారు.

01/19/2016 - 23:36

శర్వానంద్, సురభి జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ‘ఎక్స్‌ప్రెస్‌రాజా’ చిత్రం సంక్రాంతికి విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ తన రెండో సినిమా కూడా ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. శర్వానంద్, యువి క్రియేషన్స్ వాళ్లలో సంతోషం చూడాలన్న కోరిక నెరవేరిందన్నారు.

01/19/2016 - 23:04

రెబల్‌స్టార్‌గా తెలుగు తెరపై తిరుగులేని ఇమేజ్‌ని స్వంతం చేసుకుని యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు నటుడు కృష్ణంరాజు. యాక్షన్ ఇమేజ్‌లో సినిమాలు చేస్తూనే మరోవైపు విభిన్న కథా చిత్రాలతో అలరించారు. ప్రస్తుతం అడపాదడపా నటిస్తున్న కృష్ణంరాజు నటుడిగా 50 వసంతాలు పూర్తిచేసుకోబోతున్నారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనతో ముఖాముఖి.
నటుడిగా ఇది ఎన్నో పుట్టినరోజు?

01/18/2016 - 23:15

శే్వతామీనన్, మహత్‌రాఘవేంద్ర, చైతన్య, ఉత్తేజ్ ప్రధాన తారాగణంగా మహేశ్వర ఆర్ట్ పతాకంపై పర్సరమేష్ మహేంద్ర దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వరరావు రూపొందిస్తున్న చిత్రం ‘షీ’ (ఈజ్ వెయిటింగ్). ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

01/18/2016 - 23:10

తెలుగు, తమిళ భాషల్లో ఆకట్టుకునే చిత్రాలతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరో విశాల్. తాజాగా ‘కథకళి’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా ఇప్పుడు తమిళనాట థియేటర్లలో హల్‌చల్ చేస్తోంది. ‘పసంగ’, ‘పసంగ 2’ చిత్రాలతో తమిళనాడు దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పాండిరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 14న తమిళనాట విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

01/18/2016 - 23:08

సంచలన విజయం సాధించిన బాహుబలి చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘బాహుబలి-2’ జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఒక షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా మంగళవారం నుండి కేరళలో షూటింగ్ జరుపుకోనుంది. కేరళలోని ప్రాచీన కోటలో ఈ షూటింగ్‌ను చేస్తారు. ప్రభాస్ తదితరులపై ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు.

01/18/2016 - 23:05

ప్రస్తుతం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ విజయంతో కథానాయిక సురభి మంచి ఊపుమీదుంది. ఒక్క హిట్ కూడా పలకరించని హీరోయిన్ల లిస్టులోనుండి ఒక్కసారిగా హిట్ హీరోయిన్‌గా ఎదిగింది. గతంలో ‘బీరువా’ చిత్రంతో తెరంగేట్రం అయిన సురభి ఆ సినిమా సరైన ఫలితం ఇవ్వకపోవడంతో వెనకబడిపోయింది. చాలా రోజులు కనబడలేదు. ఇప్పుడు ‘ఎక్స్‌ప్రెస్‌రాజా’ హిట్టవ్వడంతో మరిన్ని అవకాశాల వేటలో ఉన్నది సురభి. ఇదంతా ప్రస్తుతం.

Pages