S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/29/2018 - 04:47

న్యూఢిల్లీ, మార్చి 28: తెలుగుదేశం సభ్యుడు సీఎం రమేష్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రమేష్ చేసిన రాజీనామాను వెంటనే ఆమోదించినట్లు రాజ్యసభ అధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు బుధవారం సభలో ప్రకటించారు. రాజ్యసభలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రమేష్ తాజాగా ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నిక కావటం తెలిసిందే.

03/29/2018 - 04:44

న్యూఢిల్లీ, మార్చి 28: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ఆయనకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. విజయసాయి బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ చంద్రబాబుకు క్షమాపణలు చెప్పవలసిన అవసరం ఎంతమాత్రం లేదని అన్నారు. రాష్ట్రానికి హోదా అవసరం లేదు..

03/29/2018 - 05:19

న్యూఢిల్లీ, మార్చి 28: పాన్‌తో ఆధార్ అనుసంధానత గడువును ప్రత్యక్ష పన్నుల బోర్డు జూన్ 30 వరకూ పెంచిన నేపథ్యంలో సంక్షేమ పథకాల వినియోగానికి సంబంధించిన ఆధార్ గడువును కేంద్ర ప్రభుత్వం కూడా జూన్ 30 వరకూ పొడిగించింది. బ్యాంక్ ఖాతాలు, ఫోన్ నంబర్లను ఆధార్‌తో అనుసంధానం చేసే గడువును సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువడే వరకూ నిరవధికంగా పొడిగించిన విషయం తెలిసిందే.

03/29/2018 - 04:42

న్యూఢిల్లీ, మార్చి 28: తెలంగాణలో విశ్వవిద్యాలయాలను ప్రైవేట్ రంగంలో ప్రారంభించటం వలన వెనుకబడిన కులాలు, బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాలు దెబ్బతింటాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు. హనుమంతరావు బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు విశ్వవిద్యాలయాలను ప్రైవేట్ రంగంలో ప్రారంభించే ఆలోచనను విరమించుకోవాలని హితవు చెప్పారు.

03/29/2018 - 04:40

ముంబయి, మార్చి 28: ధనం కంటే ఆనంద, ఆరోగ్యకర జీవితమే మిన్న అన్న భావన మెజారిటీ భారతీయుల్లో వ్యక్తమవుతోంది. ధనార్జన కంటే కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఆనందంగా జీవించడానికే భారతీయులు ప్రాధాన్యతను ఇస్తారని, అలాగే విజయంలోనే ఆనంద ఉందన్న భావన వీరిలో చాలా బలంగా కనిపిస్తోందని తాజా సర్వేలో వెల్లడైంది.

03/29/2018 - 04:38

న్యూఢిల్లీ, మార్చి 28: పార్లమెంటులో వివిధ అంశాలపై ప్రతిపక్షాలు తమ హక్కును చాటుకోవడం ఎంతైనా సమంజసమని రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ ఉద్ఘాటించారు. గత కొన్ని రోజులుగా ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభలో వివిధ అంశాలపై ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తుతున్న అంశాలను, వ్యక్తం చేస్తున్న నిరసనను ఆయన గట్టిగా సమర్థించారు.

03/29/2018 - 04:37

న్యూఢిల్లీ: ‘నా వయసు 92. ఒక నేరస్తుడిగా మరణించడం నాకిష్టం లేదు. నా కేసును త్వరగా విచారించండి’ అంటూ అవినీతి కేసులో మూడేళ్ల జైలుశిక్ష పడిన మాజీ కేంద్ర మంత్రి సుఖరామ్ బుధవారం సుప్రీంకోర్టును అభ్యర్థించారు. 1993లో టెలికాం పరికరాల కొనుగోళ్ల ఒప్పందంలో అవినీతి జరిగిందని నిర్ధారించిన ట్రైల్ కోర్టు 2002లో సుఖరామ్‌కు జైలుశిక్ష విధించింది.

03/29/2018 - 04:36

హైదరాబాద్, మార్చి 28: కంది రైతులకు నాఫెడ్, మార్క్‌ఫెడ్, హాకా సంస్థలు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం శాసన మండలిలోని మినిస్టర్స్ చాంబర్‌లో వ్యవసాయ మార్కెటింగ్ అధికారులతో హరీష్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు 1415.19 కోట్లతో 2,59,669 మెట్రిక్ టన్నుల కందులను సేకరించినట్టు చెప్పారు.

03/29/2018 - 04:52

న్యూఢిల్లీ, మార్చి 28: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోజుకో వేషం కడుతున్న తెలుగుదేశం లోక్‌సభ సభ్యుడు శివప్రసాద్ బుధవారం నారదుడి వేషంలో లోక్‌సభకు వచ్చి అందరి దృష్టినీ ఆకర్షించారు. ‘నారాయణ.. నారాయణ’ అంటూ నారాయణ నాపం జపిస్తూ లోక్‌సభ అంతటా తిరుగుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలని ఎన్‌డీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి ఆయన చేశారు.

03/29/2018 - 05:02

న్యూఢిల్లీ, మార్చి 28: దురదృష్టవశాత్తూ విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ కార్యకలాపాలకు అడ్డుతగులుతుండటం వల్ల, కొద్ది రోజుల్లో రిటైరవుతున్న రాజ్యసభ సభ్యులు ట్రిపుల్ తలాక్ లాంటి చారిత్రక బిల్లులపై తమ వాణి వినిపించే అవకాశం లేకుండా పోతోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

Pages