S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/30/2018 - 03:21

న్యూఢిల్లీ, జనవరి 29: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించడం ద్వారా ముస్లిం మహిళలకు నూతన సంవత్సరం బహుమతి ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. మోదీ సోమవారం బడ్జెట్ సమావేశాశాల ప్రారంభం సందర్భంగా పార్లమెంటు నాలుగో నంబర్ గేట్ వద్ద విలేఖరులతో ముచ్చటించారు.

01/30/2018 - 01:35

న్యూఢిల్లీ, జనవరి 29: దేశంలోని కోట్లాది మంది ముస్లిం మహిళల ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్దేశించిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం లభిస్తుందనే ఆశాభావాన్ని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ వ్యక్తం చేశారు. కోవింద్ సోమవారం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించటం ద్వారా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రారంభించారు.

01/30/2018 - 01:29

న్యూఢిల్లీ, జనవరి 29: భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలాన్ని పుంజుకుంటోందని జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు ప్రభావం నుంచి కోలుకుని 7 నుంచి 7.5 శాతం వృద్ధి దిశగా పరుగులు పెడుతోందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. 2018-19 సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత వేగంతో ముందుకు సాగుతున్న ఆర్థిక వ్యవస్థగా మారబోతోందని ఈ సర్వే వెల్లడించింది.

01/30/2018 - 01:05

న్యూఢిల్లీ, జనవరి 29: తెలంగాణ సంస్కృతి కళారూపాలు దేశ రాజధానిలోని ఎర్రకోట వద్ద ఏర్పాటుచేసిన ‘్భరత్‌పర్వ్’లో అందరినీ ఆకట్టుకున్నాయి. దేశవ్యాప్తంగా విభిన్న కళలు, సంస్కృతులు, సంప్రదాయాలను ఒక్కచోట చేర్చే లక్ష్యంతో కేంద్ర పర్యాటక శాఖ ‘్భరత్‌పర్వ్’ పేరుతో జనవరి 26 నుంచి 31 వరకు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం తెలంగాణ డే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.

01/29/2018 - 04:11

న్యూఢిల్లీ, జనవరి 28: తమ ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాల ఎంపికను పారదర్శకంగా నిర్వహిస్తోందని, ఎలాంటి ప్రచారానికి నోచుకోని సామాన్యులకు ఈ అవార్డులను ఇస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సిఫార్సుల ప్రాతిపదికపై కాకుండా, వ్యక్తుల సేవలను గుర్తించి ‘పద్మ’ అవార్డులను అందజేస్తున్నామన్నారు. నూతన సంవత్సరంలో తన తొలి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన దేశ ప్రజలనుద్దేశించి ఈ మాటలన్నారు.

01/29/2018 - 03:13

కోల్‌కతా, జనవరి 28: కొత్త సారథి, కొత్త రక్తంతో కాంగ్రెస్ పూర్వవైభవం సంతరించుకుంటోందని చెప్పడానికి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కటిచాలని పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ అన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికలకు పార్టీలో కొత్త రక్తాన్ని నింపేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న తరుణంలో, సీనియర్లు కొత్తతరానికి సలహాదారులుగా ఉండాలేతప్ప నొప్పించేవాళ్లలా కాదన్నారు.

01/29/2018 - 03:12

కాస్‌గంజ్, జనవరి 28: రెండురోజుల పాటు అల్లర్లతో అట్టుడికి కాస్‌గంజ్ పట్టణంలో ప్రశాంతత ఏర్పడింది. ఆదివారం జిల్లా అధికారులు శాంతి కమిటీ సమావేశానికి ఏర్పాటు చేసి, అందరూ శాంతిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వీహెచ్‌పీ, ఏబీవీపీ నిర్వహించిన బైక్ ర్యాలీపై రాళ్ల దాడి అనంతరం అల్లర్లతో కాస్‌గంజ్ ప్రాంతం అట్టుడికిపోయిన విషయం తెలిసిందే.

01/29/2018 - 03:11

న్యూఢిల్లీ, జనవరి 28: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి ఈ బడ్జెట్ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించాలని అఖిలపక్ష సమావేశంలో కేంద్రాన్ని కోరినట్టు టీడీపీ లోక్‌సభా పక్షం నాయకుడు తోట నర్సింహం తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ నేతృత్వంలో అన్ని పార్టీల ఎంపీలతో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది.

01/29/2018 - 03:10

పోలియో రహిత భారత్ లక్ష్యంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం
దేశవ్యాప్తంగా నిర్వహించారు. అగర్తలాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పసిపిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్న దృశ్యం

01/29/2018 - 02:59

శ్రీనగర్, జనవరి 28: జమ్మూకాశ్మీర్‌లో శనివారం జవాన్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతిచెందిన ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. షోపియాన్ జిల్లా గనౌపూరా ప్రాంతంలో ఆర్మీ కాన్వాయ్‌పై స్థానికులు కొందరు రాళ్లదాడికి పాల్పడిన సందర్భంలో ఆత్మరక్షణ కోసం జవాన్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు.

Pages