S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/29/2018 - 03:48

న్యూఢిల్లీ, మార్చి 28: ‘మన రాజ్య వ్యవస్థలోని నాణ్యతను దెబ్బతీయకండి’ అంటూ రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఉద్వేగంతో అన్నారు. మార్చి 5 నుంచి ప్రారంభమైన రెండోవిడత బడ్జెట్ సమావేశాలు ఏవిధమైన కార్యక్రమాలు చేపట్టకుండానే తీవ్ర గందరగోళం మధ్య కొనసాగుతున్న నేపథ్యంలో సభ నుంచి రిటైరవుతున్న 60 మంది సభ్యులనుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

03/29/2018 - 02:16

న్యూఢిల్లీలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం అనంతరం బీజేపీ నేతలు శతృఘ్నసిన్హా, యశ్వంత్‌సిన్హాలతో మమతా బెనర్జీ
* సోనియాకు మమత అభ్యర్థన
* 20 నిమిషాల పాటు విస్తృత భేటీ
* దేశవ్యాప్తంగా బీజేపీతో ముఖాముఖి పోటీ
* తృణమూల్ అధినేత్రి మమత ఉద్ఘాటన

03/29/2018 - 05:14

న్యూఢిల్లీ, మార్చి 28: ఎస్సీ, ఎస్టీ (వేధింపుల నివారణ) చట్టాన్ని నీరుకార్చే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో విపక్ష పార్టీలకు చెందిన నేతలు బుధవారం రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసారు. ఈ చట్టంపై సుప్రీంకోర్టు ఆదేశాలు ‘దళితుల్లో అభద్రతా భావా న్ని కలిగించాయని’ పేర్కొంటూ తక్షణమే ఈ విషయంలో కలుగజేసుకోవాలని వారు రాష్టప్రతిని కో రారు.

03/29/2018 - 05:25

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అభిశంసన తీర్మాన ప్రతిపాదనకు సమాజ్‌వాది పార్టీ సైతం మద్ద తు ప్రకటించడంతో, న్యాయవ్యవస్థలో కుదు పు మొదలైంది. అలాగే సీజేఐ దీపక్ మిశ్రాను అభిశంసించాలన్న డిమాండ్‌కు రాజకీయ పార్టీల మద్దతు మరింత పెరుగుతోంది.

03/28/2018 - 17:38

న్యూఢిల్లీ: పార్లమెంట్ జరగకుండా సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రధాని మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన బుధవారంనాడు రాజ్యసభలో మాట్లాడుతూ.. త్రిపుల్ తలాక్ వంటి బిల్లులు చర్చకు రాకుండా పోయాయని అన్నారు. పదవీ విరమణ చేస్తున్న రాజ్యసభ సభ్యులు సైతం చర్చలో పాల్గొనలేకపోయారని, ఎగువ సభలో జరిగినట్లు, రాజ్యసభలో జరగాల్సిన అవసరం లేదని అన్నారు.

03/28/2018 - 17:32

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాపై మళ్లీ యూటర్న్ తీసుకోవద్దని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నాలుగేళ్లు నిద్రపోయిన చంద్రబాబు నేడు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించినా.. అది విఫలపక్ష సమావేశం అయిందని విమర్శించారు. హోదా అంశాన్ని పక్కదారి పట్టించవద్దని అన్నారు.

03/28/2018 - 17:31

న్యూఢిల్లీ: సోమవారంనాడు పార్లమెంటులో అవిశ్వాసంపై చర్చ జరుగుతుందని భావిస్తున్నామని, ఒకవేళ జరగకపోతే రాజీనామాలు చేస్తామని వైకాపా ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. వారు బుధవారంనాడు విలేకరలతో మాట్లాడుతూ.. అవిశ్వాసంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని వెల్లడించారు.

03/28/2018 - 17:30

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ పరీక్షలకు సంబంధించి రెండు పేపర్లకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. 12 తరగతి ఎకనామిక్స్, పదవ తరగతి సంబంధించి మ్యాథ్స్ పేపర్‌ను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించినట్లు యాజమాన్యం వెల్లడించింది.

03/28/2018 - 17:35

న్యూఢిల్లీ: గాంధీ మహాత్ముని హత్య కేసు పునర్విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. డెబ్బయి సంవత్సరాల తరువాత ఈ కేసుపై పునర్విచారణ జరపటానికి గల కారణాలు సహేతుకంగా లేవని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, ఎల్. నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం పిటిషనర్ లేవనెత్తిన సందేహాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. 70 ఏళ్ల అనంతరం ఈ కేసును విచారణ చేపట్టలేమని వెల్లడించింది.

03/28/2018 - 14:24

చైనా: ‘కొరియా ద్వీపకల్పంలో అణ్వస్త్రాల నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని చైనా పర్యటనలో ఉన్నఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తెలిపారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ సందర్భంగా కిమ్‌ చెప్పినట్లు చైనా అధికారిక మీడియా వెల్లడించింది. మా ప్రయత్నాలకు దక్షిణకొరియా, అమెరికా సహృద్భావంతో స్పందించాలని కిమ్‌.. జిన్‌పింగ్‌తో అన్నట్లు చైనా మీడియా పేర్కొంది.

Pages