S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/25/2018 - 17:01

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఉగ్రవాదులు ఇక్కడ తలదాచుకున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు లాల్‌చౌక్ ప్రాంతంలో జల్లెడ పడుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి.

07/25/2018 - 12:48

ముంబయి: విద్య, ఉద్యోగ రంగాల్లో మరాఠా సామాజికవర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మరాఠా క్రాంతి మోర్చా ఆధ్వర్యంలో బుధవారంనాడు చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. థానేలో రైలు పట్టాలపైకి వచ్చిన ఆందోళనకారులు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. లాతూర్ జిల్లాలోని ఉద్గిర్‌లో బలవంతంగా దుకాణాలను మూసివేయించారు. పలుచోట్ల బస్సులను ధ్వంసం చేశారు. రోడ్లపై టైర్లను కాల్చివేసి వాహనాలను అడ్డుకున్నారు.

07/25/2018 - 06:04

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటం లేదని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి విమర్శించారు. మంగళవారం రాజ్యసభలో విభజన హామీపై 276 నిబంధన కింద చేపట్టిన చర్చను ప్రారంభిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

07/25/2018 - 02:08

న్యూఢిల్లీ, జూలై 24: ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అమలు కాకపోవడంలో కేంద్ర వైఫల్యం ఎంత ఉందో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కూడా అంతే ఉందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు చెప్పారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలుపై రాజ్యసభలో జరిగిన చర్చలో రామచంద్రరావు తెలుగులో మాట్లాడారు.

07/25/2018 - 05:38

న్యూఢిల్లీ, జూలై 24: ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీలను అమలు చేయకుండానే అన్నీ అమలు చేశామని సుప్రీం కోర్టులో అఫిడ్‌విట్ దాఖలు చేయటం ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశ ప్రజలను మోసం చేసిందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ దుయ్యబట్టారు. ఆజాద్ మంగళవారం రాజ్యసభలో విభజన హామీల అమలుపై జరిగిన చర్చలో పాల్గొంటూ మోదీ ప్రభుత్వం సభా హక్కుల ధిక్కారానికి పాల్పడిందని స్పష్టం చేశారు.

07/25/2018 - 02:04

న్యూఢిల్లీ, జూలై 24: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం విభజన హామీలన్నీ అమలు చేస్తుంటే చంద్రబాబునాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలతో ప్రజలను రెచ్చగొడుతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుఆరోపించారు.

07/25/2018 - 05:41

న్యూఢిల్లీ, జూలై 24: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చి తీరుతామని హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. ప్రత్యేక హోదాను అమలు చేయటం వలన కలిగే లాభం కంటే ఎక్కువ లాభాన్ని ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అందజేస్తున్నామన్న ఆయన ప్రత్యేక హోదా ఇవ్వటం జరగదనేది చెప్పకనే చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో తొంబై శాతం హామీలను పూర్తి చేశాం..

07/25/2018 - 05:42

న్యూఢిల్లీ, జూలై 24: ఆంధ్ర ప్రదేశ్ విభజన అశాస్ర్తియంగా జరిగిందని, విభజన బిల్లును అన్యాయంగా ఆమోదించారని ఆరోపించటం ద్వారా తెలుగుదేశం పార్టీ రాజ్యసభను అవమానిస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.మంగళవారం రాజ్యసభలో విభజన హామీల అమలుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన అరవై సంవత్సరాల పోరాట ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్టమ్రని స్పష్టం చేశారు.

07/24/2018 - 17:03

న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రత్యేక హోదాపై చర్చ జరిగింది. చర్చను టీడీపీ సభ్యుడు సుజనాచౌదరి ప్రారంభిస్తూ.. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తుందని అన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలుకు నోచుకోవటం లేదని అన్నారు. రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు సైతం అమలుకు నోచుకోవటం లేదని అన్నారు.

07/24/2018 - 16:59

నొయిడా:బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను ఉత్తరప్రదేశ్‌లోని నొయిడాలో మంగళవారంనాడు అరెస్టు చేశారు. వీరిని ముషరఫ్ హుస్సేన్, రూబెల్ అహ్మద్‌గా గుర్తించారు. పట్టుబడిన ఉగ్రవాదులిరువురూ దేశ రాజధానిలో భారీ దాడులకు కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు.

Pages