S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/14/2018 - 11:46

న్యూఢిల్లీ: ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు లోక్‌సభను స్తంభింప చేశారు.. బుధవారం ఉదయం సభ మొదలైన వెంటనే ఎంపీల ఆందోళనతో వాయిదా పడింది. విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలంటూ ఎంపీలు సభలో నినాదాలు చేశారు. పోడియంను చుట్టుముట్టి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సభలో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.

03/14/2018 - 04:09

న్యూఢిల్లీ: క్షయవ్యాధి నిర్మూలనకు ప్రపంచ స్థాయిలో జరుగుతున్న కృషి విజయవంతం కాలేదని, ఈ వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించాలనే లక్ష్యాన్ని సాధించాలంటే ఆ దిశగా మన దృక్పథం మారాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

03/14/2018 - 02:05

న్యూఢిల్లీ, మార్చి 13: పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారం ఏడో రోజు కూడా ప్రతిపక్షం, స్వపక్షం చేసిన గొడవ మూలగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండానే వాయిదాపడ్డాయి. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్‌ఆర్‌సీపీతోపాటు అన్నా డీఎంకే, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలిస్తూ సభను స్తంభింపజేశారు.

03/14/2018 - 02:03

న్యూఢిల్లీ, మార్చి 13: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన బృహత్తర రాజకీయ వ్యూహంపై చర్చించేందుకు యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ మంగళవారం 20మంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలకు విందు ఇచ్చారు. కేంద్రంలోని అధికార బీజేపీని నిలువరించేందుకు ఏ విధంగా ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేసుకోవాలన్న అంశంపై ఈ సందర్భంగా విస్తృత చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

03/14/2018 - 02:01

రుషికేష్, మార్చి 13: హిమాలయాల్లో రెండు వారాల ఆధ్యాత్మిక పర్యటనకు వచ్చిన తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తాను ఇంకా పూర్తిస్థాయి రాజకీయ నాయకుణ్ని కాదని స్పష్టం చేశారు. ‘ఇప్పటికైతే నేను కొత్త రాజకీయ పార్టీని ప్రకటించలేదు. కాబట్టి రాజకీయాల గురించి నేనేమీ మాట్లాడదలచుకోలేదు. ప్రస్తుతానికి నేను పరిపూర్ణ రాజకీయవేత్తను కాదు’ అని రజనీ అన్నారు.

03/14/2018 - 01:59

న్యూఢిల్లీ, మార్చి 13: భూమీద సకల జీవకోటి ధైర్యంగానే ఉన్నా, మట్టిగోళానికి మాత్రం అనుక్షణం ముచ్చెమటలు పడుతూనే ఉన్నాయి. కారణం విశ్వం నుంచి భూగ్రహం వైపు దూసుకొచ్చే శకలాలు. ఏక్షణంలో ఏ ఆస్టరాయిడ్ తన ఉనికిని ప్రదర్శిస్తుందో, భూమిని తాకి ఎంతటి విపత్తు సృష్టించనుందోనన్న భయాందోళన మట్టిగోళానికి మామూలే. భూమికి విశ్వం నుంచి ఆస్టరాయిడ్ల రూపంలో పొంచివున్న ముప్పు కొత్తేమీ కాకపోవచ్చు.

03/14/2018 - 04:04

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 29వ తేదీన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 08 రాకెట్ ప్రయోగం, ఏప్రిల్ రెండో వారంలో పీఎస్‌ఎల్‌వీ-సీ 41 రాకెట్ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. ఇందులో జీఎస్‌ఎల్‌వీ ద్వారా జీశాట్-6ఎ సమాచార రంగానికి చెందిన ఉపగ్రహాన్ని, పీఎస్‌ఎల్‌వీ-సీ 41 రాకెట్ ద్వారా నావిగేషన్ వ్యవస్థకు సంబంధించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు.

03/14/2018 - 01:27

ముంబయి, మార్చి 13: ఎంత ఆగ్రహంతో వచ్చిందో అంతకుమించిన ఆనందంతో రైతాంగం వెనుతిరిగింది. అప్పులు, ఆత్మహత్యలు తప్ప రైతు బతుకుకు మరో మార్గం లేదా? అంటూ తీవ్ర ఆగ్రహంతో పాదం బిగించి ముంబయిని చుట్టుముట్టిన వేలాది రైతులు, అనూహ్య విజయంతో ముంబయి నుంచి ఇంటి ముఖంపట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచీ కదిలిన రైతు దండును చూసి ముచ్చెమటలు పట్టిన మహా సర్కారు, డిమాండ్లకు తలొగ్గి రైతును శాంతపర్చడం తెలిసిందే.

03/14/2018 - 00:53

న్యూఢిల్లీ, మార్చి 13: బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్లతో ఆధార్ అనుసంధానం గడువును సుప్రీం కోర్టు పొడిగించింది. బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్లతో అనుసంధానం తుది తీర్పు వెలువడే వరకూ చేసుకోవచ్చని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. వాటికి ఆధార్ లింక్ తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారధ్యంలోని ధర్మాసనం వెల్లడించింది.

03/14/2018 - 00:09

జోద్‌పూర్, మార్చి 13: రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో ‘్థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ చిత్రం షూటింగ్ సమయంలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురయ్యారు. దానితో ఆయనకు చికిత్స చేసేందుకు వైద్యుల బృందం సెట్స్‌కు తరలి వచ్చి ఆయనకు చికిత్స చేసింది. తనకు బాగానే ఉందని, మళ్లీ తనను నిలబెట్టేందుకు వైద్యులు చికిత్సచేస్తున్నారని బచ్చన్ తన బ్లాగ్‌లో తెలిపారు.

Pages