S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/24/2018 - 02:00

న్యూఢిల్లీ, జూలై 23: దేశంలో సామాజిక మాధ్యమాలను నియంత్రించే యోచన ప్రభుత్వానికి లేదని సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ తెలిపారు.

07/24/2018 - 01:59

ముంబయి, జూలై 23: భారతీయ జనతా పార్టీ మన దేశంలో గోవుల రక్షణకు ఇస్తున్న ప్రాధాన్యత మహిళల భద్రతకు ఇవ్వడం లేదని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో హింసాపూరిత ఘటనలు చోటుచేసుకున్నాయని ఆయన అన్నారు.

07/24/2018 - 01:57

న్యూఢిల్లీ, జూలై 23: ఉత్తర ఈశాన్య ప్రాంతాల్లోని రాష్ట్రాలతోపాటు జమ్మూ అండ్ కాశ్మీర్‌లో ప్రస్తుతం అమలులో ఉన్న పారిశ్రామిక అభివృద్ధి పథకాల అమలు కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చేర్చాలంటూ ఎలాంటి ప్రతిపాదన తమకు అందలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం తెలిపింది. ఈ విషయమై లోక్‌సభలో సోమవారం జరిగిన సమావేశంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సీఆర్ చౌదరి రాతపూర్వక సమాధానం చెప్పారు.

07/24/2018 - 01:50

పార్లమెంటు ఆవరణలో సోమవారం నిరసన తెలుపుతున్న టీడీపీ ఎంపీలు శివప్రసాద్, గల్లా జయదేవ్, మాగంటి బాబు.. ప్రత్యేక హోదా సాధన కోసం ఇప్పటికే పలు వేషాలతో నిరసన తెలిపిన శివప్రసాద్ సోమవారం అన్నమయ్య పాత్రలో దర్శనమిచ్చారు

07/24/2018 - 02:35

న్యూఢిల్లీ: పోలవరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం ప్రభుత్వం పంపించిన రూ.58,319 కోట్ల సవరించిన అంచనాలను ఇంకా ఆమోదించ లేదని కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ తెలిపారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు అడిగిన ప్రశ్నకు మేఘవాల్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయం తెలిపారు.

07/24/2018 - 02:34

న్యూఢిల్లీ, జూలై 23: ఫ్రాన్స్ నుంచి రాఫెల్ విమానాల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ లోక్‌సభనే కాక యావత్ భారతదేశ ప్రజలను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ ఆరోపించింది. కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోని, ఆనంద్‌శర్మ, రణదీప్ సుర్జీవాలా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

07/24/2018 - 01:42

న్యూఢిల్లీ, జూలై 23: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఎంపీ విజయసాయిరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా బదులుగా కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తీర్మానాలను ఎప్పుడు వెనక్కి తీసుకుంటారని ప్రశ్నించారు.

07/24/2018 - 01:05

న్యూఢిల్లీ, జూలై 23: శాసన సభకు పోటీ చేసే పార్టీ అభ్యర్థుల పేర్లను మూడు నుంచి ఆరు నెలల ముందే ప్రకటించే అవకాశాలున్నాయని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి రాష్ట్ర రాజకీయాల గురించి చర్చించారు.

07/24/2018 - 01:02

న్యూఢిల్లీ, జూలై 23: తెలంగాణలో వచ్చే సంవత్సరం జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తెలుగుదేశం పార్టీతో సీట్ల సర్దుబాటు చేసుకోవాలని రాష్ట్ర తెలంగాణ నేతలు ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ అంశాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పని చేసేందుకు టీడీపీ అధినాయకత్వం విముఖత చూపించకపోవచ్చుననే మాట వినిపిస్తోంది.

07/24/2018 - 01:13

న్యూఢిల్లీ, జూలై 23: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా, విభజన హామీలపై మంగళవారం రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ చేపడతామని చైర్మన్ ఎం. వెంకయ్యనాయుడు ప్రకటించారు. సోమవారం రాజ్యసభలో ఆందోళన చేస్తున్న టీడీపీ, వైకాపా ఎంపీలపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోడియం వద్ద నినాదాలు చేస్తున్న టీడీపీ, వైకాపా ఎంపీలను శాంతింపచేయడానికి ఆయన శతవిధాలా ప్రయత్నించారు.

Pages