S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/15/2018 - 04:29

లక్నో/పాట్నా : ఉత్తరప్రదేశ్, బిహార్ ఉపఎన్నికల్లో భాజపాకు ఎదురుదెబ్బ తగిలింది. పోటీచేసిన మూడు మూడు స్థానాల్లో పరాజయం పాలుకావడం కమలనాధులకు మింగుడుపడటం లేదు. బుధవారం వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాల్లో, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్ స్థానాలు, బిహార్‌లోని అరారియా స్థానాల్లో ఓటమి చవిచూసింది. కంచుకోట వంటి గోరఖ్‌పూర్ స్థానం కోల్పోవడం పార్టీకి ఆశనిపాతమైంది.

03/15/2018 - 02:15

దేశంలోనే సుప్రసిద్ధమైన అజ్మీర్ దర్గా వద్ద బుధవారంనాడు భక్తుల సందడి.
ఈ నెల 19 నుంచి ఇక్కడ వార్షిక ఉర్సు ఉత్సవాలు ప్రారంభమవుతాయ.

03/15/2018 - 02:12

న్యూఢిల్లీ, మార్చి 14: ఉత్తరప్రదేశ్, బిహార్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ సభ్యులు ఓటమితో ఆ పార్టీ పతనం ఆరంభమైందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. యూపీలో ఉప ఎన్నిక జరిగిన రెండు ఎంపీ సీట్లలోనూ ఎస్పీ-బీఎస్పీ కూటమి అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులపై విజయం సాధించడం పట్ల అఖిలేష్ యాదవ్, మాయావతికి శుభాకాంక్షలు తెలిపారు.

03/15/2018 - 02:11

చిత్రం..రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం పార్లమెంటు ఆవరణలో నినాదాలిస్తున్న తెలంగాణ ఎంపీలు

03/15/2018 - 01:53

న్యూఢిల్లీ, మార్చి 14: భౌతికంగా కేవలం వీల్‌ఛైర్‌కే పరిమితమైనా, సువిశాల విశ్వలోతుల్లోని నిగూఢతలను తన మేథస్సుతోఅధ్యయనం చేసి, ఆ ఫలితాలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చిన మహానుభావుడిగా స్టీఫెన్ హాకింగ్‌ను నేటి భారతీయ విద్యార్థులు గుర్తుంచుకుంటారు.

03/15/2018 - 01:50

న్యూఢిల్లీ, మార్చి 14: కృత్రిమ మేథస్సు ఎంత అభివృద్ధి చెందితే, మానవ వినాశనానికి సమయం అంత దగ్గర పడుతున్నట్టేనని ప్రఖ్యాత భౌతిక శాస్తవ్రేత్త స్టీఫెన్ హాకింగ్ ఇప్పటికి అనేకసార్లు హెచ్చరించారు. కృష్ణబిలాలు, గురుత్వాకర్షణ శక్తిపై అప్రతిహత పరిశోధనలు చేసి, ఖగోళ గతిని కాలం కోణంలో మానవాళికి కొత్తగా పరిచయం చేసిన అపర మేధావి ఇటీవలి కాలంలో మానవ లోకాన్ని పదేపదే హెచ్చరించిన విషయం తెలిసిందే.

03/15/2018 - 01:46

న్యూఢిల్లీ, మార్చి 14: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఈ సభలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే పార్లమెంటు ఉభయ సభల్లో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగిపోతుందంటూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు జయరాం రమేష్ రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు.

03/15/2018 - 01:32

అహ్మదాబాద్, మార్చి 14: గుజరాత్ శాసనసభలో బుధవారం యుద్ధవాతావరణం నెలకొంది. అధికార, ప్రతిపక్ష సభ్యులు కొట్లాటకు దిగారు. బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుల ముష్టిఘాతాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో సభ దద్దరిల్లిపోయింది. ఈ నేపథ్యంలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు అయ్యేవరకూ సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

03/15/2018 - 04:27

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి వౌర్య ఖాళీచేసిన లోక్‌సభ సీట్లు గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు భారీ విజయం సాధించటం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతోపాటు మొత్తం బీజేపీని షాక్‌కు గురిచేసింది.

03/14/2018 - 18:02

లక్నో: యూపీ, బీహార్ ఉప ఎన్నికల్లో అతి విశ్వాసమే తమ ఓటమికి కారణమని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాద్ అన్నారు. ఆయన ఓటమిపై మాట్లాడుతూ..ఇది మాకు ఓ గుణపాఠం, ఎస్పీ, బిఎస్పీ కలయికను తక్కువ అంచనా వేశామని అన్నారు.

Pages