S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/06/2018 - 04:18

కోల్‌కతా: కోల్‌కొతా నగరంలో వంతెనలు కూలడం పరిపాటిగా మారింది. ముందుగా ఎన్ని హెచ్చరికలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. అధికార యంత్రాంగం నిర్లప్తత, నిర్లక్ష్యం కూడా కారణాలని అంటున్నారు.

09/06/2018 - 04:14

ముంబయి, సెప్టెంబర్ 5: సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ వయోభారం సమస్యలతో బుధవారం ఆసుపత్రిలో చేరారు. ఆయన వయస్సు 95 సంవత్సరాలు. ఛాతి సంబంధమైన సమస్యలతో దిలీప్‌కుమార్ గత కొంత కాలంగా బాధపడుతున్నట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ముంబాయి లీలావతిలో దిలీప్ కుమార్‌ను ఆయన కుటుంబ సభ్యులు చేర్పించారు.

09/06/2018 - 04:12

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆసియా ఈశాన్య ప్రాంత డైరెక్టర్‌గా డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ రెండో దఫా నామినేట్ అయ్యారు. మరో ఐదేళ్లపాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ప్రాంతం నుంచి ఈ పదవికి ఎంపికైన తొలిమహిళ ఈమే కావడం గమనార్హం.

09/06/2018 - 04:11

చండీగఢ్, సెప్టెంబర్ 5: పే స్కేలు పెంపులతోపాటు ఎంతోకాలం నుండి అపరిష్కృతంగా ఉన్న పలు డిమాండ్ల సాధన కోసం పంజాబ్ రాష్ట్రంలో ఆరువేలకు పైగా ప్రభుత్వం, ప్రభుత్వేతర కళాశాలలకు చెందిన ఉపాధ్యాయులు మూకుమ్మడి సెలవు పెట్టారు. ఒక్కసారిగా వేలాదిమంది టీచర్లు సెలవు పెట్టడంతో రాష్టమ్రంతటా ఆందోళన నెలకొంది.

09/06/2018 - 02:13

మదర్ థెరిస్సా 21వ వర్ధంతి సందర్భంగా బుధవారం
కోల్‌కతాలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రార్థనలు చేస్తున్న నన్స్.

09/06/2018 - 02:12

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఉద్యోగ భద్రత కోసం ఊగిసలాడుతున్న జర్నలిస్టులకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) చైర్మన్ జస్టిస్ సీకే ప్రసాద్ అభిప్రాయపడ్డారు. సామాజిక భద్రత కరువైన జర్నలిస్టులు వృత్తికి న్యాయం చేయలేరని ఆయన అభిప్రాయపడ్డారు.

09/06/2018 - 02:06

జమ్మూ, సెప్టెంబర్ 5: రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయని జమ్మూకాశ్మీర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీఏ మిర్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతోమాట్లాడుతూ జమ్మూకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిపై పలువురు రకరకాల ప్రకటన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

09/06/2018 - 02:01

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: కేంద్రం అమలు చేస్తున్న ఉద్యోగుల కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీ ఏన్జీవోలు పార్లమెంట్ వీధిలో బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఏన్జీవోల సంఘం నాయకులు అశోక్‌బాబు, చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు సాంఘిక భద్రతగా ఉపయోగపడుతున్న పెన్షన్ విధానాన్ని కేంద్రం రద్దు చేసిందని ఆరోపించారు.

09/06/2018 - 01:59

అహ్మదాబాద్, సెప్టెంబర్ 5: గుజరాత్‌కు చెందిన ప్రముఖ రచయిత, పాత్రికేయుడు భగవత్‌కుమార్ (84) బుధవారం సూరత్‌లోని తన స్వగృహంలో కన్నుమూసారు. సాహిత్య అకాడమీ అవార్డు సహా పలు పురస్కారాలు, గౌరవాలను అందుకున్న ఈయన వృద్ధాప్య కారణాలతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. భగవత్‌కుమార్ మృతికి ప్రధాని నరేంద్రమోదీ, పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

09/06/2018 - 01:52

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని జాతీయ ఉత్తమ అవార్డులు స్వీకరించిన ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు తీసుకున్న వారు ప్రధానిని లాంఛనంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యయ వృత్తిని మించినది మరొకటి లేదని అన్నారు.

Pages