S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/26/2018 - 05:54

న్యూఢిల్లీ, జూలై 25: గత మూడేళ్లుగా ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన స్నాచింగ్ కేసుల్లో తమ సొత్తును పోగొట్టుకున్నట్టు ఫిర్యాదు చేసిన బాధితుల్లో 40 మంది విదేశీయులు సైతం ఉన్నారని కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారాబ్ అహిర్ బుధవారం రాజ్యసభలో తెలిపారు. గత మూడేళ్లుగా ఢిల్లీలో స్నాచింగ్ కేసులు ఆరింతలు ఎక్కువయ్యాయా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

07/26/2018 - 21:21

న్యూఢిల్లీ, జూలై 25: దేశంలోని కొన్ని ఉగ్రవాద లేదా అతివాద గ్రూపులు తమ అనైతిక కార్యకలాపాలకు అభం శుభం తెలియని చిన్నారులను బలితీసుకుంటున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

07/26/2018 - 05:52

న్యూఢిల్లీ, జూలై 25: విదేశాల్లోని వివిధ జైళ్లలో 8,363 మంది భారతీయులు మగ్గుతున్నారని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో తెలిపింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ బుధవారం జరిగిన సమావేశంలో ఈ విషయమై రాతపూర్వంగా సమాధానం తెలిపారు.

07/26/2018 - 21:25

న్యూఢిల్లీ, జూలై 25: ఆంధ్రప్రదేశ్‌కు న్యా యం చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్ అవరణలో ఆందోళన చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలంటూ ప్లకార్డులు చేతబట్టి, నినాదాలిచ్చారు. మొదట మహాత్మా గాంధీ విగ్రహం వద్ద, ఆ తర్వాత పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద నిరసన వ్యక్తం చేశారు. న్యాయం చేసేవరకు నిరసనలను కొనసాగిస్తామని టీడీపీ ఎంపీ లు స్పష్టం చేశారు.

07/26/2018 - 01:35

న్యూఢిల్లీ, జూలై 25: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా తాను ప్రవర్తించిన తీరుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయ సాయిరెడ్డి క్షమాపణ చెప్పారు. చర్చలో తమ పార్టీకి సరైన సమయం కేటాయించలేదని, చైర్మన్ వెంకయ్య నాయుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పోడియం వద్దకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభనుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.

07/26/2018 - 01:14

న్యూఢిల్లీ, జూలై 25: జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ఎంపీల బృందం బుధవారం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రామ్ విలాస్ పాశ్వాన్‌ను కలిశారు. కేంద్ర జాతీయ రహదారులు, నౌకాయన శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన బృందం తెలంగాణకి చెందిన రహదారుల అంశంపై చర్చించారు.

07/26/2018 - 05:07

న్యూఢిల్లీ, జూలై 25: తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు బుధవారం లోక్‌సభలో బాహాబాహీకి సిద్ధమయ్యారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన కళ్యాణ్ బెనర్జీ తదితరులు ఆగ్రహంతో అధికార పక్షం వైపు దూసుకువచ్చి బీజేపీ సభ్యుడు కిరట్ సోమయ్యపై దాడికి సిద్ధమయ్యారు. బీజేపీ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ తదితరులు అడ్డంపడి తృణమూల్ సభ్యులను శాంతపరిచి వారి సీట్లలోకి పంపించి వేశారు.

07/25/2018 - 23:43

న్యూఢిల్లీ, జూలై 25: ప్రభుత్వం 373 ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఎస్‌ఈజెడ్)కు కేటాయిస్తూ నోటిఫై చేసిన మొత్తం భూమి 45,711 హెక్టార్లలో సుమారు సగం భూమి ఖాళీగా ఉంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సీఆర్ చౌదరి బుధవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయం వెల్లడించారు.

07/25/2018 - 16:55

ముంబయ: రిజర్వేషన్ల కోసం బంద్ చేపట్టిన మరాఠాలు విరమించుకున్నారు. ఈ బంద్ పిలుపుతో పలుచోట్ల హింసాత్మక సంఘటనల చోటుచేసుకున్నాయ. బంద్ మరింత హింసాత్మకం కాకుండా నిలువరించేందుకుగానూ బంద్ ఉపసంహరించుకున్నట్లు మరాఠా క్రాంతి సమాజ్ వెల్లడించింది. దీంతో ముంబయలో ఇప్పుడు ట్రాఫిక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

07/25/2018 - 16:54

అహ్మదాబాద్: గుజరాత్ పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్‌కు విస్‌నగర్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2015 అల్లర్ల కేసుకు సంబంధించి కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా కూడా విధించింది. ఈ సందర్భంగా పటేల్ తన మద్దతుదారులతో సమావేశమై ఎవరూ ఎలాంటి ఆందోళనలు చేయవద్దని చెప్పారు.

Pages