S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/14/2018 - 04:03

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఒక బస్సు లోయలో పడిపోయిన సంఘటనలో 13 మంది మృతిచెందగా, 12 మంది గాయపడ్డారు. బస్సు అల్మోరా జిల్లా హెడ్‌క్వార్టర్‌కు 120 కి.మీ దూరంలోని పోటమ్ ప్రాంతంలో ప్రమాదానికి గురైందని జిల్లా మేజిస్ట్రేట్ ఇవా ఆశిశ్ శ్రీవాత్సవ విలేఖరులకు తెలిపారు. మరణించినవారిలో బస్సు డ్రైవర్ కూడా ఉన్నాడని, గాయపడ్డ 12 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో రామ్‌నగర్ ఆసుపత్రికి తరలించారు.

03/14/2018 - 00:07

గౌహతి, మార్చి 13: ఈశాన్య రాష్ట్రాలలో క్యాన్సర్ వ్యాధిపై ప్రజలను జాగృతం చేసేందుకు సుమారు 2,200 కిలో మీటర్ల దూరం జరుపనున్న తమ యాత్రను వైద్యుల బృందం, బైకర్లు ప్రారంభించారు. వీరు తమ యాత్ర పొడవునా వీధి నాటకాలు ప్రదర్శిస్తూ, ప్రజలతో చర్చలు జరుపుతూ క్యాన్సర్ వ్యాధిపై ప్రజలను చైతన్యవంతం చేస్తారు.

03/14/2018 - 03:42

న్యూఢిల్లీ, మార్చి 13: మంత్రుల దగ్గర నుంచి అధికారుల వరకూ డ్యామ్‌లు నిర్మాణమంటే అమితానందం చూపిస్తారని, పరివాహక ప్రాంతాల అభివృద్ధి మాత్రం వారికి ఏమాత్రం శ్రద్ధ ఉండదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. డ్యామ్‌ల నుంచి వచ్చే నీటిని సద్వినియోగం చేసుకోవడంపై మాత్రం వారికి ఏ మాత్రం శ్రద్ధ చూపరని ఆయన అన్నారు.

03/14/2018 - 00:06

న్యూఢిల్లీ, మార్చి 13: విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయవలసిందేనని తెలుగుదేశం లోక్‌సభ సభ్యుడు కింజారపు రామమోహన్ నాయుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం గోయల్‌కు లేఖ రాశారు.

03/14/2018 - 00:05

కోహిమా, మార్చి 13: నాగాలాండ్‌లో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నీఫియూ రియో మంగళవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్ష విజయం సాధించారు. ఈ నెల 8న రియో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 60 మంది సభ్యులున్న అసెంబ్లీలో రియోకు అనుకూలంగా 33 ఓట్లు, వ్యతిరేకంగా 26 ఓట్లు పడ్డాయి. ఎన్నికలు జరిగిన 59 స్థానాల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలందరూ విశ్వాస పరీక్షలో పాల్గొన్నారు.

03/13/2018 - 17:32

న్యూఢిల్లీ: బ్యాంకులు, మొబైల్ నంబర్లతో ఆధార్ అనుసంధానానికి 'మార్చి 31' డెడ్ లైన్ అంటూ జరుగుతున్న ప్రచారంపై స్పష్టత ఇచ్చింది. తుది తీర్పు వచ్చేవరకు ఎలాంటి డెడ్‌లైన్లు లేవని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ బెంచ్‌కు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ..

03/13/2018 - 16:39

న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై మావోయిస్టుల మెరుపుదాడిపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సుక్మా జిల్లాలో కిస్తారాం-పలోడీ జిల్లాల మధ్య జరిగిన ఐఈడీ పేలుడుపై ఆయన మంగళవారం ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ దుర్ఘటనలో అమరులైన తొమ్మిది మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లకు నివాళులర్పించారు. గాయపడిన జవాన్లు సత్వరం కోలుకోవాలని ఆకాంక్షించారు.

03/13/2018 - 16:33

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కార్తీ చిదంబరం పెట్టుకున్న దరఖాస్తుపై మంగళవారంనాడు హైకోర్టులో విచారణ జరిగింది. వాదనల అనంతరం ఈ కేసుకు సంబంధించిన స్థాయీ నివేదికను ఈనెల 16లోగా తమకు అందజేయాలని, అలాగే కార్తీ చిదంబరం బెయిల్ అభ్యర్థనపై సమాధానం ఇవ్వాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.

03/13/2018 - 16:31

న్యూఢిల్లీ : విదేశీ న్యాయవాద సంస్థల న్యాయవాదులు విదేశీ చట్టాలపై న్యాయ సలహాలు ఇవ్వవచ్చునని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రవర్తనా నియమావళికి లోబడి పనిచేయవలసిందేనని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. విదేశీ న్యాయవాద సంస్థలు భారతదేశంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేయరాదని పేర్కొంది. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.

03/13/2018 - 16:22

న్యూఢిల్లీ: అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపితే తప్పా? అని ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ కుంతియా నిలదీశారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ సభ్యత్వం రద్దు అప్రజాస్వామికమని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెండ్‌ను ఖండిస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎలాంటి తప్పుచేయలేదని కుంతియా పేర్కొన్నారు.

Pages