S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/12/2018 - 04:44

జనక్‌పూర్, మే 11: నేపాల్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఇక్కడకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా మోదీ, నేపాల్ ప్రధాని శర్మ ఓలి సంయుక్తంగా ‘జనక్‌పూర్-అయోధ్య’ బస్ సర్వీస్‌ను ప్రారంభించారు.

05/12/2018 - 04:26

నేపిటా, మే 11: ఇండియా మయన్మార్ దేశాలు ఏడు అంశాలపై ఒప్పందాలు చేసుకున్నాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆ దేశ ప్రతినిధులతోశాంతి భద్రతలు, అభివృద్ధి, రెకినే రాష్ట్రంలోని రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు తరలిపోవడం తదితర అంశాలపై చర్చించారు. గురువారం మయన్మార్ చేరుకున్న సుష్మా ఆ రాష్ట్ర కౌన్సిలర్ అంగ్‌సాన్‌సూకితో శుక్రవారం చర్చలు జరిపారు.

05/12/2018 - 04:47

జనక్‌పూర్, మే 11: నేపాల్‌లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ జనక్‌పూర్‌లోని జానకీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భారత ప్రధానులెవరూ ఇప్పటి వరకూ ఆలయాన్ని దర్శించలేదు. మోదీకే ఆ ఘనత దక్కింది.

05/12/2018 - 02:17

న్యూ ఢిల్లీ, మే 11: సామూహిక అత్యాచారాలకు గురైన యువతులకు రూ.5 నుంచి రూ.10 లక్షల వరకు నష్టపరిహారం ఇవ్వాలన్న జాతీయ లీగల్ సర్వీసస్ అథారిటీ ప్రతిపాదనకు సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఈ నష్టపరిహారం చెల్లించే విధంగా లీగల్ సర్వీసస్ అథారిటీ ప్రతిపాదనలు రూపొందించింది.

05/11/2018 - 18:09

ముంబయి: మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ మాజీ చీఫ్ ఐపీఎస్ అధికారి హిమాన్షురాయ్ శుక్రవారంనాడు ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టు అయ్యాడు. బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న హిమాన్షురాయ్ మానసిక ఒత్తిడికి గురై తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయాడు. కాగా ఈయన జర్నలిస్ట్ జడే హత్యకేసు, లైలాఖాన్ జంట హత్య కేసులను సమర్థవంతంగా విచారణ జరిపారు.

05/11/2018 - 18:09

బెంగళూరు: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేస్తున్న గాలి జనార్థన్ రెడ్డి బంధువు శ్రీరాములుపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఓబులాపురం గనుల కేసు తీర్పు గాలి జనార్థన్‌రెడ్డికి అనుకూలంగా ఇచ్చేందుకు రూ.500 కోట్లతో చీఫ్ జస్టిస్ బంధువుతోడీల్ మాట్లాడుతున్న వీడియో బయటకు రావటంతో ఇక్కడ సంచలనం కలిగింది. ఈ వీడియో 2010నాటిదని వెల్లడైంది.

05/11/2018 - 16:42

రాంచీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు అనారోగ్యం, వైద్య కారణాల మేరకు ఆయనకు ఆరు వారాల తాత్కాలిక బెయిల్ మంజూరైంది. దాణా కుంభకోణం కేసులో భాగంగా బిర్సాముందా జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూకు కుమారుడి వివాహం నిమిత్తం మూడు రోజులు ఆంక్షలతో కూడిన పెరోల్ మంజూరైన విషయం విదితమే. ఆయన గురువారంనాడు పాట్నా చేరుకున్నారు.

05/11/2018 - 16:39

బెంగళూరు: కర్నాటకలో ఎన్నికల ప్రచారం ముగియటంతో అక్కడ ఓటర్లకు గాలం వేసే పనిలో నేతలు ఉన్నారు. తనిఖీల్లో ఇప్పటి వరకు 80.19 కోట్ల విలువైన నగదు, 24,36కోట్ల రూపాయలు విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 44.26 కోట్ల విలువైన బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా చిత్రదుర్గ జిల్లా మొలకల్మూరులోని ఎద్దల బొమ్మన పట్టి వద్ద రూ.2.17 కోట్ల విలువైన నగదుదు స్వాధీనం చేసుకున్నారు.

05/11/2018 - 16:38

నేపాల్: నేపాల్ దేశంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. శుక్రవారం నేపాల్‌కు చేరుకున్న మోదీకి నేపాల్ ప్రధాని కేపీఓలీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ, కేపీ ఓలీ కలిసి అయోధ్య నుంచి సీతాదేవి పుట్టిన జనక్‌పురికి ఏర్పాటుచేసిన బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ బస్సు సర్వీసు చారిత్రాత్మకమైందని అన్నారు.

05/11/2018 - 16:36

అమరావతి: తిరుమలలోని అలిపిరి వద్ద బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై కాన్వాయ్‌పై జరిగిన రాళ్లదాడి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ విస్తత్ర స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ శ్రేణులు క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని అన్నారు. పార్టీకి చెడ్డపేరు తీసుకురావద్దని, అధికారంలో ఉన్నపుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.

Pages