S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/29/2018 - 05:26

న్యూఢిల్లీ: ఎనిమిది పార్టీలు ప్రతిపక్ష పార్టీలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం బుధవారం ఎనిమిదో రోజు కూడా లోక్‌సభలో చర్చకు రాలేదు. అన్నా డీఎంకే సభ్యులు పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హంగామా చేశారు. సభ ఆర్డర్‌లో లేనందున అవిశ్వాస తీర్మానాలను చర్చకు చేపట్టలేకపోతున్నానని స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.

03/28/2018 - 04:27

న్యూఢిల్లీ, మార్చి 27: రాజ్యసభలో మంగళవారం అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభను మరునాటికి వాయిదా వేసిన తర్వాత కూడా, కాంగ్రెస్ సహా పలు విపక్ష సభ్యులు తమ సీట్లలోనే 30 నిముషాల సేపు అట్లాగే కూర్చోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. బహుశా వెంకయ్యనాయుడు సభ వాయిదావేస్తూ తీసుకున్న నిర్ణయంపట్ల వారు తమ అసంతృప్తిని వారు ఆ విధంగా వ్యక్తం చేసి ఉండివుండవచ్చు.

03/28/2018 - 04:24

* అడ్డుపడిన సోనియా గాంధీ * లోక్‌సభ వాయిదా పడిన అనంతరం ఘటన

03/28/2018 - 04:16

బెంగళూరు, మార్చి 27: నాటి మేటినటి జయంతి మంగళవారం బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉదయం నుంచే ఆందోళనకరంగా కొనసాగిన ఆమె ఆరోగ్యపరిస్థితి, రాత్రి పొద్దుపోయిన తర్వాత మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ భాషల్లోని దాదాపు 500 చిత్రాల్లో నటించారు.

03/28/2018 - 03:23

న్యూఢిల్లీ, మార్చి 27: వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం రాజ్యసభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అభివాదం చేయటం వివాదాస్పదమైంది. మోదీ కాళ్లకు నమస్కరించిన విజయసాయి రెడ్డి ఆంధ్రుల అత్మాభిమానాన్ని దెబ్బతీశారని తెలుగుదేశం సభ్యుడు సీఎం రమేష్ ఆరోపిస్తుంటే విజయసాయిరెడ్డి మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నరేంద్ర మోదీకి నమస్కారం చేశాను తప్ప కాళ్లకు మొక్కలేదని ఆయన స్పష్టం చేశారు.

03/28/2018 - 04:05

న్యూఢిల్లీ, మార్చి 27: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన రోజునే బీజేపీపై దాడికి కాంగ్రెస్‌కు అద్భుత అవకాశం అమిత్ షా రూపంలో దక్కింది. ప్రత్యర్థిని విమర్శించబోయి, పొరబాటున సొంత పార్టీ సీఎం అభ్యర్థిపైనే అమిత్ అవినీతి వ్యాఖ్యలు చేయడం, కాంగ్రెస్‌కు కలిసొచ్చిన అంశంగా కనిపిస్తోంది.

03/28/2018 - 03:15

న్యూఢిల్లీ, మార్చి 27: డోక్లాం సమస్యపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘56 అంగుళాల ఛాతీ కలిగిన ఈ గట్టి మనిషి’’ డోక్లాం పరిస్థితిని ఎదుర్కొనే ప్రణాళికను సిద్ధం చేసే ఉంటారని భావిస్తున్నానంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

03/28/2018 - 03:28

న్యూఢిల్లీ: కాంగ్రెస్, బీజేపీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన కర్నాటక శాసనసభ ఎన్నికల నగారా మోగింది. 224 సీట్లకు మే 12న పోలింగ్ జరుగుతుంది.. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన మే 15న జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రావత్ మంగళవారం విలేఖరుల సమావేశంలో ప్రకటించారు.

03/28/2018 - 03:27

న్యూఢిల్లీ: తృతీయ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రండ్ ఏర్పాటుకు తెదేపా, తెరాస ఎంపీలు మంగళవారం ఢిల్లీలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పోటా పోటీ చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి, తెరాస ఎంపీ కల్వకుంట్ల కవిత మంగళవారం పార్లమెంటు ఆవరణలోని టీఎంసీ కార్యాలయంలో మమతను కలిశారు.

03/28/2018 - 01:03

న్యూఢిల్లీ, మార్చి 27: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని బలంగా ఢీకొనేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసిన ఆమె, మంగళవారం ఢిల్లీలో విస్తృతస్థాయిలో వివిధ పార్టీల నేతలతో మంతనాలు జరిపారు.

Pages