S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/26/2018 - 02:54

న్యూఢిల్లీ, జనవరి 25: వ్యాపార, వాణిజ్య తీరప్రాంత భద్రతతోపాటు అనేక ద్వైపాక్షిక అంశాలపై వ్యూహాత్మక సాన్నిహిత్యానికి భారత్-ఆసియాన్ దేశాలు చేరువయ్యాయి. విలువ ఆధారిత సమాజాల నిర్మాణం విషయంలో ఆసియాన్ దేశాల ఆశయాలు, దృక్పథాలను భారత్ పంచుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

01/26/2018 - 02:52

జగిత్యాల, జనవరి 25: అక్రమ వలసదారులపై కువైట్ క్షమాభిక్ష (అమ్నెస్టీ) ప్రకటించింది. దీంతో అక్రమంగా ఉంటున్న ప్రవాసులు ఎలాంటి జరిమానా, జైలుశిక్షలు లేకుండా స్వదేశానికి తిరిగి వెళ్ల్లిపోవడానికి వీలు కలుగుతుంది. అయితే ఆమ్నెస్టీతో ఇచ్చిన గడువు చాలా తక్కువ కావడంతో ఒకపక్క కువైట్‌లో చిక్కుకున్న కంపెనీ అవతలి కార్మికుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

01/26/2018 - 02:51

పనాజీ, జనవరి 25: మహాదాయి నదీ జలాల వివాదం నేపథ్యంలో కర్ణాటకలో గురువారం బంద్ కొనసాగుతుండటంతో ఆ రాష్ట్రానికి బస్సు సర్వీసులను గోవా ప్రభుత్వం రద్దు చేసింది. కర్ణాటక, గోవాల మధ్య మహాదాయి నదీ జలాల పంపిణీకి సంబంధించి వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో బంద్ దృష్ట్యా ‘కదంబ రవాణా సంస్థ లిమిటెడ్’ (కెటిఎల్‌సీ) బస్సులను నిలిపివేసినట్లు గోవా ప్రకటించింది.

01/26/2018 - 02:51

జమ్ము, జనవరి 25: సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా తాము సహించేది లేదని భారత్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ సరిహద్దులో బిఎస్‌ఎఫ్, పాక్ రేంజర్ల మధ్య గురువారం జరిగిన సెక్టర్ కమాండర్ల స్థాయి సమావేశంలో భారత్ తన నిరసనను తీవ్ర స్థాయిలో తెలిపింది.

01/26/2018 - 02:50

న్యూఢిల్లీ/ముంబయి, జనవరి 25: అనేక వివాదాల నడుమ గురువారం నాడు విడుదలైన ‘పద్మావత్’ సినీ ప్రేక్షకులను అలరిస్తోంది. సంజయ్ లీలా భన్సాలీ చిత్రం ప్రదర్శించిన కొన్ని థియేటర్ల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మెయిన్ రోల్ పోషించిన దీపికా పదుకొనే నటనకు సినీ ప్రియులు ఫిదా అయ్యారు. పద్మావత్ విడుదలకు ముందు రోజు ఆందోళనకారులు పలు రాష్ట్రాల్లో హింసకు పాల్పడ్డారు. గుర్‌గావ్‌లో ఓ స్కూలు బస్సుకు నిప్పుపెట్టారు.

01/26/2018 - 02:46

న్యూఢిల్లీ, జనవరి 25: వివాదాస్పద హిందీ చలన చిత్రం ‘పద్మావత్’ను అడ్డుకోరాదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, కర్ణిసేన ఉల్లంఘిస్తున్నాయని సర్వోన్నత న్యాయస్థానంలో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఈ నెల 29న విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు గురువారం ప్రకటించింది.

01/26/2018 - 01:59

న్యూఢిల్లీ, జనవరి 25: దేశ జనాభాలో 60 శాతం మంది 30 ఏళ్లలోపు వయసువారేనని, మన ఆశలన్నీ వారిపైనే కేంద్రీకృతమై ఉన్నాయని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. రాష్టప్రతి పదవి చేపట్టాక ఆయన తన తొలి గణతంత్ర దినోత్సవ సందేశాన్ని జాతికి ఇచ్చారు. 21వ శతాబ్ది అవసరాలను అవగతం చేసుకుని విద్యా వ్యవస్థను మరింతగా సంస్కరించాల్సి ఉందన్నారు.

01/26/2018 - 01:57

న్యూఢిల్లీ, జనవరి 25: దేశ రాజధానిలో శుక్రవారం జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆసియాన్ దేశాధినేతలు హాజరవుతున్నందున నిఘా చర్యలను విస్తృత స్థాయిలో తీసుకున్నారు. వేడుకల సందర్భంగా ఆకాశం నుంచి భూభాగం వరకూ అన్ని కోణాల్లోనూ నిఘా కొనసాగిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ నగరంలో, శివారు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. వేలాదిమంది సాయుధ పోలీసులు అడుగడుగునా మోహరించారు.

01/26/2018 - 01:55

న్యూఢిల్లీ, జనవరి 25: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాతోపాటు మొత్తం 85 మందికి పద్మా అవార్డులు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఒకే ఒక్కరికి పద్మశ్రీ అవర్డు లభించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌కు పద్మశ్రీ అవార్డు ప్రకటించారు. మొత్తం 85లో ముగ్గురికి పద్మ విభూషన్, తొమ్మిది మందికి పద్మభూషన్, 73 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి.

01/26/2018 - 01:28

న్యూఢిల్లీ, జనవరి 25: ఏఐసిసి జాయింట్ సెక్రటరీగా కృష్ణ అల్లవారును ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. యూత్ కాంగ్రెస్‌కి ఇన్‌చార్జిగా సేవలు అందిస్తున్న ఏఐసిసి సెక్రటరీ సురజ్ హెగ్డే స్థానంలో ఇక మీదట కృష్ణ అల్లవారు యూత్ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా కొనసాగనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఒక ప్రకటనను గురువారం విడుదల చేసింది.

Pages