S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/14/2018 - 17:33

న్యూఢిల్లీ: కావేరీ నిర్వాహక మండలి స్కీమ్ ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం సోమవారంనాడు సుప్రీంకోర్టుకు సమర్పించింది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ముసాయిదా స్కీమ్‌ను చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్‌కు సోమవారం సమర్పించారు.

05/14/2018 - 17:29

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కాంగ్రెస్‌ను బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు రాష్ట్రపతికి మన్మోహన్ ఒక లేఖ రాశారు. 'కాంగ్రెస్ నేతలు చెవులు పెద్దవిగా చేసుకుని నా మాటలు వినండి. మీరు హద్దులు దాటితే, నేను మోదీని, మీరు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది' అని మోదీ బెదిరించినట్టు మన్మోహన్ తన లేఖలో పేర్కొన్నారు.

05/14/2018 - 17:25

న్యూఢిల్లీ: సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో భర్త, కాంగ్రెస్ సీనియర్ నేత శిశథరూర్‌ పేరును ఢిల్లీ పోలీసులు ఛార్జిషీటులో చేర్చారు. సునంద ఆత్మహత్యకు ఆయన ప్రేరేపించినట్టు ఆ ఛార్జిషీటులో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. సోమవారం పటియాలా కోర్టులో ఛార్జిషీటును దాఖలు చేశారు.

05/14/2018 - 12:45

మధుర: ప్రముఖ నటి, భాజపా ఎంపీ హేమమాలినికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె ఆదివారం తన నియోజకవర్గమైన మధుర ప్రాంతంలోని మిథౌలీ గ్రామంలో ప్రయాణిస్తుండగా ఈదురుగాలులు, ఉరుముల కారణంగా ఓ చెట్టు విరిగి ఆమె కారు ముందు పడింది. ఒక్క క్షణం ముందు వచ్చినా ఆ చెట్టు ఆమె కారుపై పడి ఘోర ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు వెల్లడించారు.

05/14/2018 - 12:31

న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. పెట్రోలియం సంస్థలు 19 రోజుల తర్వాత ధరలను పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై 17 పైసలు, డీజిల్‌పై 21 పైసలను పెంచాయి. ధరల పెరుగుదలపై విపక్షాలు మండిపడుతున్నాయి.

05/14/2018 - 12:30

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు నేడు భారీ భద్రత నడుమ ప్రారంభమయ్యాయి. పోలింగ్‌ ప్రారంభమైన రెండు గంటల్లోనే నాలుగు జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన అల్లర్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు అందాయి. నార్త్‌ 24 పరగణాస్‌, బుర్ద్వాన్‌, కూచ్‌బెహర్‌, సౌత్‌ 24 పరగణాస్ జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఓట్ల లెక్కింపు ఈనెల 14న జరగనుంది.

05/14/2018 - 12:24

న్యూఢిల్లీ : దుమ్ము తుఫాను, ఈదురు గాలులు, భారీ వర్షంతో దేశ రాజధాని పూర్తిగా దుమ్ముతో నిండిపోయింది. నాలుగు ఇండ్లు కూలిపోయాయి. ఒక మహిళతోపాటు ఇద్దరు మృతి చెందగా, 18 మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పరిధిలో జాతీయ, అంతర్జాతీయ మార్గాల్లోని 70 విమాన సర్వీసులను దారి మళ్లించారు. సుమారు 24 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని గంటల పాటు రన్ వే నిలిపివేశారు.

05/14/2018 - 12:16

ఒడిశా: కాంధమాల్, బొలంగీర్ జిల్లాల్లో పోలీసులకు - మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. కంధమాల్‌లో ఐదుగురు, బొలంగీర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటన స్థలంలో భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు.

05/14/2018 - 05:00

చిత్రం:
ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ రెడ్‌కార్పెట్‌పై హొయలొలుకుతూ ఆహూతులను మరోసారి అబ్బురపరిచారు. ఊదారంగు సీతాకోక చిలుక డిజైన్ డ్రస్‌లో మెరిసిపోతున్న ఐష్. మరో ఈవెంట్‌లో తన అందంతో ప్రేక్షకులను మైమరపిస్తున్న ఫ్రెంచ్-ఇరానియన్ నటి గోల్‌షిఫ్తే ఫరహాని (ఎడమవైపు)

05/14/2018 - 04:22

బాగ్దాద్, మే 13: ఇరాక్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి హైదర్ ఆల్ అబాది ఆధ్వర్యంలోని పార్టీ మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ఆ తర్వాత స్థానంలో షియా వర్గానికి చెందిన మక్టోడా ఆల్ సదర్స్ కూటమి ఉన్నట్లు ఎన్నికల సంఘం వర్గాలు పేర్కొన్నాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని, ప్రాథమిక దశలో కౌంటింగ్‌లో వెలువడిన సమాచారం మాత్రమేనని వారు తెలిపారు. ఇరాక్‌లో గత కొన్ని సంవత్సరాలుగా అంతర్వుద్ధం జరిగింది.

Pages