S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/03/2018 - 04:30

లక్నో: ఉత్తర భారతాన్ని గాలి తుపానులు అల్లాడిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు మరో గాలి తుపాను ఉత్తరప్రదేశ్‌లో భీతావహం సృష్టించింది. దుమ్ముతో కూడిన తుపాను చెలరేగిన ఘటనలో 17మంది మృత్యువాత పడ్డారు. మరో 11మంది తీవ్రంగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. పెను గాలి దుమారానికి నేలకూలిన ఇళ్లు, చెట్ల కారణంగానే అధికశాతం మరణాలకు కారణమని ప్రభుత్వ అధికార ప్రతినిథి ఒకరు వెల్లడించారు.

06/03/2018 - 03:13

లక్నో, జూన్ 2: అధికారిక బంగ్లాలను ఖాళీ చేయాలంటూ మాజీ సీఎంలకు సుప్రీం కోర్టు విధించిన గుడువుకు ఒకరోజు ముందే మాజీ సీఎంలు కదలిక మొదలైంది. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్‌లు వీవీఐపీ అతిధి గృహానికి బస మార్చుకున్నారు. అదేవిధంగా మాయావతి ఒక అధికారిక బంగ్లాను ఖాళీ చేస్తూ, తానుంటున్న రెండో భవంతిని బీఎస్పీ ఫౌండర్ కాన్షీరామ్ స్మారక కేంద్రంగా మార్చాలని కోరుతున్నారు.

06/03/2018 - 02:57

పాట్నా, జూన్ 2: బిహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జేడీ(యూ), బీజేపీ, ఎల్‌జేపీ నేతలు డిమాండ్ చేయడంలో చిత్తశుద్ధిలేదని బీజేపీ అసమ్మతి ఎంపీ శత్రుఘ్న సిన్హా అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి నుంచి గట్టెక్కేందుకు ప్రత్యేక హోదా పల్లవిని ఈ మూ డు పార్టీలు అందుకున్నాయని విమర్శించారు.

06/03/2018 - 02:57

నాగ్‌పూర్, జూన్ 2: దేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడానికి కేంద్రం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోందని మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో మిగులుతో సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం నాలుగేళ్లలో సాధించిన అభివృద్ధిని శనివారం ఇక్కడ మీడియా సమావేశంలో కేంద్ర నౌక, రవాణా మంత్రి గడ్కరీ వెల్లడించారు.

06/03/2018 - 02:55

కోల్‌కతా, జూన్ 2: ఇటీవల కర్నాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉం చుతామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ వెల్లడించారు. ఎంసీసీఐ ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

06/03/2018 - 02:54

కోజికోడ్, జూన్ 2: నిఫావైరస్ భయంతో కేరళ ప్రభుత్వం స్కూళ్ల పునః ప్రారంభాన్ని వాయిదా వేయడంతో పాటు జరగాల్సిన అన్ని ముఖ్యమైన పరీక్షలను రద్దు చేసింది. శనివారం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అదనపు ముఖ్య కార్యదర్శి రాజీవ్ సదానందన్ తదితరులతో జరిపిన ఈ సమావేశంలో నిఫా వైరస్‌పై పరిస్థితిని సమీక్షించారు.

06/03/2018 - 02:53

న్యూఢిల్లీ, జూన్ 2: మమతా బెనర్జీ నాయకత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శనివారం ఇక్కడ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అధికార తృణమూల్ పార్టీ అరాచకాలకు అంతూపంతూ లేకుండా పోయిందని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ కార్యకర్తలను ఓ పథకం ప్రకారం చంపుకుంటూ పోతున్నారని మమతా సర్కార్‌పై షా మండిపడ్డారు. తాజాగా దులాల్ కుమార్ అనే బీజేపీ కార్యకర్త హత్యే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.

06/03/2018 - 02:52

న్యూఢిల్లీ, జూన్ 2: ప్రస్తుతం దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు అవసరమైన మానవవనరులు దేశంలో లభించడం లేదని, వివిధ విద్యాసంస్థల నుంచి చదువు పూర్తిచేసుకుని వస్తున్న వారి నైపుణ్యాలు సంస్థలకు పనికిరాకుండా పోతున్నాయని, వారి అవసరానికి, వీరి ప్రతిభకు పొంతన లేకుండా పోతోందని మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు.

06/03/2018 - 02:51

న్యూఢిల్లీ, జూన్ 2: ఐదు రోజుల దక్షిణాఫిక్రా పర్యటన నిమిత్తం విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ దక్షిణాఫ్రికా పర్యటనకు శనివారం బయలుదేరి వెళ్లారు. దక్షిణాఫ్రికాలో వివిధ దేశాల బృంద సమావేశాల్లో ఆమె పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆమె దక్షిణాఫ్రికాలో పిట్సంబర్గ్ రైల్వే స్టేషన్‌లో జరిగే ప్రధాన కార్యక్రమంలో పాల్గొంటారు.

06/03/2018 - 01:34

న్యూఢిల్లీ, జూన్ 2: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో సత్వర అభివృద్ధి సాధించేందుకు పలు పథకాలను ప్రవేశపెడుతున్నాయని ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. కొత్త రాష్ట్రాలుగా ఏర్పడి నాలుగో వార్షికోత్సవం జరుపుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు.

Pages