S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/23/2018 - 17:41

భువనేశ్వర్: ఒడిశాను భారీ వర్షాలు ముంచెత్తాయి. నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. సంబల్‌పూర్‌లో భారీవర్షాల ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఇళ్లలోకి భారీఎత్తున వరద నీరు వచ్చి చేరటంతో సహాయక చర్యలు చేపట్టారు.

07/23/2018 - 17:40

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఈడీ, సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న కార్తీకి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లభించింది. ఈనెల 23 నుంచి 31 వరకు ఆయన అమెరికా, యూకే, ఫ్రాన్స్ దేశాలలో పర్యటించేందుకు అనుమతి లభించింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

07/23/2018 - 17:40

న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్-మాక్సిక్ కేసులో మాజీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరానికి ఊరట లభించింది. ఆగస్టు 7వ తేదీ వరకు ఆయనను అరెస్టు చేయవద్దంటూ పాటియాల కోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ చిదంబరం చేసుకున్న దరఖాస్తును కోర్టు మంగళవారంనాడు విచారణ చేపట్టనున్నది.

07/23/2018 - 13:46

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏయే అంశాలపై వాదనలు వినిపించాలనే విషయంపై నివేదిక ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం కోరినప్పటికీ ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ వివరాలు ఇవ్వలేదని ఏపీ తరపున న్యాయవాది తెలుపటంతో తదుపరి విచారణను జూలై 30కి వాయిదా వేసింది.

07/23/2018 - 12:16

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు సోమవారంనాడు ప్రారంభమయ్యాయి. లోకసభలో స్పీకర్ సుమిత్రామహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదాపై స్వల్పకాలిక చర్చ జరుగనున్నది.

07/23/2018 - 12:15

న్యూఢిల్లీ: పార్లమెంటు ఆవరణలో టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతుంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేశారు. ప్రధాని, కేంద్రం ఏ ఒక్క అంశంపైనా స్పష్టత ఇవ్వలేదని అన్నారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అన్నమయ్య వేషధారణలో పాల్గొన్నారు.

07/23/2018 - 04:26

న్యూఢిల్లీ: వివాదస్పద రాఫెల్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్‌ల ఒప్పందంలో స్కాం జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ స్కీంపై రక్షణ శాఖమంత్రి నిర్మల సీతారామన్ తప్పుల తడకలతో కూడిన ప్రకటన చేశారని ఆయ న అన్నారు.

07/23/2018 - 03:31

న్యూఢిల్లీ, జూలై 22: మైనర్లపై జరుగుతున్న అత్యాచారాల నిరోధక చట్టం ‘పొక్సో‘కు పదును పెట్టి, బాలురపై అత్యాచార సంఘట నల్లోనూ దోషులను మరింత కఠినంగా శిక్షించేలా సవరణలు తీసుకురావాలని మహిళా శిశు సంక్షే మ మంత్రిత్వ శాఖ (డబ్ల్యూసీడీ) పట్టుదలతో ఉంది. బాలురు కూడా అత్యాచార బాధి తులేనని, వారిపై అమానుష చర్యకు ఒడిగట్టివారికి ప్రస్తుతం విధిస్తున్న శిక్ష సరిపోదని స్పష్టం చేస్తున్నది.

07/23/2018 - 03:29

న్యూఢిల్లీ, జూలై 22: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాల కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయడానికి, బాధితులకు సత్వర న్యాయం జరగడానికి కేంద్రం తన చర్యలను వేగవంతం చేసింది. అత్యాచార, అఘాయిత్య కేసుల విచారణలో ఉపయోగించే ఐదువేల కిట్లను దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్‌స్టేషన్లకు ఇవ్వాలని నిర్ణయించినట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

07/23/2018 - 03:27

న్యూఢిల్లీ, జూలై 22: పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే తలాక్ బిల్లును తమ పార్టీ వ్యతిరేకించడం లేదని, అయితే, భరణం అంశాన్ని కూడా చేరిస్తేనే పూర్తి మద్దతునిస్తామని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మిత దేవ్ స్పష్టం చేశారు. ఆదివారం ఆమె పీటీఐతో మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ బిల్లులో బాధిత ముస్లిం మహిళలకు భరణం ఇప్పించే అంశం లేదని తెలిపారు.

Pages