S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/17/2017 - 21:03

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న 23వ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ కానీ, పస్ట్‌లుక్ కానీ విడుదల కాలేదు. ముఖ్యంగా ఈ చిత్రానికి పలురకాల టైటిల్స్ పెడుతున్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తమిళ క్రేజీ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ క్రేజీ చిత్రం చివరి షెడ్యూల్ చెన్నైలో జరుగుతోంది.

03/17/2017 - 21:02

టాలీవుడ్‌లో ఇలియానాది ఓ ప్రత్యేక క్రేజ్. అప్పట్లో యువతను తన అంద చందాలతో ఆకట్టుకున్న ఈమె, బాలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలగాలనే ఆశతో సౌత్‌లో మంచి ఇమేజ్‌ను వదులుకుని అక్కడికి వెళ్లింది. అడపాదడపా సినిమాలు చేసినా కూడా బాలీవుడ్‌లో ఇలియానాకు పెద్దగా కలిసిరాలేదు. దాంతో గ్లామర్ బాట పట్టి అప్పుడప్పుడు హాట్ హాట్ ఫొటోలంటూ సందడి చేసింది. అయినా సరే ఛాన్సులు మాత్రం రావడంలేదు.

03/17/2017 - 21:00

రాఘవ లారెన్స్, శివరాజ్‌కుమార్ ప్రధాన తారాగణంగా అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి.పిళ్లై అందిస్తున్న చిత్రం ‘శివలింగ’. ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఏప్రిల్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

03/17/2017 - 20:58

జీవితంలో కెరీర్ ఒక భాగం మాత్రమే, అదే జీవితం కాదు అనే విషయాన్ని తెలియజెప్పే విలువలతో కూడిన కుటుంబ కథాచిత్రం ‘ప్రేమతో మీ కార్తీక్’. రమణశ్రీ పతాకంపై రమణశ్రీ గుమ్మకొండ, రవీందర్ గుమ్మకొండ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు రిషి. సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

03/17/2017 - 20:56

జయ.బి దర్శకత్వంలో నిర్మాత బి.ఎ.రాజు రూపొందిస్తున్న లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘వైశాఖం’. ఆర్.జె.సినిమాస్ పతాకంపై హరీష్, అవంతిక జంటగా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోవిడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మహేష్‌బాబు ఆడియో సీడీని విడుదల చేసి తొలి కాపీని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు అందించారు.

03/17/2017 - 20:53

చలపతి సినీ ఫిలింస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో టి.చలపతి రూపొందించిన చిత్రం ‘చామంతి’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమైంది. నూతన తారాగణంతో పూర్తిస్థాయి రొమాంటిక్ హారర్ కథ నేపథ్యంతో అడవి నేపథ్యంలో సాగే ఈ చిత్రం యువతకు నచ్చుతుందని దర్శక నిర్మాత టి.చలపతి తెలియజేశారు.

03/17/2017 - 20:52

చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మలయాళ నటి భావనపై దాడి తరువాత బాహాటంగానే పలువురు తమ అభిప్రాయాలను చెబుతున్నారు. ఇలాంటి దాడులను ఖండిస్తూనే గతంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితులు మెరుగ్గానే ఉన్నాయంటోంది తమన్నా. చిత్ర పరిశ్రమలో ఇప్పుడు చాలా మార్పు వచ్చిందని, ఇంతకుముందులా మహిళానటులు అణగదొక్కబడటం లేదని, సినిమాల్లో కూడా స్వాతంత్య్రం లభిస్తోందని చెబుతోంది.

03/17/2017 - 20:48

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్, తూము ఫణికుమార్ సంయుక్తంగా రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘వెంకటాపురం’. రాహుల్, మహిమా మక్వాన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని వేణు దర్శకత్వంలో రూపొందించారు. సినిమాకు సంబంధించిన తొలి పాటను దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

03/17/2017 - 20:46

నక్షత్ర మీడియా ప్రొక్షన్స్ పతాకంపై జె.డి.చక్రవర్తి, అక్షత జంటగా అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో నక్షత్ర రాజశేఖర్ రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ- మంచి సినిమాతో రావాలని పక్కా ప్లాన్‌తో సింగిల్ షెడ్యూల్‌లో ఈ సినిమా రూపొందిస్తున్నామని తెలిపారు.

03/16/2017 - 20:59

బాహుబలి అసలు కథ అంతా రెండోభాగమైన ‘బాహుబలి-ద కంక్లూజన్’లోనే ఉందని అంటున్నారు దర్శకుడు రాజవౌళి. ఒకే భాగంలో కథనంతా చెప్పలేక రెండుగా తీశామన్న ఆయన అసలైన ‘డ్రామా’ అంతా రెండోభాగంలో ఉందని, ‘బాహుబలి’ని మించి ఇది ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రభాస్, రానాసహా చిత్ర బృందంతో కలసి ఆయన బాహుబలి రెండోభాగానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను గురువారం ఉదయం 10.30కు విడుదల చేశారు.

Pages