S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/24/2018 - 16:17

రాంచీ : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) కీలక నేత ఇంద్రేష్‌ కుమార్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్‌ రాజధాని రాంచీలో జగ్రాన్‌ హిందూ మంచ్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఇంద్రేష్‌ మంగళవారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆవును చంపాలని ఏ మతం బోధించద లేదన్నారు. ఎప్పుడైతే ఆవులను చంపడం (గోవధ) ఆపేస్తారో అప్పుడే దేశంలో కొనసాగుతోన్న మారణహోమానికి ఫుల్‌స్టాప్‌ పడుతుందని పేర్కొన్నారు.

07/24/2018 - 12:43

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ఈరోజు స్పల్పకాలిక చర్చ జరుగనున్నది.

07/24/2018 - 12:42

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ధర్నా నిర్వహించారు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్ రచయిత శంకరంబాడి సుందరాచారి వేషధారణలో వచ్చారు.

07/24/2018 - 13:46

చెన్నై: చెన్నైలో విషాదం చోటుచేసుకుంది. ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తు ఆరుగురు ప్రయాణీకులు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్ లైన్ల పునరుద్ధరణ కారణంగా లోకల్ రైళ్లను రద్దుచేశారు. ఒక రైలును మాత్రమే నడిపారు. ఫుట్‌బోర్డుపై అనేకమంది వేలాడుతూ ప్రయాణించారు. రైలు ఫరంగిమలై వచ్చే దారిలో గోడ తగలి ప్రయాణీకులు కొంతమంది పడిపోయారు. వీరిలో నలుగురు మరణించారు.

07/24/2018 - 12:40

ముంబయి: ముంబయిలో ఓ కారు విధ్వంసం సృష్టించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్‌లో ఓ కారు అదుపుతప్పి వాహనాల పార్కింగ్ వైపునకు దూసుకురావటంతో దాదాపు 12 వాహనాలు ధ్వంసమయ్యాయి. కారు డ్రైవర్‌ను అదుపులోనికి తీసుకుని పోలీసులకు పట్టించి ఇచ్చారు. అతను డ్రగ్స్ తీసుకుని ఉన్నాడని, వాహనాల ఎయిర్ కండీషినింగ్ కంపెనీకి డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.

07/24/2018 - 04:49

ఆషాఢ ఏకాదశి పర్వదినం సందర్భంగా ముంబయిలో ‘దిండీ’ ఊరేగింపును నిర్వహిస్తున్న విఠల భక్తులు

07/24/2018 - 02:08

కోల్‌కతా నగరం భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. రోడ్లపై మోకాలి లోతు నీళ్లలోనే వాహనాలను నడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ పరిస్థితుల్లోనే విద్యార్థులు స్కూళ్లకు వెళుతున్నారు

07/24/2018 - 02:05

న్యూఢిల్లీ, జూలై 23: దేశంలోని పలు ఉన్నత విద్యాసంస్థల్లో ర్యాగింగ్ విషసంస్కృతిపై వస్తున్న ఫిర్యాదులు గత మూడేళ్లలో రెట్టింపు అయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తాజా నివేదికలో పేర్కొంది.

07/24/2018 - 02:01

న్యూఢిల్లీ, జూలై 23: రాజ్యసభలో సభ్యులు లేవనెత్తే అంశాలపై నోటీసులు సమర్చించేందుకు ఆన్‌లైన్ విధానం ఏర్పాటైంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించినట్లు చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు వెల్లడించారు. సెక్యూర్ ఇ నోటీసెస్ అప్లికేషన్ పేరిట ఏర్పాటైన ఈ యాప్‌ను సభ్యులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

07/24/2018 - 02:00

న్యూఢిల్లీ, జూలై 23: అసోం పౌరుల నమోదుకు ఉపయోగించే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సీ)లో పేరు లేనంత మాత్రాన వారు విదేశీయులుగా నిర్ధారించబోమని, అలాంటి వారు నెలరోజుల్లో పెట్టుకునే అర్జీలు, న్యాయపరమైన ప్రక్రియ ముగిసిన తర్వాతే పూర్తి నిర్ధారణకు వస్తామని హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు.

Pages