S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/27/2018 - 18:03

బెంగళూరు : కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నేతృత్వంలో తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. మంగళవారం ఆయన దావణగేరెలో విలేకర్లతో మాట్లాడుతూ లింగాయత్, వీరశైవ లింగాయత్‌లకు ప్రత్యేక మతం, మైనారిటీ హోదా ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వంపై మండిపడ్డారు. యడ్యూరప్పను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవడానికే సిద్ధరామయ్య ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.

03/27/2018 - 17:53

న్యూఢిల్లీ: ఎన్నికల విషయంలోనైనా సమాచారం బయటపడకుండా ఎన్నికల సంఘం జాగ్రత్తలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్జే హితవు పలికారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తేదీని ఈసీ కంటే ముందే బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాలవీయ ఓ ట్వీట్‌లో పేర్కొనడంపై ఖర్గే ఘాటిగా స్పందించారు. ఒక రాజకీయ పార్టీకి ఇలాంటి సమాచారం ముందే అందడం అనేది గతంలో నేనెప్పుడూ చూడలేదు అని అన్నారు.

03/27/2018 - 17:48

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసే ప్రతిపాదన ఏదీ కేంద్రం పరిశీలనలో లేదని హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ అహిర్ మంగళవారంనాడు ఒక లిఖిత పూర్వక సమాధనంలో లోక్‌సభకు తెలిపారు.

03/27/2018 - 17:16

బెంగళూరు: అలనాటి నటి జయంతి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. బెంగళూరులో ఉంటున్న ఆమె కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వైధ్యుల సూచన మేరకు విక్రమ్‌ హాస్పిటల్‌ లో జాయిన్‌ చేశారు. ప్రస్తుతం జయంతికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆమె ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు.

03/27/2018 - 17:00

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ప్రధాని మోదీ కాళ్లకు తాను నమస్కరించానని టీడీపీ చేస్తున్న ఆరోపణలపై చర్చకు సిద్ధమేనని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. పార్లమెంట్ పుటేజీలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే టీడీపీ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నాని అన్నారు. ప్రజా సమస్యల గురించి తాను ప్రధానిని కలిస్తే విమర్శిస్తున్న టీడీపీ ఈరోజు రాజ్యసభలో ఆ పార్టీ నాయకులు చేసిందేమిటి అని ప్రశ్నించారు.

03/27/2018 - 16:59

న్యూఢిల్లీ: వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రుల పరువు తీశారని తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ.. మోదీ పాదాలపై పడతారు. బయటకు వచ్చి చంద్రబాబును విమర్శిస్తారు అని అన్నారు. ప్రధాని కాళ్లపై పడలేదని విజయసాయిరెడ్డి గుండెలపై చేయి వేసుకుని చెప్పాలని, ఆధారాలు చూపిస్తే రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు.

03/27/2018 - 16:59

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారంనాడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆమె వివిధ పార్టీల నేతలతో సమావేశమై బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఫ్రంట్‌ను ఏర్పాటు చేసే యత్నాల్లో ముమ్మరంగా ఉన్నారు. ఈరోజు ఆమె ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన నేత సంజయ్‌రౌత్, ఆర్జేడీ ఎంపీ మాసా భారతిలను కలుసుకున్నారు. రాబోయే ఎన్నికలు రసవత్తరంగా ఉంటాయని మమత తెలిపారు.

03/27/2018 - 16:57

అమరావతి: అఖిలపక్షం చేసే తీర్మానాన్ని అంగీకరించమని చెప్పినట్లు సిపిఎం కార్యదర్శి మధు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ నాలుగేళ్లు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటుచేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై సమావేశంలో వివరించామని లోక్‌సత్తా నాయకుడు గౌతమ్ పేర్కొన్నారు.

03/27/2018 - 13:41

తిరువనంతపురం: దుండగుల దాడిలో మాజీ రేడియో జాకీ రాజేశ్ ప్రాణాలు కోల్పోయాడు. తిరువనంతపురం శివారుల్లో ఉన్న రాజేశ్ సొంత స్టూడియోలోనే ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాజేశ్ పై మంగళవారం ఉదయం కొంతమంది వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అడ్డొచ్చిన స్నేహితుడు కుట్టన్‌పైనా దాడి చేశారు. వారిద్దరినీ హాస్పిటల్‌కు తరలించేలోపే రాజేశ్ ప్రాణాలు కోల్పోయాడు.

03/27/2018 - 13:30

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. అన్నాడీఎంకే, కాంగ్రెస్ సభ్యుల నిరసన మధ్య లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్, ఛైర్మన్‌లు ప్రకటించారు. లోక్‌సభ ప్రారంభంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ విపక్షాలు(టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్) ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను చదివి వినిపించారు. కాగా అన్నాడీఎంకే,కాంగ్రెస్ సభ్యుల మధ్య ఘర్షణలు తలెత్తాయి.

Pages