S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/30/2018 - 03:57

న్యూఢిల్లీ, మార్చి 29 : రైల్వే ఉద్యోగులు, లీవ్ ట్రావెల్ కనె్సషన్‌ను(ఎల్‌టిసి) ఉపయోగించుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీరికి ఇటువంటి సదుపాయం కల్పించడం ఇదే ప్రథమం. దీనికి సంబంధించిన సర్క్యులర్‌ను సిబ్బంది మంత్రిత్వశాఖకు చెందిన పబ్లిక్ గ్రీవెనె్సస్ అండ్ పెన్షన్ డిపార్ట్‌మెంట్ మార్చి 27న ఒక సర్క్యులర్ జారీ చేసింది.

03/30/2018 - 02:26

న్యూఢిల్లీ, మార్చి 29: ఎస్సీ/ఎస్టీల వేధింపుల చట్టంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడానికి కేంద్రం ఉద్యుక్తమవుతోంది. ఈ చట్టం కింద కేసు నమోదైన వెంటనే నిందితులను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో కేంద్రం ఈ చర్య తీసుకున్నది. బహుశా ఈ రివ్యూ పిటిషన్‌ను వచ్చే బుధవారం దాఖలు చేసే అవకాశముంది.

03/30/2018 - 02:19

న్యూఢిల్లీ, మార్చి 29: లోక్‌పాల్,లోకాయుక్తలను ఏర్పాటు చేయడంతోపాటు రైతాంగ సమస్యల పరిష్కరించడంలోనూ సత్వర చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే గురువారం తన ఏడు రోజుల ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. హజారేతో చర్చలు జరిపే విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ కేంద్ర ప్రభుత్వ మధ్యవర్తిగా వ్యవహరించారు.

03/30/2018 - 03:52

సూళ్లూరుపేట, మార్చి 29: రోదసీ పరిశోధనలో ఇస్రో మరో సరికొత్త రికార్డు సృష్టించింది. అంతరిక్ష ప్రయోగాల వినీలాకాశాలంలో భారత త్రివర్ణపతాకం మరోమారు రెపరెపలాడింది. స్వదేశీ క్రయోజనిక్‌తో మరోసారి మన శాస్తవ్రేత్తలు సత్తాచాటారు. ఇస్రో కీర్తికిరీటంలో మరో కలిగితురాయి చేరింది... అంతరిక్షంలో భారత్ మరోమైలురాయిని అధిగమించింది...

03/29/2018 - 17:24

శ్రీహరికోట: ఇస్రో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. జీఎస్‌ఎల్వీఎఫ్-08 ఉపగ్రహాన్ని ఇస్రో శాస్తవ్రేత్తలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ క్షిపణి రక్షణ, మొబైల్ రంగాల్లో నాణ్యమైన సేవలు అందిస్తోంది. దేశ సరిహద్దుల్లో 20 వేల కిలోమీటర్ల వరకు కదలికలను ఇది పసిగట్టగలదు. ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత సాధించిన తొలి విజయం.

03/29/2018 - 17:24

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ అవ్వటం దురదృష్టకరమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ దేవకర్ అన్నారు. ఆయన గురువారంనాడు మీడియాతో మాట్లాడుతూ.. ఓ తండ్రిగా తాను బాధపడుతున్నానని అన్నారు. పేపర్ లీక్‌తో సంబంధం ఉన్నవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని అన్నారు. ఎటువంటి అక్రమాలు జరగకుండా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

03/30/2018 - 04:04

న్యూఢిల్లీ: ఈ సంవత్సరపు అత్యంత ప్రభావ శీలుర జాబితాను ప్రఖ్యాత 'టైమ్' మేగజైన్ విడుదల చేయగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడిగా మరోమారు ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ల, చైనా అధ్యక్షుడు జన్ పింగ్ తదితరులకు స్థానం లభించినట్టు తెలుస్తోంది.

03/29/2018 - 13:18

న్యూఢిల్లీ: రాజ్యసభలో పదవీకాలం ముగిసిన సభ్యులకు వీడ్కోలు పలుకుతున్న సందర్భంగా బరువుపై నవ్వులు పూయించింది. తొలుత రేణుకా చౌదరి మాట్లాడుతూ... ‘‘ఆయనకు (వెంకయ్య) నేను ఎన్నో కిలోల ముందు నుంచి తెలుసు. సార్, చాలా మంది నా బరువు గురించి బాధపడుతున్నారు. అయితే మీరున్న స్థానంలో మీ బరువును అందరికీ సమానంగా పంచాల్సి ఉంటుంది..’’ అన్నారు. దీంతో వెంకయ్య తనదైన శైలిలో స్పందిస్తూ..

03/29/2018 - 12:11

న్యూఢిల్లీ: గుజరాత్‌ రాజ్‌కోట్‌లోని హంజియాసర్ స్వల్ప భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 4:03 గంటలకు ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.6గా నమోదైంది. ప్రకంపనల కారణంగా గాఢనిద్రలో ఉన్న ప్రజలంతా ఉలిక్కిపడి లేచారు. భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.

03/29/2018 - 11:56

హైదరాబాద్: ఎన్టీఆర్‌ స్ఫూర్తితో తెలుగు భాషను కాపాడుకోవాలని , తెలుగు వారంతా తెలుగులో మాట్లాడడమే ఎన్టీఆర్‌కు అసలైన నివాళి అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ బయోపిక్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వెంకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ జీవితాన్ని తెరకెక్కించడం సంతోషకరమన్నారు. సినిమా, రాజకీయాల్లో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని తెలిపారు.

Pages