S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఒకప్పుడు తెలుగు సినిమాలో హీరో అంటే అందంగా, నీట్‌గా షేవ్ చేసుకుని నీట్‌గా దువ్వుకొని, టక్ చేసుకుని మంచితనానికి బ్రాండ్ అంబాసిడర్‌గా, చూడగానే వీడు 100 పర్సెంట్ మంచివాడే అనే ముద్ర వేసేవాడు. దీనికి వ్యతిరేకంగా విలన్ ఉండడం సహజమే. ఇక సినిమాల్లో హీరో గెడ్డం పెంచాడంటే, కచ్చితంగా వాడి ప్రేమ అటకెక్కిందని హింట్ వచ్చినట్టే.
చంద్రాస్ ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై చంద్రశేఖర్ చంద్ర నిర్మిస్తున్న ‘లోకరక్షకుడు’ చిత్రం లోగోను లండన్ పార్లమెంట్‌లో విడుదల చేశారు. బ్రహ్మం సిహెచ్. దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని పలు భాషల్లో, పలు దేశాల్లో నటీనటులతో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. పార్లమెంట్ ఎం.పి బ్లాక్‌మెన్ లోగో విడుదల చేశారు.
ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన కాటమరాయుడు చిత్రం మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా తరువాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం ఈ నెల చివరిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం ఫిలింసిటీలో భారీ స్థాయిలో ఇల్లు, ఆఫీసులకు సంబంధించిన సెట్‌లను వేస్తున్నారు.
ప్రముఖ నటుడు మహేష్‌బాబు హీరోగా క్రేజీ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఫస్ట్‌లుక్ ఉగాది సందర్భంగా విడుదలవుతుందని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఈ సినిమా ఫస్ట్‌లుక్ కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశే మిగిలింది. దాంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అసహనాన్ని బాహాటంగానే వ్యక్తం చేశారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన మహేష్, ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌కి కామెంట్ పెట్టాడు.
ప్రభాస్.. అప్పటివరకు ఒక్క తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరో. టాలీవుడ్‌లో కమర్షియల్ విజయాలు అందుకుంటున్న ప్రభాస్‌కు వేరే ఏ భాషలో పెద్దగా మార్కెట్ లేదు. అంతవరకు ఓ తెలుగు హీరో అంట అనేవరకే అతని ఇమేజ్ ఉండేది. అప్పుడప్పుడు ఆయన సినిమాలు హిందీలో డబ్ చేయబడి.. ఏ స్టార్ టీవీలోనో, మరో టీవీలోనో వచ్చేవి.. ఓ కౌన్ హై.. అంటే, ఓతో టాలీవుడ్‌కా హీరో అని నార్త్ వాళ్ళు చెప్పుకునేవాళ్ళు సాధారణంగా.
జగపతిబాబు టైటిల్ పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘పటేల్’. ఎస్.ఐ.ఆర్ అనేది ట్యాగ్‌లైన్. వాసు పరిమి దర్శకత్వంలో వారాహి చలనచిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి క్లాప్ కొట్టగా ప్రముఖ దర్శకుడు రాజవౌళి గౌరవ దర్శకత్వం వహించారు. ముహూర్తం రోజే సినిమా టీజర్‌ను విడుదల చేయడం విశేషం.
తమన్నా పెళ్లిచేసుకుని సినిమాలకు దూరం అవుతుందా అని టెన్షన్ పడకండి..! అసలు విషయం ఏంటంటే.. గత ఏడాది తెలుగులో చిన్న సినిమాగా విడుదలై పెద్ద సంచలన విజయాన్ని అందుకున్న ‘పెళ్లిచూపులు’ చిత్రాన్ని హిందీ, తమిళంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు ప్రముఖ తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ హక్కులు తీసుకున్నాడు.
రాజ్‌తరుణ్, హెబ్బాపటేల్ జంటగా రైటర్ వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతూ ఏ టివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న చిత్రం ‘అందగాడు’. భిన్నమైన కానె్సప్టుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత రామబ్రహ్మం వివరాలు తెలియజేస్తూ- హీరో రాజ్‌తరుణ్‌తో మా బ్యానర్‌లో చేస్తున్న మూడవ చిత్రమిది.
రామ్‌చరణ్ తేజ్ దర్శకుడు సుకుమార్ డైరెక్షన్‌లో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ కథలో చరణ్‌ను కొత్త లుక్‌లో చూపించాలని సుకుమార్ నిర్ణయించుకున్నాడు. హెయిర్‌స్టైల్ దగ్గర్నుంచి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ భిన్నంగానే ఉండనున్నాయి. ఇకపోతే ఇప్పటికే ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న టీమ్ ఏప్రిల్ 1వ తేదీ నుండి రెగ్యులర్ షూట్‌కు వెళ్లనుంది.
అఖిల్ కొత్త సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అనేది అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్న విషయం. రెండో సినిమాతో మళ్లీ రీలాంఛ్ అవ్వాలని చూస్తున్న అఖిల్, మొదటి సినిమాలో హీరోయిన్ కూడా మైనస్ అని ఫీల్ అవుతున్నాడు. అందుకోసం ఈ సినిమాకి అలియాభట్‌ని బుక్ చేద్దాం అని చూస్తున్నాడు అఖిల్.