S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/14/2017 - 20:55

నటుడు జె.డి.చక్రవర్తి తన శిష్యుడు అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నాడు. గతంలో ‘రణం’ వంటి చిత్రంతో దర్శకుడిగా మారిన అమ్మ రాజశేఖర్, తాజాగా నక్షత్ర రాజశేఖర్ నిర్మాణ సారథ్యంలో రూపొందించే ఓ చిత్రాన్ని ప్రారంభించనున్నారు.

03/14/2017 - 20:54

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇషాన్ హీరోగా, మన్నారా చోప్రా, ఏంజెలినా హీరోయిన్లుగా తాన్వి ఫిలింస్ పతాకంపై డా.సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి సంయుక్తంగా నిర్మిస్తున్న రొమాంటిక్ ప్రేమకథాచిత్రం ‘రోగ్’. మరో చంటిగాడి ప్రేమకథ అనేది క్యాప్షన్. సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో సీడీలను ఆర్బాజ్‌ఖాన్ విడుదల చేయగా, తొలి సీడీని వి.వి.వినాయక్ అందుకున్నారు.

03/14/2017 - 20:52

యంగ్ మెగా హీరో వరుణ్‌తేజ్ 2016లో రెండు సినిమాల్ని మొదలుపెట్టాడు. ఆ రెండింటిలో శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ‘మిస్టర్’ చిత్రం ముగింపు దశకు చేరుకుంది. రెండు పాటలు మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తయిందని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ ధ్రువీకరించింది.

03/14/2017 - 20:51

బాలీవుడ్‌లో ఏ హీరోయిన్ అయినా ఖాన్ త్రయంతో సినిమా చేయాలని కోరుకుంటారు. కానీ ఈమె మాత్రం ఖాన్‌లు అయితే గొప్పేంటి అని షాక్ ఇచ్చింది. ఇంతకీ ఈ మాట అన్నది ఎవరో తెలుసా, బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్! ఈమధ్య పలు కామెంట్స్ చేస్తూ బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ అమ్మడు లేటెస్టుగా సల్మాన్, అమీర్, షారుఖ్‌ల పేర్లు ప్రస్తావిస్తూ గొప్పేంటి అంటూ షాక్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

03/14/2017 - 20:50

‘చందమామ కథలు’ చిత్రంతో వెండితెరపైకి వచ్చిన యంగ్ హీరో నాగశౌర్య. శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేసిన ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించుకుని నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘కళ్యాణ వైభోగమే’ వంటి సినిమాలు ఫర్వాలేదనిపించుకోగా, చివరి చిత్రాలు ‘జో అచ్యుతానంద’ మంచి విజయం సాధిస్తే, ‘నీ జతలేక’ పరాజయం పొందింది.

03/14/2017 - 20:48

సౌత్‌లో గ్లామర్ హీరోయిన్‌గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నయనతారకు ప్రస్తుతం కోలీవుడ్‌లో మంచి క్రేజ్ వుంది. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్ని ఎంచుకుంటూ దూసుకుపోతోంది. సినిమాలతోనే కాక ప్రేమాయణాలతో సంచలనం రేపిన నయనతార ఇప్పటికే రెండు ప్రేమకథల్ని సాగించింది. ప్రస్తుతం విఘ్నేష్‌శివన్‌తో మూడో ప్రేమకథ సాగిస్తున్న విషయం తెలిసిందే.

03/12/2017 - 21:15

అల్లరి నరేష్, నిఖిలా విమల్ జంటగా జి.ప్రజిత్ దర్శకత్వంలో జాహ్నవి ఫిలిమ్స్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్న ‘మేడమీద అబ్బాయి’ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని క్లాప్‌నివ్వగా నూజివీడు సీడ్స్ వైస్ ప్రెసిడెంట్ రామకోటేశ్వరరావు స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు గౌరవ దర్శకత్వం వహించారు.

03/12/2017 - 21:13

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజవౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాహుబలి-2 చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్ ఆదివారం విడుదలైంది. హోలీ సందర్భంగా విడుదల చేసిన ఈ ఫొటోలో కథానాయకుడు ప్రభాస్, ప్రతినాయకుడు రానా, అనుష్క, సత్యరాజ్, తమన్నా ఉన్నారు.

03/12/2017 - 21:12

ప్రముఖ నటుడు పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రం విడుదలకు సిద్ధవౌతోంది. ఇప్పటికే ఒక్కో పాటను విడుదల చేస్తూ సినిమాపై మరింత క్రేజ్‌ను పెంచుతున్నారు. ముఖ్యంగా కాటమరాయుడు పాటలకు అనూహ్యమైన స్పందన వస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత పవన్‌కళ్యాణ్ నటించే సినిమాకోసం అప్పుడే సన్నాహాలు మొదలయ్యాయి. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలతో వీరి కాంబినేషన్‌కు క్రేజ్ ఏర్పడింది.

03/12/2017 - 21:10

ప్రముఖ నటుడు రజనీకాంత్, క్రేజీ దర్శకుడు శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సంచలనాత్మక చిత్రం ‘రోబో 2.0’. 2010లో వచ్చిన రోబో చిత్రం సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా రోబో 2.0 ను రూపొందిస్తున్నారు. 350 కోట్ల భారత బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ పూర్తికావచ్చింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.

Pages