S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/05/2017 - 21:17

ప్రస్తుతం బాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో జూలీ 2 ఒకటి. ఈ సినిమాలో లక్ష్మీరాయ్ టైటిల్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో లక్ష్మీరాయ్ అందాలు పచ్చిగానే ఆరబోసింది. అప్పట్లో నేహాధూపియా నటించిన జూలీ చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది.

09/03/2017 - 22:23

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్టు, ప్లాపులు పక్కనపెట్టి తనదైన టాలెంట్‌తో వరస అవకాశాలను పట్టేస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన జవాన్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. దాంతోపాటు కరుణాకరన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం వినాయక్ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

09/03/2017 - 22:22

సాధారణంగా పవన్ కాస్త గంభీరంగా ఉంటాడు. ఓ పట్టాన నవ్వడు. ఇక్కడిలా మురిసిపోతున్నాడంటే.. కీర్తితో ఏదో వ్యవహారం ఉండే ఉంటుంది. రాబోయే పవన్ చిత్రంలో కొత్త స్టిల్ ఇది..

09/03/2017 - 22:19

నందు, పూజా రామచంద్రన్, సౌమ్య వేణుగోపాల్ ముఖ్య పాత్రల్లో వర ప్రసాద్ వరికూటి దర్శకత్వంలో హరి హర చలనచిత్ర పతాకంపై ఎస్.శ్రీకాంత్‌రెడ్డి, రాంమోహనరావు నిర్మిస్తున్న చిత్రం ఇంతలో ఎనె్నన్ని వింతలో. ఈ సినిమా టీజర్‌ను ఆదివారం ప్రముఖ దర్శకుడు బోయపాటిశ్రీను విడుదల చేసారు.

09/03/2017 - 22:17

వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు కొత్త పాత్రల్లో ఒదిగిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు శర్వానంద్ తాజాగా నటిస్తున్న చిత్రం మహానుభావుడు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ పూరె్తైంది. యు.వి క్రియేషన్స్ పతాకంపై మెహరీన్ కథానాయికగా వంశి, ప్రమోద్ నిర్మించిన చిత్రాన్ని విజయదశమికి విడుదల చేయనున్నారు. ఆడియో సింగిల్స్, దియేటర్ ట్రైలర్ ఆవిష్కరణకు రంగం సిద్ధం చేశారు.

09/03/2017 - 22:15

బాక్సర్‌నుండి నటిగా మారిన రితికాసింగ్ మొదటి చిత్రం ‘సాలాఖద్దూస్’తోనే అందరినీ మెప్పించింది. ఈ చిత్రాన్ని ఆ తర్వాత తమిళంతోపాటు తెలుగులో కూడా ‘గురు’ పేరుతో రూపొందించారు. ఆ చిత్రంలో రితిక నటనకు ఆడియెన్స్ బాగా ఇంప్రెస్ అయ్యారు. ప్రస్తుతం తమిళంలో పలు ప్రాజెక్టులతో బిజీగా వున్న రితికా ఎన్ని ఆఫర్స్ వస్తున్నా వాటిలో సరైనవాటిని మాత్రమే ఎంచుకుంటున్నారు.

09/03/2017 - 22:14

వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ఫిదా చిత్రం ఘనవిజయం సాధించి అర్ధ శతదినోత్సవాన్ని పూర్తిర చేసుకుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం యాభై రోజుల వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యులకు షీల్డులు ప్రదానం చేసారు.

09/03/2017 - 22:12

కంచె సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్‌కు ఆ తరువాత హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా గ్లామర్ పాత్రలకు ఆసక్తి చూపిస్తున్న ఈమె నక్షత్రం సినిమాలో ఓ రేంజ్‌లో గ్లామర్ ప్రదర్శన చేసి షాకిచ్చింది. తాజాగా ప్రగ్యాకు మెగాఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది.

09/03/2017 - 22:09

ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ వెయిటింగ్ సినిమాల లిస్టులో జూలీ2 సినిమా కూడా ఉంది. అప్పట్లో నేహాధూపియా నటించి సంచలనం రేపిన ఆ సినిమాకు రీ మేక్ ఇది. సౌత్ బాల లక్ష్మీరాయ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది. టీజర్‌లో లక్ష్మీరాయ్ అందాలు షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా తన కెరీర్‌లో ఈ సినిమా నిలిచిపోయేలా ప్లాన్ చేసుకుంది లక్ష్మీరాయ్.

09/03/2017 - 22:08

బాలీవుడ్ గ్లామర్ భామ ప్రియాంక చోప్రా హవా మామూలుగా లేదు. ఇప్పటికే హాలీవుడ్‌లో వరస అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం హాలీవుడ్‌లో రెండు ప్రాజెక్టులను చేస్తున్న ఈమె హిందీలో మరో మూడు సినిమాలను ఒప్పుకుందట. గ్లామర్ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రియాంక త్వరలోనే పెళ్లి చేసుకుంటుందని బి టౌన్‌లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పెళ్లి విషయంపై ఆమె సన్నిహితులతో చర్చించినట్టు కూడా తెలిసింది.

Pages