S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/08/2017 - 21:30

కెరీర్ ప్రారంభం నుంచే కథల విషయంలో సెలెక్టివ్‌గా ఉంటూ, తనకంటూ ఒక ఇమేజ్‌ను ఏర్పర్చుకున్నాడు. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంటున్నాడు. ఇక తను చేసిన ‘బాహుబలి’ సినిమాతో జాతీయస్థాయిలో ఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. బాహుబలిలో భల్లాలదేవగా జీవించిన రానా, త్వరలో గుణశేఖర్ దర్శకత్వంలో రానున్న ‘హిరణ్యకశ్యప’లో లీడ్ రోల్ చేస్తున్నాడు.

09/08/2017 - 21:28

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్- త్రివిక్రమ్‌ల కలయికలో రూపొందుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లో సుమారు 40శాతం చిత్రీకరణను పూర్తిచేసిన టీమ్, ప్రస్తుతం విదేశాల్లో షెడ్యూల్ జరుపుతోంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ థాయ్‌లాండ్‌లో ఉంది. ఈ షెడ్యూల్‌లో పవన్‌కళ్యాణ్ కూడా పాల్గొంటున్నారు. బ్యాంకాక్‌లో పవన్, కీర్తిసురేష్‌లపై ఒక పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ కూడా జరుగుతుందట.

09/08/2017 - 21:26

దర్శకుడు చేరన్ నేతృత్వంలో ప్రొ.జయశంకర్‌పై ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. డెక్కన్ టాకీస్ సమర్పణలో నిర్మించిన ఈ చిత్రాన్ని ‘తెలంగాణ కాలజ్ఞాని ప్రొ.జయశంకర్’ అని టైటిల్‌తో రూపొందించారు. డాక్యుమెంటరీకి సంబంధించిన బిగ్ సిడీని శుక్రవారం హైదరాబాద్‌లో జూలూరి గౌరీశంకర్ విడుదల చేయగా, సీడీని టిఎఫ్‌డిసి చైర్మన్ పుస్కూరు రామమోహన్‌రావు ఆవిష్కరించారు.

09/08/2017 - 21:25

దాదాపు దశాబ్దకాలంపైగా దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ శ్రీయ కొంత గ్యాప్ తరువాత రీఎంట్రీ ఇచ్చింది. రీఎంట్రీతో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికీ ఏ మాత్రం తగ్గని గ్లామర్‌తో ఆకట్టుకుంటున్న శ్రీయ, బాలకృష్ణ సరసన పైసా వసూల్‌లో నటించింది. ఓ వైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు కుర్ర హీరోలతో కూడా సై అంటోంది.

09/08/2017 - 21:23

‘వందల సినిమాలు చేస్తానని అనుకోవడంలేదు. కానీ చేసిన పది సినిమాల్లోనైనా వైవిధ్యం చూపించాలని అనుకుంటున్నా’ అంటున్నాడు దర్శకుడు క్రాంతిమాధవ్. సునీల్, మియాజార్జ్ జంటగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. ఈనెల 15న చిత్రం విడుదలవుతున్న సందర్భంగా క్రాంతిమాధవ్ చెప్పిన విశేషాలు
టైటిల్.. ఊళ్లలో పెట్టుకునే నిక్‌నేమ్‌లా ఉంది?

09/08/2017 - 21:21

అర్జున్‌రెడ్డి సినిమాతో అన్ని పరిశ్రమలకు హాట్ టాపిక్‌గా మారిపోయాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. దీంతో అతను చేస్తున్న తదుపరి చిత్రాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అతను చేస్తున్న సినిమాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ చిత్రం కూడా ఉంది. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మొదట హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠిని అనుకున్నారు. కానీ కొన్ని కారణాలవలన ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది.

09/07/2017 - 22:46

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రోబో 2.0’. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో హైటెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

09/07/2017 - 22:45

సూపర్‌స్టార్ మహేష్ - మురుగదాస్‌ల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న స్పైడర్ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఈనెల 9న చెన్నైలో భారీ ఎత్తున జరిపే వేడుకలో ఆడియోను విడుదల చేయనున్నారు.

09/07/2017 - 22:42

ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల విజయంతో మంచి ఉత్సాహంగా ఉన్న నాగచైతన్య తదుపరి చిత్రంగా థ్రిల్లర్ జోనర్‌లో సినిమా చేయడానికి ఆసక్తి చూపించాడు. నూతన దర్శకుడు క్రిష్ణ.ఆర్.వి.మారిముత్తుని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన యుద్ధం శరణం చిత్రం విడుదలకు సిద్ధమైంది. వారాహి చలనచిత్ర పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగచైతన్యతో ఇంటర్వ్యూ...

09/07/2017 - 22:40

సినిమాల్లో హీరోయిన్లు బికినీ వేయడం తప్పేమీ కాదని చెబుతోంది అందాల భామ తాప్సి. ఈమధ్యే హీరోయిన్ల నడుము చుట్టూ కెమెరాలు పెట్టి నడుముపై పూలు పండ్లతో కొట్టడం విడ్డూరమని దర్శకేంద్రుడిపై పరోక్షంగా కామెంట్ చేసి సంచలనం రేపిన తాప్సి, ఇలా ప్లేట్ ఫిరాయించి మాట్లాడడం షాకిస్తోంది. తాప్సి ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో జోరుమీదుంది.

Pages