S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/26/2017 - 01:11

హాలీవుడ్‌లో రెసిడెంట్ ఈవిల్ సీరిస్‌లో భాగంగా ఇప్పటికే ఐదు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఆరో భాగం ‘రెసిడెంట్ ఈవిల్ ది ఫైనల్ చాప్టర్’ విడుదలకు సిద్ధమైంది. మిల్లా జోవిచ్, రూబిరోజ్ నటించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న విడుదల చేయనున్నారు. గత భాగం ఎక్కడ ముగిసిందో అక్కడినుండే ఈ సినిమా ప్రారంభం అవుతుంది. మానవాళి అంతం కోసం సాగిన నరమేధలో కథానాయకురాలు అలీస్ బతికి బైటపడుతుంది.

01/26/2017 - 01:11

బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. ఎప్పటి నుంచో మోక్షజ్ఞ కోసం ఓ జానపద కథను అనే్వషిస్తున్న సంగతి తెలిసిందే. గౌతమిపుత్ర శాతకర్ణి హిట్ అయిన నేపథ్యంలో శాతకర్ణి కుమారుడు పులోమావి కథను తెరపై ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రంలో పులోమావిగా మోక్షజ్ఞ నటిస్తారట. శాతకర్ణి సినిమా అంతా యుద్ధ నేపథ్యంలో వున్నది కనుక పులోమావి కథను ప్రేమాయణం నేపథ్యంలో చిత్రీకరిస్తాని భోగట్టా.

01/26/2017 - 01:10

బిచ్చగాడు సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన విజయ్ ఆంటోని నటిస్తున్న తాజా చిత్రం యామన్. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి దర్శకుడు జీవ శంకర్. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు.

01/26/2017 - 01:09

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మంచు మనోజ్ హీరోగా, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా ఎస్.కె.సత్య తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుంటూరోడు’ ఆడియో విడుదల నేడు జరగనుంది. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేస్తారు. రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, సంపత్, పృధ్వి, ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కావీ విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.

01/26/2017 - 01:09

రానా, తాప్సీ, కె.కె.మీనన్, అతుల్ కులకర్ణి, నాజర్ తదితరులు ప్రధాన తారాగణంగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, పివిపి సినిమా సంయుక్తంగా సంకల్ప్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఘాజీ’. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో దగ్గుబాటి రానా మాట్లాడుతూ,‘ముందుగా ఈ సినిమాకు సంబంధం లేని వ్యక్తి రామ్మోహన్‌కి కృతజ్ఞతలు చెప్పాలి.

01/26/2017 - 01:08

కన్నడ చిత్రం ‘యూ టర్న్’ రీమేక్‌లో నటించడానికి సమంత ఓకే చెప్పింది. క్రైమ్, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం రీమేక్‌కు సంబంధించి చిత్ర దర్శకుడు పవన్‌కుమార్ బెంగళూరులో చర్చలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం రీమేక్ త్వరలో ప్రారంభం కానుంది. ఒరిజినల్ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన పవన్‌కుమారే రీమేక్‌కు కూడా దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం సమంత రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది.

01/26/2017 - 01:07

టాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో రానా ఎవరితో రొమాన్స్ చేస్తున్నాడా? అన్న ఆసక్తి కలిగిందా? అయితే ఈ విషయం విన్న తరువాత మీకే తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ఘాజీ సినిమాలో నటించిన రానా తన తర్వాతి ప్రాజెక్టుగా తేజ దర్శకత్వంలో ‘నేనే రాజు నేనే మంత్రి’లో నటిస్తున్నాడు.

01/24/2017 - 21:02

జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ పెల్లుబికిన నిరసనలను ఎలాగైనా ఆపాలని ప్రభుత్వం చేస్తున్న చర్యలను అందరూ ఖండించాలని ప్రముఖ నటుడు కమల్ హాసన్ పిలుపునిచ్చారు. జల్లికట్టును అనుమతించాలంటూ చేస్తున్న ఆందోళనలో భాగంగా ఓ వీడియోను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

01/24/2017 - 21:00

పవన్‌కల్యాణ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ కాటమరాయుడు చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. హీరో, అతని తమ్ముళ్ల పాత్రలో నటిస్తున్నవారిపై సెంటిమెంటల్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఫిబ్రవరికల్లా షూటింగ్‌ని పూర్తిచేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఉగాదికి చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు.

01/24/2017 - 20:58

‘ఈ సంక్రాంతికి నేను నటించిన రెండు చిత్రాలు విడుదలై మంచి విజయాలను సాధించాయి. నటుడుగా నాకు మంచి పేరును తెచ్చాయ’ని అంటున్నాడు నటుడు సునీల్‌కుమార్. గౌతమిపుత్ర శాతకర్ణి బౌద్ధ సన్యాసి ధర్మనందనుడుగా, హెడ్‌కానిస్టేబుల్ వెంకట్రామయ్య చిత్రంలో విలన్ క్యారెక్టర్‌లో నటించిన సునీల్‌కుమార్ మంగళవారం మీడియాతో ముచ్చటించాడు. ‘నేను మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో పుట్టి పెరిగాను.

Pages